»   » ప్రేమికులకు నచ్చుతుందేమో? (‘ఫితూర్’ మూవీ రివ్యూ)

ప్రేమికులకు నచ్చుతుందేమో? (‘ఫితూర్’ మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫితూర్'. పూర్తిప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాలంటైన్స డేను, ప్రేమికులను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసారు. చార్లెస్‌ డికెన్స్‌ రాసిన అద్భుతమైన ప్రేమకావ్యం 'గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌' అనే నవల ఆధారంగా ఈ సినిమాను కాశ్మీర్ నేపథ్యంతో తెరకెక్కించారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బాగా హైప్ వచ్చిని సినిమాల్లో ఇదీ ఒకటి. ప్రేమ నేపథ్యంలో సినిమాలు చాలా వస్తాయి. కానీ ప్యూర్ లవ్ స్టోరీతో పూర్తిగా అదే కాన్సెప్టుతో వచ్చే సినిమాల చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా ‘ఫితూర్' అలాంటి ప్యూర్ లవ్ స్టోరీ కిందకే వస్తుంది. పూర్తి స్థాయి లవ్ ఎమోషన్స్ కూడిన సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం...

పదమూడేళ్ల నూర్‌(ఆదిత్య రాయ్‌ కపూర్‌) కశ్మీర్‌లోని తన అక్క, బావలతో కలిసి ఉంటాడు. వీరిది పేద కుటుంబం. అదే ఊరిలో కులీన వంశానికి సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ఫిర్దౌసి(కత్రినా కైఫ్). ఫిర్దౌసి తల్లి బేగమ్‌ హజ్రత్‌(టబు) ఓ రోజు బంగ్లాకు మరమ్మత్తులు చేసేందుకు నూర్‌ ను పిలిపిస్తుంది. ఈ క్రమంలో ఫిర్దౌసిని చూసి ప్రేమలో పడిపోతాడు నూర్. ఫిర్దౌసి కూడా అతన్ని తొలి చూపులోనే ఇష్టపడుతుంది కానీ దానికి బయటకు వ్యక్తం చేయదు. ప్రేమలో మోసపోయిన బేగమ్ కు ప్రేమ అన్నా, మగాళ్లు అన్నా అసహ్యం. తన కూతురును కూడా అలాంటి వాటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కూతురు ఫిర్దౌసీ ఉన్నత చదువుల కోసం లండన్ పంపిస్తుంది. నూర్ కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. డబ్బు, హోదా సంపాదిస్తాడు. అయినా ఫిర్దౌసిపై తన ప్రేమ ఏ మాత్రం తగ్గకపోవడంతో తిరిగి తన వూరికి వచ్చి ఫిర్దౌసిని కలుస్తాడు. ఫిర్దౌసీ కూడా తనను ఇష్టపడుతుందని అనుకుంటాడు. అయితే బేగమ్ మాత్రం వారిని విడదీయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఫిర్దౌసీకి పాకిస్థాన్ చెందిన రాజకీయ నాయకుడితో పెళ్లి సెటిలవుతుంది....మరి ఈ ప్రేమికులు కలిసారా? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
ఈ చిత్రంలో ఆదిత్యరాయ్ కపూర్ బావుంది. తన పాత్రకు తగిన విధంగా హావభావాలు పలికించాడు. లుక్స్ పరంగా కూడా ఆదిత్యరాయ్ కపూర్ ఆకట్టుకున్నాడు. గత సినిమాలతో పోలిస్తే నటనలో మరింత మెయ్యూరిటీ చూపించాడు. సినిమాలో హీరోయిన్ గా కత్రినా అందం పరంగా తప్ప పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. బహుషా ఆమె పాత్రే అలా డిజైన్ చేసారేమో అనినిపిస్తుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కు స్కోపు లేకుండా స్క్రీన్ ప్లే రాసాడనే భావన కలుగుతుంది. హావభావాల పరంగా కూడా కత్రినా మైనస్ మార్కులే పడ్డాయి. ఇక టబు పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. ఈ పాత్రకు ఆమె తప్ప మరెవరూ సెట్ కారేమో అనే రేంజిలో నటించింది. అజయ్ దేవగన్, అదితి రావు హైదరి చిన్న పాత్రలో కనిపించారు.

టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే..
ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అనయ్ గోస్వామీ అందించిన సినిమాటోగ్రఫీ. కాశ్మీర్ అందాలను అద్భుతంగా చూపించాడు. ఇక అమిత్ త్రివేది, కోమయిల్ షాయన్ అందించిన సంగీతం, హితేష్ సోనిక్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే.

డైరెక్టర్

డైరెక్టర్


దర్శకుడు ఎంచుకున్న ప్రేమకథ బాగానే ఉంది కానీ సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను మలచడంలో పూర్తిగా విఫలం అయ్యాడు.

నవల ఆధారంగా..

నవల ఆధారంగా..


హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాలను బాగా తెరకెక్కించినప్పటికీ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను నచ్చే విధంగా ప్రజెంట్ చేయలేక పోయాడు. 'గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌' నవల ఆధారంగా సినిమా తీసిప్పటికీ సినిమాను ఇండియన్ నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేసారు. అలా చేసినపుడు కనీసం కథనం అయినా ఆసక్తిగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ విషయంలో దర్శకుడు తడబడ్డాడు.

ఫైనల్ వర్డ్

ఫైనల్ వర్డ్


ఓవరాల్ గా చెప్పాలంటే..... ‘ఫితూర్' మంచి ప్రేమ కావ్యమే అయినప్పటికీ సగటు ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో సంతృప్తి రచలేక పోయింది. అయితే ప్రేమలో మునిగి ఉన్నవారైనా సినిమాలోని ఎమోషన్స్‌ కనెక్ట్ అవుతారా? లేరా? అనే దానిపై విజయం ఆధార పడి ఉంటుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు


ఆదిత్య రాయ్‌ కపూర్‌, కత్రినా కైఫ్, టబు, అజయ్‌ దేవగన్, అదితిరావ్‌ హైదరీ తదితరులు
కథ: అభిషేక్‌ కపూర్, సుప్రతీక్‌ సేన్
సంగీతం: అమిత్‌ త్రివేది
సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి
నిర్మాతలు: అభిషేక్‌ కపూర్, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌దర్శకత్వం: అభిషేక్ కపూర్

English summary
Fitoor movie is based on Charles Dickens' novel Great Expectations and is written by director Abhishek Kapoor and Supratik Sen. Aditya Roy Kapoor reprises the role of Pip, Katrina Kaif is Estella and Tabu is playing the role of wealthy spinster Miss Havisham. Great Expectations had a commendable story, we wonder if Abhishek Kapoor's desi version will have the same impact as the novel! Will Aditya, Katrina and Tabu give justification to their characters? Has Abhishek Kapoor been successful in delivering us an entertaining film with Fitoor? Read to find out!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu