»   »  పట్టాలు తప్పింది (ధనుష్ 'రైల్' రివ్యూ)

పట్టాలు తప్పింది (ధనుష్ 'రైల్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
తమిళ స్టార్ హీరో ధనుష్ కు ఇక్కడ తెలుగులోనూ మంచి మార్కెట్టే ఉంది. ఆ మధ్యన వచ్చిన రఘువరన్ బిటెక్ చిత్రం కూడా ఇక్కడ సూపర్ హిట్ అయ్యి డబ్బులు తెచ్చి పెట్టింది. అయితే ఏ డబ్బింగ్ చిత్రం అయినా ఇక్కడ ఆడాలంటే ఖచ్చితంగా అందులో మంచి కథా, కథనం ఉండి తీరాల్సిందే. లేకపోతే ఇదిగో ధనుష్ తాజా చిత్రం 'రైల్'లా పట్టాలు తప్పుతుంది.

ధనుష్ హీరోగా నటించిన 'తొడరి' తెలుగులో 'రైల్' అన్న టైటిల్‌తో డబ్ అయి ఒకేసారి తమిళ వర్షన్‌తో పాటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓ పూట లేటుగా మన దగ్గర రిలీజైంది. చిత్రం కథేమిటి...హైలెట్స్, మైనస్ లు ఏమిటో ఇక్కడ చూద్దాం. పట్టాలు తప్పటానికి కారణం ఎక్కడుందో కనుక్కుందాం.

చిత్రం కథేమిటంటే... ఆ రోజు డిల్లీ - చెన్నై ఎక్సప్రెస్ లో ప్రయాణికులతో పాటు ఓ సినిమా హీరోయిన్‌.. తమిళనాడుకి చెందిన మంత్రి కూడా ఉంటారు. అదే రైల్లో శివాజీ (ధనుష్‌) వెండర్ గా పని చేస్తుంటాడు. ఓ హీరోయిన్ కు టచప్ గర్ల్ గా పనిచేస్తున్న సరోజ (కీర్తి సురేష్‌) ని తొలి చూపులోనే ప్రేమించిన శివాజీ, ఆమెకు పెద్ద సింగర్ అవ్వాలనే కోరిక ఉందని తెలుసుకుని , ఆ విషయంలో అబద్దాలు చెప్పి దగ్గర అవుతాడు.కానీ కాస్సేపటికే నిజం తెలిసిపోయి దూరం అవుతుంది.


అయితే ఈ లోగా ట్రైన్ కి అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. ఓ దొంగల ముఠా రైలెక్కి అందరినీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్లకు బుద్ది చెబుతూ... శివా శివాజీ.. సరోజ ట్రైన్‌ టాప్‌ ఎక్కేస్తారు. మరో వైపు మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకడు శివాజీపై కక్ష పెట్టుకొని అతడిని తరుముతూ ఉంటాడు. వీటితో పాటు రైలుకి సాంకేతికపరమైన సమస్యలు ఎదురవుతాయి.


ఈ లోగా ఈ ట్రైన్ విషయమై మీడియాకు ఉప్పందుతుంది అక్కడ్నుంచి మీడియా రచ్చ మొదలువుతుంది. ట్రైన్ లో టెర్రరిస్టులు ఉగ్రవాదులున్నారన్న ప్రచారం మొదలై ఊపందుకుంటుంది. టాప్ పైకి ఎక్కిన శివాజీ.. సరోజలే ఆ టెర్రరిస్టులని పోలీసులు భావించి రైలుని వెంబడిస్తారు. ఆ తరవాత ఏమైంది? అసలు రైల్లో ఏం జరిగింది? చివరికి ఏమైంది? అనేదే చిత్ర కథ.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ చదవండి...


 అదే బ్రేక్ లు వేసేసింది

అదే బ్రేక్ లు వేసేసింది


మన తెలుగు డైరక్టర్ శ్రీను వైట్ల పూనాడా అన్నట్లుగా ట్రైన్ లో కామెడీని చేస్తూ నడిపించేద్దామనే దర్శకుడు ప్రయత్నం సినిమాని ఎక్కడికి అక్కడ బ్రేక్ లు వేసేసింది. కామెడీని తగ్గించుకుని, కథ మీద దృష్టి పెట్టి ఉంటే సినిమా ఫెరఫెక్ట్ గా ఉండేది. డీవియేషన్ ఉండేది కాదు 'అన్‌ స్టాపబుల్‌' అనే హాలీవుడ్‌ నుంచే

