For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ek Mini Katha రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, శ్రద్ధాదాస్‌, హర్షవర్ధన్‌, సుదర్శన్‌
  Director: కార్తీక్ రాపోలు

  నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధాదాస్‌, సప్తగిరి తదితరులు
  దర్శకత్వం: కార్తీక్ రాపోలు
  కథ: మేర్లపాటి గాంధీ
  సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
  సినిమాటోగ్రాఫర్: గోకుల్‌ భారతి
  బ్యానర్స్: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  రిలీజ్ డేట్: 2021-05-27

  కథ ఏమిటంటే

  కథ ఏమిటంటే

  సివిల్ ఇంజినీర్ సంతోష్‌ (సంతోష్ శోభన్)‌కు తన పురుషాంగం చిన్నగా ఉంటుందనే సమస్య బాల్యం నుంచే వెంటాడుతుంటుంది. తనకున్న సమస్యకు పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అమృత (కావ్య థాపర్)తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత తన సంసారానికి పనికి వస్తానా లేదా అనే మానసిక భయం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమస్యల మధ్య అమృత, సంతోష్ మధ్య విభేదాలు పెరిగి విడిపోతారు?

  మూవీలో ట్విస్టులు

  మూవీలో ట్విస్టులు

  సంతోష్‌కు పురుషాంగం చిన్నగా ఉందనే సమస్య తనలో ఎలా పెరిగింది? ఆ తర్వాత తన పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సంతోష్‌ను తండ్రి రామ్మోహన్ (బ్రహ్మాజీ) ఎలా అపార్థం చేసుకొన్నాడు? సంతోష్, అమృత మధ్య ఎలాంటి అపోహలు చోటు చేసుకొన్నాయి? సంతోష్‌కు స్వామిజీ (శ్రద్దా దాస్) ఎలాంటి పరిష్కారం చూపించింది. చివరకు సంతోష్‌కు ఆ సమస్య తీరిందా? సంతోష్, అమృత ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఏక్ Mini కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

  చిన్నది అనే సమస్యను కథకు అతిపెద్ద వనరుగా చేసి దర్శకుడు కార్తీక్ రాపోల్ ఎంచుకొన్న పాయింట్, దానిని కథగా అల్లుకొన్న విధానం బాగుంది. అయితే జీవితంలో పెద్దగా చర్చించలేని పాయింట్‌ను తీసుకొని వెండితెర మీద దానిని ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సెన్సిటివ్‌గా చూపించడానికి చేసిన ప్రయత్నం ఇంప్రెస్ చేసింది. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేసేటప్పుడు బలమైన సన్నివేశాలు రాసుకొవాల్సి ఉంటుంది. అలాగే కథను గ్రిప్పింగ్‌గా సోది లేకుండా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తే మరింత బాగుంటుంది. ఈ కథను సాగదీసి అనవసరపు అంశాలను చేర్చడం కొంత మైనస్ అని చెప్పవచ్చు.

  సెకండాఫ్ ఎనాలిసిస్

  సెకండాఫ్ ఎనాలిసిస్

  సెకండాఫ్‌లో శ్రద్దాదాస్ పాత్ర ఎంట్రీ తర్వాత ఏదో జరుగుతుంది. కథ మరో లెవెల్‌కు వెళ్తుందనే ఫీలింగ్‌లో ఉన్న వారికి నిరాశే మిగులుతుంది. కాకపోతే సున్నితమైన వినోదం, కొన్ని ఎమోషనల్ అంశాలు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉండటం మరింత ఉపశమనం అని చెప్పవచ్చు. రచయితగా దర్శకుడు మేర్లపాక గాంధీ, దర్శకుడు కార్తీక్ రాపాక కథను సరిగా డీల్ చేయడం వల్ల బూతు సినిమా అని భావించే ప్రమాదం ఉండేది. కానీ వారిద్దరూ ఆ చక్కటి కథ, కథనాలతో చాకచక్యంగా తప్పించడం వారి ప్రతిభకు అద్దం పట్టింది. కాకపోతే సెకండాఫ్ సాగదీసినట్టు అనిపిస్తుంది.

  సంతోష్ శోభన్ యాక్టింగ్

  సంతోష్ శోభన్ యాక్టింగ్

  అత్యంత సెన్సిబుల్, సెన్సిటివ్, సున్నితమైన పాయింట్‌తో ఉన్న కథను ధైర్యంగా ఒప్పుకోవడమే సంతోష్ శోభన్‌ సక్సెస్ అయ్యాడు. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయి కథను తన భుజాల మీద మోశాడు. చిన్నది అని చెబుతూనే కెరీర్‌పరంగా పెద్ద విజయాన్నే సొంతం చేసుకొన్నాడని చెప్పవచ్చు.

  కావ్య థాపర్, శ్రద్దా దాస్

  కావ్య థాపర్, శ్రద్దా దాస్


  కావ్య థాపర్ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. టాలెంట్ నిరూపించుకోవడానికి పెద్దగా స్కోప్ లేని పాత్ర కావడంతో తన పరిధి మేరకు ఒకే అనిపించారు. క్లైమాక్స్ సీన్లలో ఆకట్టుకొన్నారు. శ్రద్దా దాస్‌ గ్లామర్‌గా కనిపించినా ఆకట్టుకోవడానికి ఆ పాత్రలో సరుకు పెద్దగా కనిపించలేదు. ఆమె నామమాత్రంగానే మిగిలిపోయింది. బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్ పాత్రలు గుర్తుండిపోతాయి.

  టెక్నికల్ విభాగాలు

  టెక్నికల్ విభాగాలు

  సాంకేతిక అంశాల్లో గోకుల్‌ భారతి సినిమాటోగ్రఫి, ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం ఆకట్టుకొనే అంశాలు. పాటలు వినగానే గుర్తుండి పోతాయంటే కష్టమే. కాకపోతే రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అయింది. పలు సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యాయి. యూవీ క్రియేషన్ బ్యానర్ నుంచి సినిమా అంటే భారీ బడ్జెట్ అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే పరిమితమైన బడ్జెట్‌తో ఏక్ Mini కథను పెద్ద చిత్రంగా మలచడానికి చేసిన ప్రయత్నం బాగుంది.

  Recommended Video

  OTT లో Ek Mini Katha, Prabhas Facebook Post || Filmibeat Telugu
  ప్రేక్షకుల మెప్పే సక్సెస్‌గా

  ప్రేక్షకుల మెప్పే సక్సెస్‌గా

  ఫైనల్‌గా తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ప్రయోగాత్మకమైన కథలకు పెద్దగా చోటు ఉన్నట్టు కనిపించదు. కాకపోతే ఇటీవల కాలంలో యువ దర్శకులు విభిన్నమైన కథలు, సృజనాత్మకతతో తెలుగు తెరపై మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయినా.. గొప్ప మ్యాజిక్ కనిపించదు. కాకపోతే కామెడీ చిత్రాలను ఆదరించే వారికి, విభిన్నమైన కథల కోసం ఎదురు చూసే వారికి ఏక్ మినీ కథ తప్పకుండా నచ్చుతుంది. థియేటర్లు, బాక్సాఫీస్ కలెక్షన్లు స్టామినా లెక్కించే గొడవలు ఉండవు కాబట్టి ఈ సినిమాకు ప్రేక్షకుల మెప్పే సక్సెస్‌గా మారుతుంది.

  English summary
  Ek Mini Katha movie review and rating: Young Hero Santosh Shobhan, Kavya Thapars latest movie is Ek Mini Katha. This movie released on Amazon Prime Video on May 27th, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X