»   » ‘దిల్ వాలె’మూవీ రివ్యూ

‘దిల్ వాలె’మూవీ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

హైదరాబాద్: షారుక్ ఖాన్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌‍ప్రెస్' మూవీ బాక్సాఫీసు సూపర్ హిట్ అయింది. మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘దిల్ వాలె'. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ జోడీగా పాపుల్ అయిన షారుక్-కాజోల్ చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటించారు. ఈ నేపథ్యంలో సినిమాపై ముందు నుండీ అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి దర్శకుడు రోహిత్ శెట్టి ప్రేక్షకులను ఏమేరకు సంతృప్తి పరిచాడనేది రివ్యూలో చూద్దాం...

కథ విషయానికొస్తే...
రాజ్(షారుక్ ఖాన్) చాలా సింపుల్‌గా హంబుల్ గా ఉండే వ్యక్తి. తన సోదరుడు వీర్(వరుణ్ ధావన్)తో కలిసి కార్లు మోడిఫికేషన్ చేసే గ్యారేజీ నడుపుతుంటాడు. వారి లైఫ్ చాలా జాలీగా సాగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో వీర్ తన కారులో లిఫ్టు అడగటం ద్వారా పరిచయం అయిన ఇషిత(క్రితి సానన్)తో ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని అన్నయ్య రాజ్ కు చెప్పి ఇషిత ఇంట్లో మాట్లాడమని అడుగుతాడు వీర్. తమ్ముడి కోసం ఇషిత వాళ్ల అక్కతో మాట్లాడటానికి వారి ఇంటికి వెళ్లిన రాజ్.....ఇషిత సిస్టర్ మీరా(కాజోల్) అని తెలి షాకవుతాడు. వెంటనే వచ్చి తన తమ్ముడితో ఈ పెళ్లి జరుగడానికి వీళ్లేదని చెబుతాడు. అప్పుడే కథ 1990లో మాఫియా ఫ్యాష్ బ్యాక్ లోకి టర్న్ అవుతుంది. ఒకప్పుడు బల్గేరియాలో రాజ్ పెద్ద మాఫియా డాన్. అసలు పేరు కాళీ. కాళీ, మీరాకు సంబంధం ఏమిటి? ఒకప్పుడు మాఫియా డాన్ అయిన కాళీ...ఇపుడు రాజ్ గా సాధారణ జీవనం ఎందుకు సాగిస్తున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

పాజిటివ్ అంశాలు....
షారుక్-కాజోల్ అంటే బాలీవుడ్లో ఒకప్పుడు హిట్ పెయిర్. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించి మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసారు. ఈ సినిమాకు ఏదైనా పెద్ద ప్లస్ పాయింట్ ఉందంటూ ఈ ఇద్దరు కలిసి నటించడమే. ఈ ఇద్దరి కాంబినేషన్ లేకుంటే సినిమాను చూడటం కష్టమే. మరోసారి షారుక్ ఖాన్ తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

