»   » నయనతార పవర్ ప్యాక్ యాక్షన్ (డోరా మూవీ రివ్యూ)

నయనతార పవర్ ప్యాక్ యాక్షన్ (డోరా మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తమిళంలో మాయ, కాష్మోరా, తెలుగులో బాబు బంగారం చిత్రాల తర్వాత నయనతార నటించిన తాజా చిత్రం డోరా. హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి దాస్ రామసామి తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. వింటేజ్ కారు కథా నేపథ్యంగా కుక్క ఆత్మ ఆధారంగా నిర్మించబడిన చిత్రంలో నయనతార ప్రధాన పాత్రను పోషించారు. ఫస్ట్‌లుక్, టీజర్లకు అనూహ్య స్పందన రావడంతో విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మార్చి 31న విడుదలైన డోరా చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసిందోననే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకొందాం.

  అల్లారుముద్దుగా కూతుర్ని

  అల్లారుముద్దుగా కూతుర్ని

  పారిజాతం (నయనతార) ఆమె తండ్రి (తంబి రామయ్య) ది అన్యోన్యమైన కుటుంబం. పుట్టిన కొద్ది నెలలకే బిడ్డను వదిలేసి భార్య వెళ్లిపోవడంతో పారిజాతాన్ని అల్లారుముద్దుగా పెంచుకొంటాడు. ఓ ఘటనలో గుండెకు తీవ్రగాయమై పారిజాతం ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడుతుంది. కథ ఇలా సాగుతుండగా యుక్త వయస్సుకు వచ్చిన కూతురికి పెళ్లి చేసి భారం దించుకోవాలనే ప్రయత్నంలో ఇలవేల్పును దర్శించుకోవాలనుకొంటారు. అందుకోసం టాక్సీల వ్యాపారాన్ని నిర్వహించే తన చెల్లెల్ని ఓ కారు ఇవ్వమని కోరితే పారిజాతం తండ్రిని వారు అవమానిస్తారు.

  మేనత్తపై కోపంతో కార్ల బిజినెస్

  మేనత్తపై కోపంతో కార్ల బిజినెస్

  తన మేనత్త మీద కోపంతో సొంతంగా కారు కొని ట్యాక్సీ వ్యాపారాన్ని ప్రారంభించాలని పారిజాతం నిర్ణయిస్తుంది. తాము పొదుపు చేసిన సొమ్ముతో కారును కొనుగోలు చేస్తారు. తమ జీవితంలోకి వచ్చిన పురాతన కారు వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఆ కారులో కుక్క రూపంలో ఆత్మ తిరుగుతుంటుంది.

  వింతగా ప్రవర్తించే కారు

  వింతగా ప్రవర్తించే కారు

  ఆ కారులో ప్రయాణిస్తుండగానే పారిజాతం ప్రమేయ లేకుండానే ఆ వాహనం ఓ వ్యక్తిని తొక్కి చంపుతుంది. అదే విధంగా మరో వ్యక్తిని చంపుతుంది. ఆ కారు ఆ ముగ్గురు వ్యకులను ఎందుకు చంపాలనుకున్నది. ఆ కారు వల్ల పారిజాతం పడిన ఇబ్బందులేమిటీ. పారిజాతం గాయపడటానికి ఆ ముగ్గురు వ్యక్తులకు ఏమిటి సంబంధం. ఇలా అనేక ప్రశ్నలకు తెరమీద సమాధానమే డోరా చిత్రం.

  తండ్రి, కూతుళ్ల మధ్య సన్నివేశాలు..

  తండ్రి, కూతుళ్ల మధ్య సన్నివేశాలు..

  నయన తార తండ్రి తమిళ నటుడు తంబి రామయ్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తంబి రామయ్య చేత కామెడీ చేయాలని ప్రయత్నించిన దర్శకుడు రామసామి ప్రయత్నాలు వికటించాయి. ఆయనతో చేయించిన హాస్యం అభాసుపాలైంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కామెడి చికాకు పెట్టించేలా ఉంది.