'అన్‌ స్టాపబుల్‌' అనే హాలీవుడ్‌ నుంచే

వాస్తవానికి దర్శకుడు ప్రభు సాల్మాన్‌ ఎంచుకొన్న కథ ఆసక్తికరంగానే ఉంది. అలాగే సినిమా చూస్తున్నప్పుడు 'అన్‌ స్టాపబుల్‌' అనే హాలీవుడ్‌ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఈ కథని అల్లుకున్నట్లు మనకు అర్దం అవుతుంది. కానీ మనకు మధ్యలో వచ్చే కామెడీనే మింగుడు పడదు. నవ్వు తెప్పించినా అసలు కథను బ్రేక్ చేస్తూ ఇంట్రస్ట్ ని తగ్గించేస్తూంటుంది. ఫీల్ ఏది, కేవలం ధ్రిల్లే

ఫీల్ ఏది, కేవలం ధ్రిల్లే


ఈ సినిమాకు మరో మైనస్ ఏమిటీ అంటే...సినిమాను కాస్సేపు లవ్ స్టోరీగా మరికాస్సేపు థ్రిల్లర్‌గా చూపించాలనే దర్శకుడు తాపత్రయమో. ఎందుకంటే.. లవ్ సీన్లలో ఉండాల్సిన పీల్ మిస్సైంది. మన దృ ష్టి అంతా..,,,ట్రైన్‌ ఏమవుతుందోనన్న టెన్షన్‌ పెద్దగా లేకపోవటంతో ఏదో తగ్గినట్లుగా అనిపిస్తూంటుంది. ఒకే పాయింట్ చుట్టూ అల్లటమే...

ఒకే పాయింట్ చుట్టూ అల్లటమే...


ఈ సినిమా అంతా రైల్‌ నేపథ్యంలోనే , రైల్ లోనే నడవటం కొత్తగానే అనిపించినా.. సింగిల్ ధ్రెడ్ పట్టుకుని ఒకే అంశం చుట్టూ రెండున్నర గంటల కథ నడపడం చూడటానికి ఇబ్బంది పెట్టే అంశణే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, థ్రిల్‌ సమపాళ్లలోనే మేళవించినా.. అవి పండటంలో కాస్త తడబడినట్లుగా మనకు అర్దం అవుతూంటుంది.సెకండాఫే కొట్టింది

సెకండాఫే కొట్టిందిసినమా సెకండాఫ్‌లో కథంతా దారితప్పడమే ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా మారింది. ఒక రైలు అదుపుతప్పి వందల ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కామెడీ చేస్తుంటే చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సీన్ లలో ఎమోషన్‌ను కాకుండా వేరేదో కామెడీ ఇరికించడానికి చేసిన ప్రయత్నం బాగోలేదు. లాజిక్, క్లారిటీ రెండూ మిస్సయ్యాయి

లాజిక్, క్లారిటీ రెండూ మిస్సయ్యాయి


ఇక సినిమా సెకండాఫ్ అంతా లాజిక్ అన్నదే లేకుండా సాగిపోవటం విచిత్రంగా ఉంటుంది. రైలు ప్రమాదానికి గురయ్యే సమయంలో తీసుకునే చర్యలు, హీరో గారి ఫైట్లు అన్నీ ఓవర్ అనిపిస్తూంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంతా రైలు పై భాగంలోనే నడుస్తూ ఉంటుంది. అక్కడ వచ్చే సన్నివేశాలు కూడా లాజిక్‌ను పక్కనపడే, అల్లేసి చిత్రీకరించారు. ఇక హీరో, హీరోయిన్ల లవ్‌ కూడా క్లారిటీగా లేదు. రన్ టైమ్ ఎక్కువే

రన్ టైమ్ ఎక్కువే


ఇక సెకండాఫ్‌లో కథ ఏదో గొప్ప మలుపు తిరగబోతోంది అనుకుంటే...ఓ కమాండర్ పగ తీర్చుకోవడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఓవర్ అనిపిస్తాయి. రెండున్నర గంటలకు పైనే ఉన్న రన్‌టైం కూడా ఓ మైనస్‌గానే చెప్పాలి.


 విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాలేదు

విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాలేదు


ఈ కథకు పెద్దగా పాటలు ,కామెడీ అవసరం లేదు. కేవలం ధ్రిల్స్ మీద నడవాల్సిన కథ ఇది. అయితే అవసరానికి మించి పాటలు, కామెడీ పెట్టి అనవసరంగా ఎక్కువ లెంగ్త్‌కు సినిమాను తీసుకెళ్ళారు. దీంతో చాలాచోట్ల సినిమా బోరింగ్‌గా తయారైంది. విజువల్ ఎఫెక్ట్స్ స్థాయి ఏమాత్రం బాగోలేదు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవనిపించింది. జోక్స్ బాగా పేలాయి, ముఖ్యంగా ..

జోక్స్ బాగా పేలాయి, ముఖ్యంగా ..