 హైదరాబాద్: షారుక్ ఖాన్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌‍ప్రెస్’ మూవీ బాక్సాఫీసు సూపర్ హిట్ అయింది. మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘దిల్ వాలె’. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ జోడీగా పాపుల్ అయిన షారుక్-కాజోల్ చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటించారు. ఈ నేపథ్యంలో సినిమాపై ముందు నుండీ అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి దర్శకుడు రోహిత్ శెట్టి ప్రేక్షకులను ఏమేరకు సంతృప్తి పరిచాడనేది రివ్యూలో చూద్దాం... కథ విషయానికొస్తే... రాజ్(షారుక్ ఖాన్) చాలా సింపుల్‌గా హంబుల్ గా ఉండే వ్యక్తి. తన సోదరుడు వీర్(వరుణ్ ధావన్)తో కలిసి కార్లు మోడిఫికేషన్ చేసే గ్యారేజీ నడుపుతుంటాడు. వారి లైఫ్ చాలా జాలీగా సాగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో వీర్ తన కారులో లిఫ్టు అడగటం ద్వారా పరిచయం అయిన ఇషిత(క్రితి సానన్)తో ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని అన్నయ్య రాజ్ కు చెప్పి ఇషిత ఇంట్లో మాట్లాడమని అడుగుతాడు వీర్. తమ్ముడి కోసం ఇషిత వాళ్ల అక్కతో మాట్లాడటానికి వారి ఇంటికి వెళ్లిన రాజ్.....ఇషిత సిస్టర్ మీరా(కాజోల్) అని తెలి షాకవుతాడు. వెంటనే వచ్చి తన తమ్ముడితో ఈ పెళ్లి జరుగడానికి వీళ్లేదని చెబుతాడు. అప్పుడే కథ 1990లో మాఫియా ఫ్యాష్ బ్యాక్ లోకి టర్న్ అవుతుంది. ఒకప్పుడు బల్గేరియాలో రాజ్ పెద్ద మాఫియా డాన్. అసలు పేరు కాళీ. కాళీ, మీరాకు సంబంధం ఏమిటి? ఒకప్పుడు మాఫియా డాన్ అయిన కాళీ...ఇపుడు రాజ్ గా సాధారణ జీవనం ఎందుకు సాగిస్తున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే. పాజిటివ్ అంశాలు.... షారుక్-కాజోల్ అంటే బాలీవుడ్లో ఒకప్పుడు హిట్ పెయిర్. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించి మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసారు. ఈ సినిమాకు ఏదైనా పెద్ద ప్లస్ పాయింట్ ఉందంటూ ఈ ఇద్దరు కలిసి నటించడమే. ఈ ఇద్దరి కాంబినేషన్ లేకుంటే సినిమాను చూడటం కష్టమే. మరోసారి షారుక్ ఖాన్ తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. షారుక్, కాజోల్ ఇద్దరీకి మార్కులు వేయాల్సి వస్తే ఎక్కువ మార్కులు కాజోల్ కే పడతాయి. అంతబాగా నటించింది. సినిమాలో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్టాఫ్ లో రొమాంటిక్ సీన్లలో కాజోల్ సూపర్బ్. ఎమోషనల్ సీన్లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సెకండాఫ్ లో ఎక్కువ భారం తనే మోసింది. క్రితి సానన్ రోల్ డీసెంటుగా ఉంది. ఆమె లుక్ కూడా చాలా అందంగా ఉంది. తమ్ముడి పాత్రలో వరుణ్ దావన్ బాగా నటించాడు. చాలా కాలం తర్వాత జానీ లీవర్ బాగా నవ్వించాడు. సినిమా ఫస్టాఫ్ రిచ్ విజువల్స్, బ్యూటిపుల్ సాంగ్స్ తో ఆకట్టుకునే విధంగా ఉంది. నెగెటివ్ పాయింట్స్... సినిమా సెకండాఫ్ పెద్ద ఆకట్టుకోలేదు. సినిమాలో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో సస్పెన్స్ తగ్గిపోతుంది. క్లైమాక్స్ కూడా చేజింగులతో రొటీన్ సీన్లతో ఉండటంతో పాటు సింపుల్ గా ముగించేసారు. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ కూడా చాలా ఓల్డ్ ఫార్మాట్. సెకండాఫ్ లో ఎమోషన్స్ పండించాలనుకున్న రోహిత్ శెట్టి విఫలం అయ్యాడు. కొన్ని అనవసర సీన్లు సినిమా రన్ టైం మరింత పెంచాయి. షారుక్-కాజోల్ మధ్య రిలేషన్ సీన్లు సెకండాఫ్ లో పర్ ఫెక్టుగా డీల్ చేయడంలో రోహిత్ శెట్టి ఫెయిల్ అయ్యాడు. మితిమీరిన డ్రామా కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. టెక్నికల్ పాయింట్స్... సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. లోకేషన్స్, సినిమాలోని కార్లు, ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్ తెరకెక్కించిన తీరు చాలా రిచ్ గా చాలా బావుంది. డైలాగ్స్ బావున్నాయి. వన్ లైన్ పంచ్ డైలాగులు బాగా పేలాయి. ప్రీతమ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాటోగ్రీఫీ గుడ్. రోహిత్ శెట్టి స్క్రీన్ ప్లే ఫర్వలేదు. అతని టేకింగ్ రోటీన్ గా ఉంది. ఎప్పటిలాగే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఎంచుకున్న రోహిత్ శెట్టి పర్ ఫెక్టుగా ప్రజంట్ చేయలేక పోయాడు. షారుక్-కాజోల్ కాంబినేషన్ మీద తప్ప ఇతర అంశాల మీద సరైన శ్రద్ధ పెట్టలేదని స్పష్టమవుతోది. ఫైనల్‌గా.... షారుక్-కాజోల్ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ అవ్వడం వల్ల సినిమా కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. మిగతా ఎలిమెంట్స్ అన్నీ రొటీన్ గానే ఉన్నాయి. షారుక్ అభిమానులకు నచ్చుతుంది.

షారుక్, కాజోల్ ఇద్దరీకి మార్కులు వేయాల్సి వస్తే ఎక్కువ మార్కులు కాజోల్ కే పడతాయి. అంతబాగా నటించింది. సినిమాలో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్టాఫ్ లో రొమాంటిక్ సీన్లలో కాజోల్ సూపర్బ్. ఎమోషనల్ సీన్లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సెకండాఫ్ లో ఎక్కువ భారం తనే మోసింది.

క్రితి సానన్ రోల్ డీసెంటుగా ఉంది. ఆమె లుక్ కూడా చాలా అందంగా ఉంది. తమ్ముడి పాత్రలో వరుణ్ దావన్ బాగా నటించాడు. చాలా కాలం తర్వాత జానీ లీవర్ బాగా నవ్వించాడు. సినిమా ఫస్టాఫ్ రిచ్ విజువల్స్, బ్యూటిపుల్ సాంగ్స్ తో ఆకట్టుకునే విధంగా ఉంది.

నెగెటివ్ పాయింట్స్...
సినిమా సెకండాఫ్ పెద్ద ఆకట్టుకోలేదు. సినిమాలో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో సస్పెన్స్ తగ్గిపోతుంది. క్లైమాక్స్ కూడా చేజింగులతో రొటీన్ సీన్లతో ఉండటంతో పాటు సింపుల్ గా ముగించేసారు. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ కూడా చాలా ఓల్డ్ ఫార్మాట్. సెకండాఫ్ లో ఎమోషన్స్ పండించాలనుకున్న రోహిత్ శెట్టి విఫలం అయ్యాడు. కొన్ని అనవసర సీన్లు సినిమా రన్ టైం మరింత పెంచాయి. షారుక్-కాజోల్ మధ్య రిలేషన్ సీన్లు సెకండాఫ్ లో పర్ ఫెక్టుగా డీల్ చేయడంలో రోహిత్ శెట్టి ఫెయిల్ అయ్యాడు. మితిమీరిన డ్రామా కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.

టెక్నికల్ పాయింట్స్...
సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. లోకేషన్స్, సినిమాలోని కార్లు, ఫైట్ సీక్వెన్స్, సాంగ్స్ తెరకెక్కించిన తీరు చాలా రిచ్ గా చాలా బావుంది. డైలాగ్స్ బావున్నాయి. వన్ లైన్ పంచ్ డైలాగులు బాగా పేలాయి. ప్రీతమ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాటోగ్రీఫీ గుడ్. రోహిత్ శెట్టి స్క్రీన్ ప్లే ఫర్వలేదు. అతని టేకింగ్ రోటీన్ గా ఉంది. ఎప్పటిలాగే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఎంచుకున్న రోహిత్ శెట్టి పర్ ఫెక్టుగా ప్రజంట్ చేయలేక పోయాడు. షారుక్-కాజోల్ కాంబినేషన్ మీద తప్ప ఇతర అంశాల మీద సరైన శ్రద్ధ పెట్టలేదని స్పష్టమవుతోది.

ఫైనల్‌గా....
షారుక్-కాజోల్ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ అవ్వడం వల్ల సినిమా కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. మిగతా ఎలిమెంట్స్ అన్నీ రొటీన్ గానే ఉన్నాయి. షారుక్ అభిమానులకు నచ్చుతుంది.

English summary
Dilwale has released worldwide and the D-day has finally arrived when all you viewers can see this what this extremely hyped movie is all about. This Rohit Shetty directorial has been making news from day one, from casting Shahrukh Khan as main lead, to bringing back SRK-Kajol together after a huge gap of 5 years. SRK and cast will entertain you, especially if you are a Shahrukh Khan fan.
Please Wait while comments are loading...