twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూ: 'ఎందుకంటే ప్రేమంట', ఇందుకా?

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
    నటీనటులు: రామ్‌, తమన్నా, రాధికా ఆప్టే, సుమన్, షాయాజి షిండే, రఘుబాబు, సుమన్‌ శెట్టి తదితరులు
    మాటలు: కోన వెంకట్
    పాటలు: రామజోగయ్య శాస్ర్తి, శ్రీమణి
    సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
    కెమెరా: ఐ.ఆండ్రూ
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    ఫైట్స్: పీటర్ హెయిన్స్
    సమర్పణ: పి.కృష్ణచైతన్య.
    నిర్మాత: పి.రవికిషోర్
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.

    ఓ హాలీవుడ్ ఫన్ లవ్ స్టోరీకి టాలీవుడ్ యాక్షన్ సీన్స్ కలిపి వదిలితే ఎలా ఉంటుంది...చాలా సార్లు బాగానే ఉంటుంది.. అయితే కొన్ని సార్లే సరిగ్గా పాళ్లు కుదరక ఏ థ్రెడ్ కా ఆ థ్రెడ్ విడిపోయి... 'ఎందుకంటే ప్రేమంట'సినిమాలా కిచిడీలా తయారవుతుంది. హాలీవుడ్ చిత్రం 'జస్ట్ లైక్ హెవెన్' ఫ్రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి రెగ్యులర్ తెలుగు సినిమా సెంటిమెంట్, విలనిజం కలిపారు కాని రెండూ ఒకదానికికొకటి సింక్ కాక ప్రేక్షకలుకు 'జస్ట్ లైక్ బోర్' గా మిగిలింది.

    భాధ్యతలు అంటే పట్టని అల్లరి కుర్రాడు రామ్(రామ్). తన మాట వినకపోవటంతో రామ్ ని ప్లాన్ చేసి ప్యారిస్ పంపుతాడు అతని తండ్రి(షాయాజి షిండే). ఆ దేశంలో ఎంజాయ్ చేయవచ్చు అని ఎగేసుకుంటూ వెళ్లిన అతనికి అక్కడో ట్విస్ట్ ఎదురౌతుంది. అతని పాస్ పోర్ట్ కూడా లాగేసుకుని అక్కడ ద్రాక్ష సారాయి ప్యాక్టరీలో అతన్ని కష్టపడి పనిచేసుకు బ్రతమని ఇరికిస్తారు. చేతులో డబ్బులేక, చెప్పుకునే దిక్కులేక విషాద యోగంలో ఉన్న అతనికి స్రవంతి(తమన్నా)పరిచయం అవుతుంది. ఆమె అక్కడున్న ఇండియన్ అంబాసిడర్(సుమన్)కూతురు. ఛేజింగ్ లిబర్డి తరహాలో ఆమె స్వేచ్చను వెతుక్కుంటూ బయిటకు వస్తుంది.

    రామ్ కి పరిచయం అయిన ఆమె అతన్ని ప్యారిస్ నుంచి ఇండియా వెళ్లి పోవటానికి సహాయం చేస్తానంటుంది. అయితే తననుకూడా అతనితో పాటే ఇండియా తీసుకు వెళ్ళాలని కండీషన్ పెడుతుంది. సరేనన్న రామ్ ఆ తర్వాత ఆమె గురించి ఓ నిజం తెలిసి షాక్ అవుతాడు. ఇంతకీ రామ్ ని అంతలా షాక్ కి గురి చేసిన నిజం ఏమిటి.. .అసలు ఆమె.. రామ్ కి దగ్గరవటానికి కారణం ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    (స్పాయిలర్ ఎలర్ట్)

    పునర్జన్మ, ఆత్మల నేపధ్యంలో జరిగే ఈ కథ మొదటే చెప్పుకున్నట్లు Just Like Heaven (2005) అనే హాలీవుడ్ చిత్రాన్ని ప్రీమేక్ చేస్తూ తీసారు. అసలు ఒరిజనల్ చిత్రమే హాలీవుడ్ లో అంతంత మాత్రం ఆడింది. ఆ చిత్రాన్నే హిందీలో I See You (2006) అని తీసారు. అదీ డిజాస్టర్ అయ్యింది. మూల కథలో హీరోయిన్ కోమాలో ఉండి.. ఆత్మగా బయిటకు వచ్చి హీరోకు పరిచయం కావటం జరుగుతుంది. ఆ ఆత్మ హీరోకు ఒక్కడికే కనపడుతుంది. దాంతో ఆ సినిమాల్లో కామెడీ కొంత బాగం పండింది. అయితే హీరోయిన్ ఆత్మకు, హీరోకు మధ్య నడిచే కామెడీని ఎంజాయ్ చేసినా వారి మధ్య లవ్ స్టోరీని మాత్రం హర్షించలేకపోయారు. దానికి తోడు.. మనిషి చనిపోయాకే ఆత్మ బయిటకు వస్తుందన్న మన నమ్మకానికి విరుద్దంగా ... మనిషి కోమాలో ఉండగానే ఆత్మ బయిటకు రావటం అనే కొత్త పాయింట్ ని డైజస్ట్ చేసుకోవటం కష్టమై బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బోల్తా కొట్టడానికి కారణమైంది.

