twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నింగికెగసిన గగనం (గగనం మూవీ రివ్యూ)

    By Nageswara Rao
    |


    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    తారాగణం: అక్కినేని నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్, సనాఖాన్
    సంగీతం: ప్రవీణ్ మణి
    సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్
    నిర్మాత: దిల్ రాజు
    దర్శకత్వం: రాధామోహన్
    తేది: 11/02/2011

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై దిల్ రాజు నిర్మించిన 'గగనం' చిత్రానికి ఆకాశమంత ఫేం రాధా మోహన్ దర్శకత్వం వహించాడు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, పునంకౌర్, సనాఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పాటలు లేని ఈ సినిమాకు ప్రవీణ్ మణి నేపధ్య సంగీతాన్ని సమకూర్చారు. కే.వి.గుహన్ సినిమాటోగ్రఫీ అందించగా మార్తాండ్ .కె.వెంకటేష్ ఎడిటింగ్ నిర్వహించారు. పాటలు, ఫైట్లు, రొమాన్స్ వంటి కమర్షియల్ అంశాలు ఏమీ లేకుండా కధను నమ్మి నిర్మించిన ఓ ప్రయోగాత్మక చిత్రం అని చెప్పి సినిమా చూడటానికి ఏవిధమైన అంచనాలు పెట్టుకోకుండా రండి అని ప్రచారం చేసి మంచి ఫలితాలనే రాబట్టుకున్నారు నాగార్జున, దిల్ రాజు. ఇది ఒక మంచి చిత్రం, ఇక ఫై ప్రయోగాత్మక చిత్రాలు తెలుగులో రావటానికి నిజాయితితో చేసిన ప్రయత్నం అని నాగార్జున నమ్మకంగా చెప్పాడు.

    ఇక కధ విషయానికి వస్తే బిన్న నేపద్యాల నుండి వచ్చిన ప్రయాణికులు చెన్నై నుండి ఢిల్లీ వెళ్ళటానికి స్టార్ జెట్ అనే విమానం ఎక్కుతారు. బయలుదేరిన కొద్ది సమయానికే ఐదుగురు టెర్రరిస్ట్ లు విమానాన్ని హైజాక్ చేస్తారు. దాంతో తిరుపతిలో అత్యవసరంగా ల్యాండ్ అవుతుంది విమానం. 100 కోట్ల నగదు తో పాటు వారి నాయకుడు యూసఫ్ ఖాన్ ను కూడా విడుదల చేయాలి లేదంటే విమానంలో ఉన్న 100 మందిని చంపేస్తామని బెదిరిస్తారు. ఈ విషయం తో అలెర్ట్ అయిన ప్రభుత్వం వారితో చర్చలకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రమాదం నుండి బయట పడటానికి నేషనల్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ వి.రవీంద్ర(నాగార్జున)ను పిలిపిస్తారు. హోం సెక్రటరీ విశ్వనాధ్ (ప్రకష్ రాజ్) ను కమాండో యాక్షన్ కోసం అడుగుతాడు రవీంద్ర.

    కానీ విమానంలో ఓ కేంద్ర మంత్రి ఉండటం, రాబోయే మూడు నెలల్లో ఎలక్షన్లు ఉండటంతో అందుకు ప్రభుత్వం ఒప్పుకోదు. చివరికి చేసిది ఏమి లేక యూసఫ్ ఖాన్ ను విడుదల చేయటానికి నిర్ణయిస్తారు. తానే స్వయంగా పట్టుకున్న యూసఫ్ ఖాన్ ను వదిలిపెట్టడం ఇష్టంలేని రవీంద్ర తన ప్రయత్నాలు తానూ చేస్తూనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే జైలు నుండి తీసుకువస్తున్న యూసఫ్ ఖాన్ వాహనానికి ప్రమాదం జరిగి అతను మరణిస్తాడు. కానీ ఆ విషయాన్నీ నమ్మే పరిస్థితిలో టెర్రరిస్ట్‌లు సిద్దంగా లేరు. ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితులను తన అధినంలోకి తీసుకున్న రవీంద్ర తెలివిగా వ్యవహరించి ఆపరేషన్ 'గగనం' కు రూపకల్పన చేస్తాడు. ఇక అక్కడ నుండి ఆపరేషన్ 'గగనం' ఏవిధంగా విజయం సాధించింది అన్నది మిగిలిన కధ.