  రొటీన్‌గా మొదటి భాగం

  రొటీన్‌గా మొదటి భాగం

  చిత్రంలో మొదటి భాగం పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్, హత్యలు, ముగ్గురు వ్యక్తుల అరాచకాలతో నడిపించేశాడు. కొందరిపై కారు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుదనే విషయాన్ని చెప్పి ఇంటర్వెల్‌లో దర్శకుడు ఆసక్తి రేపాడు. రెండో భాగంలో కారులో ఆత్మ జీవించడానికి కారణాలను దర్శకుడు చాలా చక్కగా చెప్పాడు.

  ఆసక్తిని రేపే రెండో భాగం

  ఆసక్తిని రేపే రెండో భాగం

  సెకండాఫ్‌లో ఒక చిన్నపాపకు సంబంధించిన ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఇక కథ దూసుకుపోతుందనే ఫీలింగ్‌తో ఉన్న ఆడియెన్స్‌పై దర్శకుడు రోటిన్ కథనంతో విసుగుపుట్టించాడు. ఓ భారీ హిట్‌కు సరిపోయే స్టోరీ లైన్‌కు సరైన కథ, కథనాన్ని అల్లుకోకపోవడంతో డోరా ఓ విభిన్నమైన సినిమాగా కాకుండా సాదాసీదాగా మారిపోయింది. దర్శకుడు రామసామి సరైన చర్యలు తీసుకొంటే ఓ మంచి చిత్రంగా మారడానికి అవకాశం ఉండేది. అయితే పేలవమైన కథ, కథనాలున్నప్పటికీ నయనతార తన అద్భుతమైన నటనతో సినిమాను కాపాడే ప్రయత్నం చేసింది.

  మూలస్తంభంగా నయనతార

  మూలస్తంభంగా నయనతార

  అగ్రతారగా రాణిస్తున్న నయనతార మరోసారి అద్భుతమైన పాత్రను పోషించింది. సినిమా భారాన్నంతా తనపై వేసుకొని సినిమాను నిలబెట్టడానికి చివరిదాకా పోరాడింది. ఉద్వేగ భరిత సన్నివేశాల్లో నయన పలికించిన హావభావాలు బాగా ఆకట్టుకొన్నాయి. తన ఫెర్ఫార్మెన్స్‌తో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదురులేదనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. నయనతార లేకపోతే ఈ సినిమా గురించి ఊహించుకోవడం చాలా కష్టమనే రితీలో నటించింది. తొలిసారి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడిని నయనతార నమ్మి సినిమా చేయడం హైలెట్.

  మంచి ఆలోచనను..

  మంచి ఆలోచనను..

  దర్శకుడు రామసామి స్టోరి లైన్ బాగా ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయి కథగా రూపొందించడంలో తడబాటుకు గురయ్యాడు. కథనంలోనూ పెద్దగా కొత్తదనం లేదు. వెరసి ఈ సినిమా ఓ సాదాసీదా చిత్రమనే చెప్పవచ్చు. కారు చేసే విన్యాసాలు ఊహకు అందని విధంగా ఉండటం ఈ సినిమాకు కొంత మైనస్. దర్శకుడు శర్కుణం ఈ సినిమాతో నిర్మాతగా మారారు. సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
  వివేక్ శివ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచింది. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకొన్నది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ చాలా భాగున్నాయి. హారర్ మూడ్‌లోకి వెళ్లేలా దోహదపడ్డాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  డిఫరెంట్ స్టోరి లైన్
  నయనతార ఫెర్ఫార్మెన్స్
  టెక్నికల్ వ్యాల్యూస్
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  మైనస్ పాయింట్స్
  స్క్రీన్ ప్లే
  డైరెక్షన్
  పాత్రల క్యారెక్టరైజేషన్
  నటీనటుల ఎంపిక

  తెర ముందు.. తెర వెనుక

  తెర ముందు.. తెర వెనుక

  నటీనటులు: నయనతార, తంబి రామయ్య, హరీష్ ఉత్తమన్ తదితరులు
  దర్శకత్వం: దాస్ రామసామి
  నిర్మాత శర్కుణం
  సంగీతం వివేక్ శివ మెర్విన్
  సినిమాటోగ్రఫీ దినేష్ కృష్ణన్
  సినిమా నిడివి 141 నిమిషాలు
  రిలీజ్ డేట్ మార్చి 31 2017

  English summary
  Director Doss Ramasamy's debut movie Dora. Main lead for this movie is superstar Nayanatara. No doubt its Nayanthara's show all the way. Her flamboyant style and presence has manifold over the years, and to show her star power
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more