Dude Twitter Review: డ్యూడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం డ్యూడ్. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు, డీజే టిల్లూ ఫేమ్ నేహా శెట్టిలు హీరోయిన్‌లుగా నటించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. డ్యూడ్ చిత్రానికి కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ సంగీత సారథ్యం వహించారు.
గతంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో డ్యూడ్‌పై అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అక్టోబర్ 17వ తేదీన డ్యూడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు అక్టోబర్ 16వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

డ్యూడ్ ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఎమోషన్, ట్విస్ట్‌లతో సాగింది. ప్రదీప్ మళ్లీ అద్భుతంగా తిరిగి వచ్చాడు. చాలా నచ్చింది. ఈ దీవాళి డ్యూడ్‌దే. సాయి అభంయక్కర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎలివేట్ చేసంది. కీర్తిశ్వరన్ చాలా బాగా డీల్ చేశారు అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
డ్యూడ్ విన్నర్.. దర్శకుడు కీర్తీశ్వరన్‌కు అద్భుతమైన అరంగేట్రం. జెన్ జెడ్‌కి సరైన రొమ కామ్. సాయి అభయంకర్ బీజీఎం, పాటలు సినిమాకు ప్రధాన బలం. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజులు ఇద్దరూ వారి పాత్రలకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యారు. సమాజానికి అవసరమైన సందేశాన్ని అత్యంత వినోదాత్మకంగా చెప్పారు అని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.
హ్యాట్రిక్ హీరో.. లవ్ టుడే, డ్రాగన్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వరసుగా మూడు... యువ సంచలనం వెలుగులోకి వచ్చింది అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు.
వస్తాడు నవ్వుతాడు నవ్విస్తాడు.. ఏడుస్తాడు ఏడిపిస్తాడు హిట్టు రిపీటు. వరుసగా మూడు హిట్స్.. కంగ్రాట్స్ అన్నా అని ఓ నెటిజన్ కాంప్లిమెంట్ ఇచ్చాడు
ప్రదీప్ రంగనాథన్ మరోసారి అద్భుతంగా నటించారు. వాటే యాక్టర్!!. డ్యూడ్ కథలోని ట్విస్టులు నాకు చాలా బాగా నచ్చాయి. ప్రదీప్ నటన కోసం చూస్తాను అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు
డ్యూడ్.. చాలా ఎంజాయ్‌బుల్, భావోద్వేగ అనుభవం. థియేటర్‌లలో చూడాలని గట్టిగా రికమెండ్ చేస్తున్నా. ప్రదీప్ రంగనాథన్, మొత్తం క్రూకి అభినందనలు అని ఓ నెటిజన్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.
ముందుగా కంగ్రాట్స్.. ప్రదీప్ రంగనాథన్‌కి హ్యాట్రిక్ సక్సెస్. ఇది యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. ట్విస్ట్‌లు బాగున్నాయి, సెకండాఫ్ మ్యాడ్ ఫన్. శరత్ కుమార్ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంది. ఈ రోల్ సినిమాకు చాలా విలువను తీసుకొచ్చింది. దీపావళి ఫన్ బ్లాక్ బస్టర్ అని ఓ ట్విట్టర్ యూజర్ రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











