»   » నవ్విస్తుంది... (ఎక్స్ ప్రెస్ రాజా రివ్యూ)

నవ్విస్తుంది... (ఎక్స్ ప్రెస్ రాజా రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

తారాగణం: శర్వానంద్, సురభి, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, ఊర్వశి, హరీష్ ఉత్తమన్, ధనరాజ్, శకలక శంకర్, పోసాని, నాగీనీడు తదితరులు
నిర్మాణం: యు.వి క్రియేషన్స్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి: కార్తిక్ గట్టమనేని
ఎడిటర్: సత్య.జి
నిర్మాతలు: వంశీ, ప్రమోద్,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మేర్లపాక గాంధి.

విడుదల : 14.01.2016

హీరో శర్వానంద్ మంచి నటుడే.. కానీ ఈ మధ్య సరైన హిట్టు లేదు. తాజాగా శర్వానంద్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ప్రెస్ రాజా'. ఈ చిత్రాన్ని ‘మిర్చి', ‘రన్ రాజా రన్' లాంటి చిత్రాలు తెరకెక్కించిన యూవి క్రియేషన్స్ నిర్మించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. బాలయ్య, ఎన్టీఆర్, నాగ్ లాంటి పెద్ద హీరోలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో దూకిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి పరిచింది అనేది రివ్యూలో చూద్దాం...

 Express Raja

కథ విషయానికిస్తే...
వైజాగ్‌లో బేవార్స్‌గా తిరిగే రాజా (శర్వానంద్), అతని ఫ్రెండ్ (ప్రభాస్ శ్రీను)లకు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కాంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు పోలీస్ ఆఫీసర్ పోసాని. వీరిద్దరు బేవార్స్ అయిన తెలిసానా రాజా తండ్రి (నాగినీడు)పై ఆ పోలీస్ అధికారికి గల అభిమానంతో వారికి ఉద్యోగం ఇప్పిస్తాడు. హైదరాబాద్ లో అమూల్య (సురభి) ప్రేమలో పడతాడు రాజా. రాజాకు కుక్కలంటే అస్సలు పడదు. అమూల్య తన కుక్కని ప్రాణంగా పెంచుకుంటుంది. రాజా ప్రేమను అమూల్య అంగీకరించే సమయంలో కుక్క తప్పిపోతుంది. వాస్తవానికి ఆకుక్కను రాజాయే మున్సిపాలిటీ వాళ్లు పట్టిస్తాడు. దీంతో చాలా డిస్ట్రబ్ అయిన అమ్యూల్య కుక్కని తిరిగి తెచ్చిస్తేనే ప్రేమిస్తాను అని తేల్చి చెబుతుంది. కుక్కను వెతికే ప్రయత్నం మొదలు పెట్టిన రాజా... మరికొందరు కూడా అదే కుక్క కోసం వెతకడం చూసి ఆశ్చర్య పోతాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది. అసలు ఆ కుక్క కోసం అంత మంది ఎందుకు వెతుకుతున్నారు? రాజా ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
రాజా పాత్రలో శర్వానంద్ ఎనర్జిటిక్ గా నటించాడు. తనదైన మార్క్ డైలాగులు, కామెడితో మెప్పించాడు. హీరోయిన్ సురభి అందం పరంగా, అభినయం పరంగా ఆకట్టుకుంది. రాజా ఫ్రెండ్ పాత్రలో ప్రభాస్ శ్రీను బాగా చేసాడు. ఇనుము పాత్రలో ధనరాజ్, సప్తగిరి బాగా నవ్వించారు. అదే విధంగా షకలక శంకర్, ఊర్వశి ఆకట్టుకున్నారు. సుప్రీత్‌ (కాట్రాజ్‌) కామెడి విలన్‌గా మెప్పించాడు. విలన్ గా హరీష్ ఉత్తమన్ నటన బాగుంది.

సాంకేతిక పరమైన అంశాలు పరిశీలిస్తే....ఎక్స్ ప్రెస్ రాజాకి కార్తీక్ ఘట్టమనేని కెమెరా, ప్రవీణ్ లక్కరాజు పాటలు జె.బి. నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ బావుంది. సినిమా ఫస్టాఫ్ వినోదాత్మకంగా ఉంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నిరాశ పరిచింది. స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేదు. పాత్రలు ఎక్కువగా ఉండటం, సినిమా వేగంగా రన్ చేయడం వల్ల కొన్ని పాత్రల్లో స్పష్టత కొరవడింది. కొన్ని కామెడీ సీన్లు ఓవర్ అనిపించాయి. ఎడిటింగ్ ఇంకాస్త పర్ ఫెక్టుగా ఉండాల్సింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే.... సినిమాలో కొన్ని లోపాలున్నప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో మాస్ ఆడియన్స్ మెచ్చే రేంజిలో కమర్షియల్ అంశాలు లేవనే చెప్పాలి. కామెడీ ఆశించే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్.

English summary
Express Raja movie Review. Merlapaka Gandhi came with good entertaining story. The plot is interesting and he got good punchlines and dialogues. Film's first half sails smoothly and it is average.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu