twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్ తో క్లాస్ ఎక్సలెంట్ పొలిటికల్ డ్రామా : ధర్మ యోగి రివ్యూ &రేటింగ్

    |

    Rating:
    3.5/5

    దీపావళి కానుకగా కాష్మోరాతో పాటు విడుదలకావాల్సిన ధనుష్ సినిమా ధర్మయోగి... సాంకేతిక కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్స్ కు, ఎమోషనల్ సన్నివేశాలకు ధనుష్ సినిమాల్లో లోటు ఉండదు. అయితే రజినీ కాంత్ అల్లుడు అన్న టాగ్ తప్ప తెలుగులో మొన్నటి వరకూ పెద్దగా మార్కెట్ లేదు ధనుష్ కి సూర్య తమ్ముడు గా వచ్చిన కార్తి కి ఉన్న మార్కెట్ కంటే కూడా తెలుగులో ధనుష్ కి ఉన్న మార్కెట్ తక్కువే. అయితే రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన "కోడి" ని తెలుగులోకి ధర్మ యోగి పేరుతో తెస్తున్నాడు అనగానే ఎంతోకొంత హైప్ మాత్రం వచ్చింది. మరి అలాంటి ఎలిమెంట్స్ కు పొలిటికల్ టచ్ కూడా యాడ్ అయితే ఎలా ఉంటుందో చూపించింది ధర్మయోగి సినిమా. తెలుగులో ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

    ఇద్దరు కవలలుగా కనిఒపించిన ధనుఇష్ కొడీ, అంబూ అనే పాత్రలలో కనిపిస్తాడు. పెద్దవాడైన కోడి (ధనుష్) తన తండ్రిలాగే ఒక రాజకీయ పార్టీలో కీలకమైన కార్యకర్తగా తిరుగుతూంటాడు. ఇక తమ్ముడు అన్బు (ధనుష్) మాత్రం తల్లిచాటు బిడ్డ. ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, అమాయకంగా కనిపిస్తుంటాడు. రాజకీయాలలోనే ఉన్న కోడి అపోజిషన్ పార్టీకి చెందిన రుద్ర (త్రిష)తో ప్రేమలో పడతాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని, రాజకీయాల్ని వేటికవే వేరుగా చూస్తూ వస్తుంటారు ఈ ఇద్దరు ప్రేమికులు. అయితే ఒక దశలో మాత్రం తమ ఇద్దరి రాజకీయ నేపథ్య ప్రభావం వీళ్ళ ప్రేమ మీఅ కూడా పడే పరిస్థితి వస్తుంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో... తమ నియోజకవర్గంలో ఉపఎన్నికలు రావడం... ఆ ఉపఎన్నికల్లో కోడి, రుద్ర ఇద్దరూ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక కావడం చకచకా జరిగిపోతాయి.

    Dharama Yogi review and Rating

    రాజకీయంగా శత్రువులుగా మారిన ఈ ఇద్దరు ప్రేమికులు, వ్యక్తిగతంగా కూడా శత్రువులుగా మారిపోతారు. మరీ ధారుణం ఏమిటంటే ప్రేమని కూడా మర్చిపోయి అధికారం కోసం కోడి నే హత్య చేయిస్తుంది రుద్ర. అయితే రాజకీయంగా సెంటిమెంట్ వర్కవుట్ కావడంతో... తప్పనిసరి పరిస్థితుల్లో, తనకు ఇష్టంలేకపోయినా... అధికారాన్ని చనిపోయిన కోడి తమ్ముడు అన్బుకు త్యాగం చేస్తుంది రుద్ర. సరిగ్గా ఇక్కడ్నుంచే ట్విస్ట్ మొదలౌతుంది. అప్పటివరకు అమాయకంగా కనిపించిన అన్బు..ఒక్కసారిగా సిసలైన రాజకీయ నాయకుడిగా మారిపోతాడు. పనిలోపనిగా తన కవల సోదరుడ్ని చంపిన వ్యక్తులు ఎవరనే విషయంపై సొంతంగా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాడు. దీంతో కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి త్రిష ఏమైంది.. అన్బు తను అనుకున్నది సాధించాడా..?? అన్న ప్రశ్నలకి సమాధానం కావాలీ అంటే సినిమా చూడాల్సిందే..

    ధనుష్ నిజానికి హీరో కాదు ఒక నటుడు తనకిచ్చిన పాత్రలో పూర్తిగా మునిగిపోయే తత్వమున్న నటుడు కేవలం ఆ ఒక్క కారణమే ఈ రోజు ధనుష్ ని ప్రముఖ నటుల్లో ఒకన్ని చేసింది. రజినీ కాంత్ అన్న ట్యాగ్ లేకుండా తనకంటూ ఒక స్థానం ఏర్పరిచింది... ఈ సినిమాలోనూ ధనుష్ పెర్ఫార్మెన్స్ కి పూరి మార్కులు పడిపోతాయి.. తమిళ మాస్ అంటే ఎలా ఉంటుందో తన "కొడి" పాత్ర లో చూపించాడు. ఇక దాదాపు పుష్కరకాలంగా పరిశ్రమలో కొనసాగుతున్న త్రిష.. ఈమధ్య కాలంలో మేకోవర్ పాత్రల కోసం తెగ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని పిచ్చిపిచ్చి ప్రయోగాలు కూడా చేసి చేతులు కాల్చుకుంది. అయితే త్రిషకి తానేం కోరుకుందో ఆ తపనకి పూర్తి న్యాయం చేకూర్చే పాత్ర ధర్మ యోగిలో దొరికింది. హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు అన్న మాటకి పక్కా నిదర్షణం లా కనిపించింది త్రిష.

    ఆమె పర్ ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. త్రిషను ఎప్పటి లా గ్లామర్ డాల్ లా ఊహించుకొని వెళితే మాత్రం కచ్చితంగా సినిమా చూసి షాక్ అవుతారు. త్రిష, ధనుష్ ఇద్దరూ అవార్డ్ విన్నింగ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక హోమ్లీ గర్ల్ గా అనుపమ పరమేశ్వరన్, ధనుష్ తల్లిగా శరణ్య పొన్నవనమ్, ఫ్రెండ్ పాత్రలో కాళి... తమ పాత్రలకు సరైన న్యాయమే చేశారు.

    దర్శకుడు దురై సెంథిల్ కుమార్ నేటివిటీకి తగ్గట్టుగా తక్కువ ఖర్చులో మైండ్ గేమ్ తో కథ రాసుకున్నారు. ఇలాంటి సినిమాకి ఖచ్చితంగా నేటివిటీ అనేదే మెయిన్ పాయింట్ గా ఉంటుంది. మనదేశం లో ఏరెండు రాష్ట్రాలలోనూ ఒకేరకమైన రాజకీయ వాతావరణాలుండవు. కానీ సెంథిల్ మాత్రం లోకల్ గా జరిగే రాజకీయాల్ని హై ఇంటెన్సిటీతో తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఈసినిమాకు ప్రాణం. ధనుష్ పాత్రను మలిచిన విధానం చాలా బాగుంది. రెండు పాత్రల్ని అద్భుతంగా రాసుకున్నాడు. ఏ పాత్రను కూడా తక్కువ చేయకుండా తీసుకెళ్లాడు. ముఖ్యంగా త్రిష పాత్రతో చేయించే మైండ్ గేమ్ సీన్స్ బాగా పండాయి. రెండో భాగంలో పోలీస్ ను కాల్పించే సన్నివేశం దర్శకుడి ప్రతిభకు ఓ మచ్చుతునక. ధనుష్ లోని మాస్ హీరోని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. త్రిష క్యారెక్టర్ లోని చేంజ్ ఓవర్ ను బాగా చూపించగలిగాడు. అధికార దాహం ఎంతకు దారితీస్తుంది.. ఎంతకైనా తెగిస్తారనేది బాగా చూపించాడు.

    దర్శకుడు సెంథిల్ కుమార్ చాలా సన్నివేశాల్ని కొత్తగా రాసుకున్నాడు. ప్రేక్షకుడికి ఊహలకు అందకుండా చాలా సన్నివేశాలున్నాయిందులో. ధనుష్ ఎమ్మెల్యేగా నిలబడడం.. త్రిష తనను తాను రాజకీయంగా డెవలప్ చేసుకునేందుకు వేసే ఎత్తుగడలు.. కెమెరా కోసం వెతకడం.. పోలీస్ చనిపోవడం లాంటి ట్విస్టులు ప్రేక్షకులకు థ్రిల్ ను కలగజేస్తాయి. ధర్మ యోగిగా మారే ట్రాన్స్ ఫార్మేషన్ కూడా బాగుంటుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రథాన బలం. గ్రిప్పింగ్ గా తీసుకెళ్లగలిగాడు. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రేక్షకుడు గెస్ కూడా చేయలేనంత సస్పెన్స్ తో చక్కటి స్క్రీన్ ప్లేతో కథని తెరకెక్కించగలిగాడు.

    అయితే పొలిటికల్ డ్రామా ఎంత బాగున్నప్పటికీ ఖచ్చితంగా కనిపించే లోపం "నేటివిటీ. ఆ వాతావరణం మాత్రం మనవాళ్ళకి మన కథ అన్న ఇన్వాల్మెంట్ కి తీస్కెల్లలేకపోయింది. డబ్బింగ్ సినిమా కావడంతో పూర్తిగా నేటివిటీ మిస్ అయింది. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ కావు. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. తమిళనాట 24 గంటల ముందే విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ దీపావళికి తెలుగులో పెద్దగా పోటీలేనప్పటికీ... అత్యథిక థియేటర్లలో విడుదలైన కాష్మోరాను తట్టుకొని నిలబడగలిగితే.. ధర్మయోగి సినిమా కచ్చితంగా ధనుష్ కు ఇక్కడ కలిసొస్తుంది. మరీ పరమ రొతీన్ సినిమాలూ, కామెడీ, హర్రర్ కామెదీ మాత్రమే సినిమాలూ అన్నట్టుగా ఉన్న ఈ వాతావరణం లో ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ ఇచ్చే సినిమా అవుతుందనటం లో ఏ మాత్రం సందేహం లేదు...

    English summary
    Dhanush KODI Dubbed in To Telugu "Dharama Yogi" Movie review and Rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X