    ఈ 'ఎందుకంటే ప్రేమంట' సినిమాకు కూడా అదే సమస్య ఎదురైంది. ప్రేక్షకుడి నమ్మకాలకు విరుద్దంగా కథ నడుస్తుంది. ఆత్మతో ప్రేమలో పడటం అనేది.. కామిడీకి బాగానే ఉన్నా ఫీల్ తీసుకురావటంలో ఇబ్బంది ఎదురైంది. తొలిప్రేమ, డార్లింగ్ వంటి చిత్రాలకు కేవలం ట్రీట్ మెంట్ ని నమ్మి హిట్ కొట్టిన కరుణాకరన్ ఈ చిత్రంలో కోన వెంకట్ వంటి వారి కామెడీని కూడా నమ్ముకున్నాడు. ఫస్టాఫ్ కథ కదలకుండా సీన్స్ సిల్లీగా వేసుకుంటూ వెళ్లటం బోర్ కొట్టింది. ఇంటర్వెల్ వద్ద ట్విస్ట్ ను నమ్ముకుని ఫస్టాఫ్ ని నడిపారు. ఇక ఇంటర్వెల్ దగ్గర కొచ్చే సరికి హీరోయిన్ ఆత్మ అని తేలి.. ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ అయిన లవ్ ఫీల్ ని మొత్తం పోగెట్టేసింది. బ్రహ్మానందంతో సెకండాఫ్ లో కామెడీని సైతం పెట్టి నిలబెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే లేటైపోయింది. దర్శకుడు చేతిలోంచి ప్రేక్షకులు జారిపోయారు.
    వీటికి తోడు యాక్షన్, లవ్ రెండూ ఒకేసారి పక్కపక్కన నడిపేసి యాక్షన్ లవ్ స్టోరీగా సినిమాని మలచాలన్ని దర్సకుడు ప్రయత్నం వికటించి... అటు ప్రేమ కథగానూ కాక, ఇటు యాక్షన్ స్టోరీగానూ కాక మధ్యస్ధంగా మిగిలిపోయిందీ చిత్రం. ఇవన్నీ చాలదన్నట్లు టెర్రరిజం, పునర్జన్మ వంటి మూల కథలో లేని అంశాలు సైతం ఈ సినిమాకు కలిపి వండారు. పోని కథకు మరింత బలం ఇవ్వటానకి, లాజిక్ లను ఫిక్స్ చేయటానకి కలపారు అనుకున్నా లూజ్ ఎండ్స్ లా వాటిని వదేలేసారు.

    ఫస్టాఫ్ లో కనపడే టెర్రరిస్ట్ ఏమయ్యాడో తెలియదు.. సినిమా ప్రారంభంలో కనపడే పునర్జన్మ ఎపిసోడ్ కి సినిమాకు చివరకు ముడి పెట్టరు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటంతో టీవి సీరియల్ లా సాగుతున్న ఫీలింగ్ వచ్చేసింది. సినిమా క్లైమాక్స్ కి వచ్చేసింది.. అయిపోతుందనుకున్న మూడ్‌లో పాట వచ్చి మళ్లీ సినిమా మొదలవుతుంది. అలాగే హీరో, విలన్ ఒకరికొకరు ఎదురుపడే సరికే క్లైమాక్స్ పైట్ వచ్చేసింది. అదే సినిమాను మేజర్ గా దెబ్బ తీసింది. సూర్య చేసిన సెవెంత్ సెన్స్ సినిమాలో ఏ సమస్యను అయితే కథనపరంగా ఎదుర్కొన్నారో అదే ఈ సినిమాలోనూ రిపీట్ అయ్యింది.

    కథ విషయం ప్రక్కన పెడితే హీరో రామ్ తన దైన శైలిలో చాలా సీన్స్ లో చక్కగా మెచ్యూరిటీ తో చేసుకుంటూ పోయాడు. తమన్నా రెగ్యులర్ ఎక్సప్రెషన్స్ తో లవ్ సీన్స్ పండించే ప్రయత్నం చేసింది. అయితే సినిమా అంతా ఒకటే డ్రస్ వేసుకుని తమన్నా ఇబ్బంది పెడుతుంది. విలన్ లుగా పరిచయం చేసిన ఒకప్పటి హీరో రిషి, రైటర్ కోన వెంకట్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు. బ్రహ్మానందం కామెడీ బాగానే పేలినా కథకు సంబంధం లేకుండా పోయింది. డైలాగులు కేవలం కామెడీ సీన్స్ లో మాత్రమే బాగున్నాయి. ఛాయాగ్రహణం అందించిన ఆండ్రూ ఈ సినిమాకు ఉన్న ఏకైక ప్లస్ అని చెప్పాలి. ఎడిటింగ్ మరింత షార్పు గా అంటే సెకండాఫ్ దాదాపు ఓ అరగంట ట్రిమ్ చేయవచ్చు అనిపించింది. పాటలు విన్నప్పటికంటే చూస్తున్నప్పుడే విజువల్ గా బాగున్నాయి.

    ఓపినింగ్స్ సైతం పెద్దగా తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం సెకండాఫ్ ట్రిమ్ చేసి వదిలితే ఫలితం కనిపించవచ్చు. క్లీన్ గా ఉండి, అక్కడక్కడా కామెడీ కూడా బాగా పేలింది కాబట్టి ఫ్యామిలీలు కొంత బోర్ ని భరిస్తే మిగతాది ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

    English summary
    Karunakaran's romantic comedy Endukante Premanta starring Ram, Tamanna has hit theatres today with Divide talk. The film is being touted as a sensitive love story with a twist. Sravanthi Ravi Kishore has produced the film with high technical values. GV Prakash has composed the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X