»   »  ఎలా చెప్పను?

ఎలా చెప్పను?

Subscribe to Filmibeat Telugu
Elacheppanu
-జలపతి గూడెల్లి
చిత్రం: ఎలా చెప్పను
నటీనటులు: తరుణ్‌, శ్రియా, సునీల్‌
సంగీతం: కోటి
నిర్మాత: స్రవంతి రవికిషోర్‌
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రమణ

స్రవంతి రవికిషోర్‌ నిర్మించే చిత్రాల్లో సెంటిమెంట్‌ అధికమై, వినోదమై తక్కువైపోతోంది. నువ్వే..నువ్వే చిత్రంలో పూర్తిగా డైలాగ్స్‌ ను నింపివేసిన ఈ నిర్మాత ఇప్పుడు హిందీ చిత్రం తుమ్‌ బిన్‌ ను సెంటిమెంట్‌ తో నింపివేశాడు. అదీకూడా కలగాపులగంగా. హిందీలో ఓ మోస్తారుగా హిట్టైన 'తుమ్‌ బిన్‌' కథ అబ్సర్డ్‌. దాన్ని త్రివిక్రమ్‌ ధోరణిలో కొద్దిగా సునీల్‌ తో కామెడీ..కాసేపు హీరో, హీరోయిన్ల ప్రేమ..మళ్ళీ సెంటిమెంట్‌..ఈ ఫార్ములాలో 'స్రవంతి' బ్యానర్‌ లో వచ్చిన వరుసగా నాలుగో చిత్రం ఇది. ఫస్టాఫ్‌ ఫర్వాలేదనిపించిన, సెకాండాఫ్‌..మొత్తం సాగతీతే. హీరోయిన్‌ ను ముగ్గురు ప్రేమిస్తారు.

హీరోయిన్‌ కూడా వేర్వేరు సందర్భాల్లో ముగ్గురు పట్లా మొగ్గుచూపుతుంది. కానీ, చివరికి హీరోనే దక్కించుకుంటాడు. అదీ కూడా రోటీన్‌ క్లైమక్స్‌ సన్నివేశంలో. హీరో లేదా విమానాశ్రాయానికి వెళ్ళడం వీళ్ళు ఇరువురు అక్కడే కలుసుకోవడమో, లేక చివర్లో యాక్సిడెంట్‌ అవ్వడం హీరోయిన్‌ కు అసలు విషయం అప్పుడు తెలిసి ఆసుపత్రికి రావడం..ఇటువంటి సీన్లు ఇప్పుడు కామన్‌ అయిపోయాయి.

కథ: తరుణ్‌ ఒక బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌. ఒక పార్టీలో జర్మనీ నుంచి వచ్చిన పారిశ్రామికవేత్త (శివబాలాజీ) పరిచయం అవుతాడు. ఆ పార్టీ ముగించుకొని, జర్మన్‌ లో ఉన్న తన గర్ల్‌ ఫ్రెండ్‌ (శ్రియా)తో సెల్‌ ఫోన్‌ లో మాట్లాడుకుంటూ..రోడ్డు మీద నడుస్తుండగా..తరుణ్‌ కారు వచ్చి డాష్‌ ఇస్తుంది. అక్కడికక్కడే చనిపోతాడతను. ఒక అమ్మాయి ప్రాణాల్ని కాపాడబోయి యాదృచ్ఛికంగా తరుణ్‌ అతని ప్రాణాలు తీసుకుంటాడు.

అయితే, అతని ఫ్రెండ్‌ సునీల్‌ (ఇతను కూడా జర్మనీ నుంచి వస్తాడు) ప్రమాద స్థలం నుంచి తరుణ్‌ ను ఇంటికి లాక్కెళుతాడు. ఈ ఘటన మర్చిపోయేందుకు హీరో జర్మనీ పయనమవుతాడు (వీసా గట్రా ఎలా సంపాదిస్తాడు అనేది మనకనవసరం, హీరోలు ఎప్పుడు కావాలంటే విదేశాలకు వెళ్ళిపోవచ్చు). అక్కడే శివబాలాజీ ఆఫీస్‌ కెళ్ళి ఉద్యోగం సంపాదిస్తాడు. మూసివేతలో ఉన్న కంపెనీని లాభాల బాటలో పెట్టడంతో శ్రియా తరుణ్‌ ను ఇష్టపడుతుంది. ఈ లోపు మరో కంపెనీ ఎండీ శ్రియా ప్రేమలో పడుతాడు. చివర్లో యూజవల్‌ ట్విస్ట్‌ లు. ఏడుపులు. కలయికలు.

సునీల్‌ హాస్యం బాగున్నా, ఆయన డైలాగ్‌ లో మాటిమాటికీ గాలిపీల్చి గుర్రం సకిలించినట్లు చేయడం బాగాలేదు. తరుణ్‌ తన వయసుకు మించిన బరువైన పాత్ర. రితిక్‌ రోషన్‌ తరహాలో మాటమాటికీ ఏడుస్తుంటాడు. శ్రియా నటన ఓకే అయినప్పిటికీ, ఒక సందర్భంలో ఆమెకి తను చెప్పుతున్న డైలాగ్‌ లు సంతోషకరమైనవో, విషాదమైనవో తెలియనట్లుగా నవ్వుతూ ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వడం విచారకరం. భాష తెలియని ముద్దుగుమ్మల నటన అంతే. పాపం దర్శకుడు రమణకు ఇది వరుసగా మూడో తలతిక్క కథ అందించారు. మూడు సార్లు ఆయన స్కేప్‌ గోటే. హరి ఫోటోగ్రఫీ చూడచక్కగా ఉంది.

Please Wait while comments are loading...