Just In
- 27 min ago
2022 సంక్రాంతి ఫైట్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు మరో అగ్ర హీరో
- 1 hr ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 2 hrs ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 2 hrs ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
Don't Miss!
- News
బీర్ తాగుతూ కారు డ్రైవ్?: యువతులతో కలిసి: అనంతపురం రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
- Sports
విరాట్ కోహ్లీ ఆధునిక తరానికి హీరో: స్టీవ్ వా
- Automobiles
వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- Finance
టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
FCUK మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టాలీవుడ్‌లో తాజాగా ఆసక్తిని రేపిన టైటిల్ FCUK (ఫాదర్, చిట్టి, ఉమా, కార్తీక్). టైటిల్ వినగానే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే టీజర్లు, ట్రైలర్లు మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచాయి. జగపతి బాబు పాత్రపై భారీ అంచనాలే వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 12వ తేదీన రిలీజైన ఈ చిత్రం గురించిన సమీక్ష మీ కోసం..

FCUK మూవీ కథ
తెలుగు రాష్ట్రాల్లో కండోమ్స్ వ్యాపారాన్ని కొనసాగించే ఫణి భూపాల్ (జగపతి బాబు) పక్కా ప్లేబాయ్. యవ్వనంలోనే భార్య మరణించడంతో కొడుకు (రామ్ కార్తీక్) కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇక కార్తీక్ డాక్టర్ ఉమతో ప్రేమలో పడుతాడు. కానీ తన ప్రేమను చెప్పడానికి ముందే ఉమకు ఎంగేజ్‌మెంట్ అవుతుంది. ఈ క్రమంలో ఊహించని విధంగా 60 ఏళ్ల ఫణిభూపాల్ ఏడాది పాప చిట్టి (బేబీ ఆశ్రిత)తో ప్రత్యక్షమై తన కూతురు అంటూ అందరికీ షాకిస్తాడు.

FCUK మూవీలో ట్విస్టులు
చిట్టి ఎవరి వల్ల ఫణిభూపాల్ బిడ్డగా మారింది. ఫణి భూపాల్ జీవితంలోకి చిట్టి ఎలా ప్రవేశించింది. ఉమతో కార్తీక్ ప్రేమ వర్కవుట్ అయిందా? కార్తీక్ జీవితంలో చిట్టి ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది. చివరకు ఉమ, కార్తీక్ పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే FCUK కథ.
ఉప్పెన మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటుల ఫెర్ఫార్మెన్స్
ఇటీవల కాలంలో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న జగపతి బాబు.. ఈ చిత్రంలో ఫణి భూపాల్ అనే నాసిరకం పాత్రలో కనిపించడం జీర్ణించుకోలేని విషయం. ఇక రామ్ కార్తీక్ పాత్రను మరింత ఎనర్జిటిక్, సెన్సిబుల్‌గా చూపించే అవకాశం ఉన్నప్పటికి... ఆ ఛాన్స్‌ను జార విడుచుకొన్నారు. ఇక అమ్ము అభిరామి తన వంతుగా ఫర్వాలేదనిపించారు. చిన్నారి చిట్టి ముద్దొచ్చేలా కనిపించింది.

సాంకేతిక విభాగాల పనితీరు
ఇక దర్శకుడు విద్యాసాగర్ రాజు సరైన పాయింట్‌ను తన కథకు ఎంచుకొన్నప్పటికి పూర్తిస్థాయిలో ఫీల్‌గుడ్ మూవీగా మలచలేకపోయారు. నాసిరకమైన సన్నివేశాలతో విసుగుపుట్టించారు. బూతు, ద్వందర్థాలతో రోత పుట్టించిన పని చేశారు. ఇక రెండో భాగంలో విపరీతంగా క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ విసుగుపుట్టించారు. ఓ అర్ధం పర్థం లేని డైలాగ్ సహనానికి పరీక్ష పెట్టాయి. ఇక సాంకేతిక విభాగాల పనితీరు ఫర్వాలేదనిపించారు.

ప్రోడక్షన్ వ్యాల్యూస్
ఇక నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ గతంలో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారు. FCUK మూవీ విషయానికి వస్తే ఆయన అభిరుచికి విరుద్ధంగా తీసిన చిత్రమని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఓవరాల్‌లో ఏ మాత్రం ఆకట్టుకొని నాసిరకమైన సినిమా అని చెప్పవచ్చు.

నటీనటులు, సాంకేతిక వర్గం
తారాగణం: జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ తదితరులు

సాంకేతిక బృందం
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కెఎల్ దామోదర్ ప్రసాద్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఛాయాగ్రహణం: శివ జి
మాటలు: ఆదిత్య, కరుణాకర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఆర్ట్: జెకె మూర్తి
పిఆర్వో: యల్ వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూసర్: వాసు పరిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీకాంత్‌రెడ్డి పాతూరి
సహనిర్మాత: యలమంచిలి రామకోటేశ్వరరావు
బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్
రిలీజ్ డేట్: 2021-02-12