కానీ మనం రెగ్యులర్ చూసే ప్రేమకథలతో పోలిస్తే ఈ చిత్రంలో కొత్తదనం కన్పిస్తుంది. ప్రారంభ సన్నివేశాలన్నీ సరదాగా సాగిపోతాయి. హీరో ...సహోద్యోగులపై వేసే జోకులతో పాటు.. హీరోయిన్ ని ప్రేమలోకి దింపే ప్రయత్నాల్లో సగం సినిమా గడిచిపోయే సీన్స్ అన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ముఖ్యంగా తంబి రామయ్య కామెడీ చాలాచోట్ల సినిమాను నిలబెట్టింది. చిన్న చిన్న సన్నివేశాలతోనే బాగా నవ్వించే చాలా సన్నివేశాలను ఫస్టాఫ్‌లో చూడొచ్చు.మినిస్టర్ పాత్ర హైలెట్

మినిస్టర్ పాత్ర హైలెట్


రైలులో ఓ మినిస్టర్ క్యారెక్టర్‌ను పెట్టడం, మీడియా హడావుడిపై సెటైర్స్, కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఎమోషన్ ఇవన్నీ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌ను సినిమాలో వచ్చే మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. మార్నింగ్ షో పడకపోవటమే..

మార్నింగ్ షో పడకపోవటమే..


ఒక రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ప్రేమకథ. కొంచెం థ్రిల్లర్ లక్షణాలు కూడా ఉన్నాయి.
ట్రైలర్ బాగానే ఆసక్తి రేకెత్తించింది. ప్రేమఖైదీ.. గజరాజు.. తాజాగా ‘తొలి ప్రేమలో' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ప్రభు సాల్మాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దాంతో తెలుగులోనూ ఓపినింగ్స్ ఫరవాలేదనే స్దాయిలో వచ్చాయి. కానీ మార్నింగ్ షో కే రిలీజ్ అయ్యింటే ఇంకా బాగుండేది.ఎవరెలా చేసారంటే...

ఎవరెలా చేసారంటే...


ధనుష్‌ తన పాత్రలో ఇమిడిపోయాడు, జీవించాడనే చెప్పాలి. నిజంగానే రైల్లో పని చేసే కుర్రాడేనేమో అనిపించేలా నటించాడు. కొన్ని సీన్స్ లో బలం లేకున్నా ధనుష్‌తో ఎంతో కొంత జీవం వచ్చి లేచాయి. ధనుష్‌ బాడీ లాంగ్వేజ్‌లోనే ఓరకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది ఈ సినిమాలో చూసే అవకాశం దక్కింది. కీర్తి సురేష్‌ది డీగ్లామర్‌ పాత్ర. అయినా సరే.. అందంగా కనిపించింది. మిగిలిన పాత్రలు అంతంతే అని చెప్పాలి.సంగీతం, కెమెరా

సంగీతం, కెమెరా


సంగీత దర్శకుడు ఇమాన్‌ ఇచ్చిన ట్యూన్స్‌ కంటే నేపథ్య సంగీతం బాగుంది. మొత్తం సినిమాను రైల్లో తెరకెక్కించాలంటే మాటలు కాదు. కెమెరామెన్‌ ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. రైలు బ్రిడ్జ్‌ని దాటే సీన్స్ అయితే ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. అలాంటి సన్నివేశాలు మరిన్ని ఉంటే ఈ 'రైల్‌' ప్రయాణం మరింత బాగా ఉండేది.డైరక్టర్ మేకింగ్ ఎలా ఉందంటే

డైరక్టర్ మేకింగ్ ఎలా ఉందంటే


దర్శకుడిగా ప్రభుసాల్మన్ మేకింగ్ కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంది. ఇదే కథను ఇంకొంచం జాగ్రత్తగా రాసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్టయ్యి ఉండేదేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాల్లో మాత్రం సినిమాటోగ్రఫీ లోపం కూడా కనిపించింది. ముందే చెప్పినట్టు విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. తెలుగు డబ్బింగ్ పనులు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ బాగున్నాయి. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.తెర వెనక, ముందు

తెర వెనక, ముందు
తారాగణం: ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామస్వామి, కరుణాకరన్‌ తదితరులు
సంగీతం: డి.ఇమాన్‌
ఛాయాగ్రహణం: ట్రల్‌ మహేంద్రన్‌
కూర్పు: ఎల్‌వీకె దాస్‌
నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి
రచన దర్శకత్వం: ప్రభు సాల్మన్‌
సంస్థ: ఆదిత్య మూవీ కార్పొరేషన్‌
విడుదల: 22-09-2016English summary
'Rail' is another miss for actor Dhanush and Director Prabhu Solomon. Rail is a romantic thriller gone wrong. The director thought the purity of two lovers brought out by the climax is enough to convince the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu