Diesel First Review: డీజిల్ మూవీ ఫస్ట్ రివ్యూ
తమిళంలో యువ హీరో హరీష్ కల్యాణ్, అతుల్య రవి జంటగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా డీజిల్. ఈ సినిమా ద్వారా దక్షిణాది సినిమా రంగానికి షణ్ముగం ముత్తుస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను ఎస్పీ సినిమాస్, థర్డ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై దేవరాజులు మార్కండేయన్ నిర్మించారు. ఈ సినిమాలో వినయ్ రాయ్, సాయికుమార్, అనన్య, కాళీ వెంకట్, వివేక్ ప్రసన్న, సచిన్ ఖేడ్కర్, అపూర్వ సింగ్ తదితరులు నటించారు.
యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాకు ఎంఎస్ ప్రభు, రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫిని, సాన్ లోకేష్ ఎఢిటింగ్ బాధ్యతలను, ధిబూ నినన్ థామస్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వర్తించారు. అక్టోబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించి సెన్సార్ అధికారులు వెల్లడించిన విషయాలు ఏమిటి? ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ లభించింది అనే వివరాల్లోకి వెళితే..

డీజిల్ సినిమా కథ విషయానికి వస్తే.. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో 1980లో జరిగే స్టోరీగా తెరకెక్కింది. ఓ పట్టణంలో మనోహర్ అనే లీడర్ క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ బిజినెస్‌ను యదేఛ్చగా సాగిస్తుంటాడు. ఆ ప్రాంతంలోకి పటానీలు వచ్చి ప్రైవేట్ పోర్ట్‌ను ఏర్పాటు చేయాలనుకొంటారు. కానీ ఆయిల్ బ్లాక్ మార్కెట్‌కు అడ్డగా మారుతుందని మనోహర్ ఆ పోర్టు ఏర్పాటును అడ్డుకొంటాడు. ఆ ప్రాంతంలోని పైప్ లైన్‌లో నుంచి పెద్ద ఎత్తున్న ఆయిల్ దొంగతన చేసి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అయితే పోర్టు ఏర్పాటు జరిగిందా? డీజిల్, క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ విషయంలో ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.
పోర్ట్ ప్రాంతంలో జరిగే మాఫియా, స్మగ్లింగ్ అంశాలను ఆధారంగా చేసుకొని రూపొందిన పిరియాడిక్ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అయితే హరీష్ కల్యాణ్ చేసిన పెర్ఫార్మెన్స్, వినయ్ కుమార్, సాయికుమార్ పాత్రలు ఈ సినిమాలో రూపొందించిన విధానం హైలెట్. అతుల్య రవి, హరీష్ మధ్య రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. పిరియాడిక్ మూడ్‌ను క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ పనితీరు బాగుంది అనే అంశాలను సెన్సార్ సందర్భంగా బయటకు వచ్చాయి.
డీజిల్ సినిమాను చూసిన సెన్సార్ ప్రతినిధులు, అధికారులు పూర్తిగా సంతృప్తి చెందారు. కానీ సాధారణంగా ఉండే సలహాలు, సూచనల ప్రకారం.. కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని అడిగారు. ఆ మేరకు కొన్ని ఛేంజెస్ చేశారు. దాంతో ఈ సినిమాకు యూఏ 16+ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. చైన్నెలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 16 ఏళ్లు పైబడిన వారు ఈ సినిమాను చూడటానికి అనుమతి ఇచ్చారు. అయితే 16 ఏళ్ల లోపు ఉండే పిల్లలు తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని తెలిపారు.
యాక్షన్, లవ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా నిడివి విషయంలో పక్కాగా జాగ్రత్లలు తీసుకొన్నారు. ఈ సినిమాలో ఉండే రెట్రో ఫీలింగ్‌ను కొనసాగించేలా.. అలాగే సాగదీత లేకుండా ఈ సినిమాను 144.35 సెకన్ల నిడివిని కట్ చేశారు. అంటే.. ఈ మూవీని రన్ టైమ్‌ను 2 గంటల 24 నిమిషాలు, 35 సెకన్లుగా ఫిక్స్ చేశారు. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ అప్ డేట్స్ గురించి ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