    మూస సినిమాలను చూసి చూసి విసుగెత్తి పోయిన తెలుగు ప్రేక్షకులను 'గగనం' సినిమా ఓ కొత్తరకం అనుభూతితో అలరిస్తుంది. ఆరు పాటలు, ఆరు ఫైట్ లు, పంచ్ డైలాగులు, హీరోయిన్ తో రోమాన్స్ వంటి ఏ విధమైన వ్యాపారాత్మక అంశాలు లేకుండా కేవలం కధ, కధనంలోని వైవిద్యంతోనే ప్రేక్షకులను కట్టిపడేసారు ఈ సినిమా రూపకర్తలు. లాజిక్ మిస్సవ్వకుండా, అనవసరపు హడావిడి లేకుండా, సున్నితమైన హాస్యంతో కధ పట్టు తప్పకుండా చాల జాగ్రత్తగా కధనాన్ని తయారు చేసుకున్నారు దర్శకుడు రాధా మోహన్. లాజిక్ ను కాపాడే ప్రయత్నంలో మొదటి సగం కాస్త నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ మలుపును ఆసక్తి కరంగా మొదలుపెట్టి ఆతరవాత దాన్నిబ్యాలెన్స్‌గా నడిపించి ముగించిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది.

    అది ఎంతలా అంటే ఈ సినిమాలో పాటలు లేవే, రొమాన్స్ లేదే అన్న ఆలోచనే ప్రేక్షకుడికి రాదు. ఉమర్జి అనురాధ మాటలు కధకు అనుగుణంగా చక్కగా ఉన్నాయి. గుహన్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ తో పాటు మిగతా అన్ని విభాగాలు సమర్దవంతంగా తమ భాద్యతలను నిర్వర్తించాయి. టాలెంట్ ఉన్న కొత్త వారిని పరిచయం చేయడమే కాదు 'గగనం' వంటి కొత్త తరహ చిత్రాలను నిర్మిస్తూ తెలుగు సినిమా భవిష్యత్తు గమనాన్ని నేర్దేశించడంలో తన వంతు భాద్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్న నిర్మాత దిల్ రాజు మనం అందరం మనసుపూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

    కింగ్ నాగార్జున ఈ సినిమాలో హీరోగా కాకుండా ఓ ప్రధాన పాత్రగా కనిపించడం విశేషం. ఎందుకంటే ఈ సినిమాలో హీరో కధ కాబట్టి. మిలిటరీ ఆఫీసర్ గా చాలా హుందాగా, ఠీవిగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక పొతే బ్రహ్మానందం తనదైన శైలిలో నటించి కడుపార నవ్విస్తాడు. ముఖ్యంగా రంగనాథ్ అలియాస్ యూసఫ్ ఖాన్ పాత్ర గుర్తుకువచ్చినప్పుడల్లా నవ్వుతెప్పిస్తుంది. నాగార్జున, బ్రహ్మానందం వంటి వారు కాకుండా చాల మంది మనకు తెలియని నటులే సినిమా నిండా ఉన్నా అక్కడ పాత్రలే కనిపిస్తాయి కానీ వ్యక్తులు కనిపించరు. ఏది అయితేనేం మంచి కధ, దానిని తెరకెక్కించిన విధానం, సున్నితమైన హాస్యం, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాని సక్సెస్ వైపు నడిపిస్తాయి.

    English summary
    Director Radha Mohan has chosen a hijack drama this time, the delicate emotions of passengers of the plane and the delay of bureaucracy in dealing with the terrorists and how the passengers are saved. Read on for Gaganam review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X