»   »  డాన్- సినిమా సమీక్ష

డాన్- సినిమా సమీక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu
Don
Rating

నటీనటులు: నాగార్జున, అనుష్క, రాఘవ లారెన్స్, నిఖిత, కెల్లీ దోర్జ్,
చలపతిరావు, జీవా, కోట శ్రీనివాస రావు, రఘునాథరెడ్డి,
వైజాగ్ ప్రసాద్, నరసింహ్మా రాజు తదితరులు.
మాటలు: అబ్బూరి రవి
సాహిత్యం: చిన్ని చరణ్
సినిమాటోగ్రఫీ: ఎస్ గోపాల్ రెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్: అశోక్ కుమార్
నిర్మాత: ఎమ్ఎల్ కుమార్ చౌదరి
కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, కొరియోగ్రఫీ, దర్శకత్వం: రాఘవ లారెన్స్
బ్యాన్నర్: శ్రీ కీర్తి క్రియేషన్స్
విడుదల: డిసెంబర్ 20,2007

డిసెంబర్ లో విడుదలైన నాగార్జున చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే తాజా చిత్రం డాన్ ను కూడా డిసెంబర్ లోనే విడుదల చేయాలనే సెంటిమెంట్ తోనే ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో నిర్ణయించుకున్నట్టుంది. మొత్తానికి డాన్ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేశారు. ఈ సినిమాకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సూపర్ హిట్ సినిమాగా నిలిచిన మాస్ సినిమా కాంబినేషన్ లారెన్స్, నాగార్జన కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. మాస్ సినిమాలాగే డాన్ కూడా ఉంటుందని ప్రేక్షకులు ఊహించడంలో తప్పేంలేదు. కానీ ప్రేక్షకుల ఊహా నిజం కాదని సినిమా చూస్తే తేలిపోతుంది.

చిన్నప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతూ పేదల పక్షాల నిలిచే తత్వం సూరి(నాగార్జున)ది. అందుకే గూండాల చేతిలో అన్యాయానికి గురయ్యే అనాధ బాలల తరఫున డాన్ గా నిలబడతాడు. ఆ అనాధలలో ఒకరైన రాఘవ(లారెన్స్) డాన్ కు దగ్గరవుతాడు. డాన్ ను అన్నా అని పిలిచే స్థాయికి చేరతాడు. ఎపుడైతే తమకు సమస్య ఎదురవుతుందో అపుడు అనాధలు, పేదలు డాన్ ను సంప్రదిస్తారు. ఇదిలా ఉంటే రాఘవ డానన్నకు పెళ్లి చేయడం కోసం ఒక అమ్మాయిని చూస్తాడు. ఇదిలా ఉంటే తన రైట్ హ్యాండ్ నిలుస్తూ వస్తున్న మూర్తి(చలపతిరావు) కుమార్తె ప్రియ(అనుష్క) డాన్ మనసును గెలుచుకుంటుంది. మరోవైపు రాఘవ కూడా నందిని(నిఖిత) ప్రేమలో పడతాడు. ఇక్కడ వ్యవహారాలు ఇలా ఉంటే అంతర్జాతీయ డాన్ స్టిఫెన్(కెల్లీ డార్జ్) ఆంధ్రప్రదేశ్ ను కూడా తన హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. దీనికి సూరి పెద్ద అడ్డంకిగా స్టిఫెన్ భావిస్తాడు. ముందుగా సూరిను మచ్చిక చేసుకోవడానికి స్టిఫెన్ ప్రయత్నిస్తాడు. సూరి లైట్ గా తీసుకుంటాడు. అంతేకాదు స్టిఫెన్ పంపిన వ్యక్తులలో ఇద్దరిని చంపివేస్తాడు. దీనికి ఆగ్రహించిన స్టిఫెన్, రత్నం(కోట శ్రీనివాసరావు) సాయంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తాడు. బాంబులు పేలుళ్ల వందలమంది చావుకు కారకుడవుతాడు. దీనికి మరింత ఆగ్రహానికి గురైన సూరి, స్టిఫెన్ మనుషలపై పట్టు సాధించడానికి ప్రయత్నించి సఫలమవుతాడు. తను ప్రేమలో పడ్డ నందిత స్టిఫెన్ మనిషని రాఘవ గ్రహిస్తాడు. రాఘవకు స్టిఫెన్ నుంచి ప్రమాదం ఉండవచ్చని భావిస్తున్న తరుణంలోనే రాఘవ, స్టిఫెన్ చేతిలో చంపివేయబడతాడు. ఆ తరువాత ఏమైందన్నది తెర మీద చూడాల్సిందే.

ఈ సినిమా కథ అంతా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉండడంతో అందుకు తగ్గట్టుగా నాగార్జున మరో మారు తన సత్తాను ప్రదర్శించాడు. అనుష్క గ్లామర్ కూడా బాగా పనిచేసింది. నాగార్జున ప్రతిభ, అనుష్క గ్లామర్ ఈ రెండు అంశాలే సినిమాను కాపాడాల్సినవి. కామెడీ ట్రాక్ బొత్తిగా లోపించింది. లారెన్స్ నే కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. నిఖిత రోల్ ఇందులో ఊహించని విధంగా ప్రత్యక్షమవుతుంది. ఎస్ గోపాల్ రెడ్డి పని ఎప్పటిమాదిరిగానే రాణించింది.

అయితే ఈ సినిమా నాగార్జున సగటు అభిమాని అంచనాలకు అనుగుణంగా లేకపోవడం గమనార్హం. భారీ పెట్టుబడి పెట్టిన నిర్మాతకు ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉంది. ఈ సినిమా ఇలా తయారుకావడానికి దర్శకుడు లారెన్సే బాధ్యత తీసుకోవాల్సిఉంటింది. దర్శకత్వం, సంగీతం, కొరియోగ్రఫీలను ఇలా చాలా అంశాలను ఒంటి చేత్తో నెరవేర్చిన లారెన్స్ ఏ ఒక్క అంశంపైనా శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించదు. ఫైటింగ్ లు కూడా ఆకట్టుకునేలా లేవు. పోలీసుల పాత్రను నామమాత్రంగా చూపించడం బాలేదు. లోకల్ డాన్ పెద్దయెత్తున నెట్ వర్క్ ను ఎలా కలిగిఉంటాడో అర్థం కానీ అంశం. పాటలు కూడా సరైన సమయంలో రావు. డాన్ పాట కోసం 33,000 వేల బల్బులను ఉపయోగించడం అర్థం కాదు. అంతా వృథా ఖర్చనిపిస్తుంది. మిగతా సినిమాలు విడుదల అయితే సంక్రాంతి రేసులో నిలబడుతుందో లేదో మరి.

(గమనిక: వినోదం అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు,కథన నైపున్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు మా రేటింగ్ కు సంబందం ఉండనవసరం లేదు)

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X