»   » గౌతమ్‌నంద మూవీ రివ్యూ: స్టయిలిష్‌.. డిఫరెంట్‌గా

గౌతమ్‌నంద మూవీ రివ్యూ: స్టయిలిష్‌.. డిఫరెంట్‌గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

Rating: 2.75/5

జిల్, సౌఖ్యం చిత్రాల తర్వాత టాలీవుడ్ హీరో గోపిచంద్ నటించిన తాజా చిత్రం గౌతమ్‌నంద. హీరోయిన్లు క్యాథరిన్, హన్సిక. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది. గత చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కథను బలంగా చెప్పలేకపోయాను. అందుకే గౌతమ్‌నంద చిత్రంలో ముఖ్యంగా కంటెంట్‌పై దృష్టిపెట్టానని దర్శకుడు సంపత్ నంది చెప్పుకొంటువస్తున్నాను. దాదాపు ఏడాదికిపైగా గ్యాప్ తీసుకొన్న గోపిచంద్ కూడా మంచి కంటెంట్ కోసం ఎదురు చూడటం వల్ల ఆలస్యమైందనే చెప్పారు. సింగిల్ సిట్టింగ్‌లో కథ ఓకే చేసిన గోపిచంద్ ఓ విభిన్నమైన పాత్రను పోషించారు. జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన గౌతమ్‌నంద చిత్రం ఎలా ఉందనే తెలుసుకోవాలంటే కథలోకి వెళ్తాం.


hansika photo gallery ; Catherine Tresa Photo Gallery


గౌతమ్ నంద కథ ఇలా..

గౌతమ్ నంద కథ ఇలా..

అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తగా ఫోర్బ్స్ జాబితాలో చేరిన ఘట్టమనేని విష్ణుకుమార్ (సచిన్ ఖేడ్కర్) కుమారుడు ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్). విలాసవంతంగా గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేసే గౌతమ్‌కు ఓ సందర్భంలో ఊహించిన ఓ సంఘటన ఎదురవుతుంది. సొంత గుర్తింపు లేని బతుకు ఎందుకు అని గౌతమ్‌ మనస్తాపానికి గురవుతాడు. తానేందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరకి విలాసవంత జీవితంపై విరక్తి కలిగి చనిపోవాలనుకొంటాడు. ఆ క్రమంలో గౌతమ్‌కు హైదరాబాద్ బోరబండలో నివాసి అయిన నంద (గోపిచంద్) ఓ విచిత్రమైన పరిస్థితిలో తారసపడుతాడు. అచ్చం తనలాగే ఉండే నందను చూసి గౌతమ్ షాక్ అవుతాడు. జీవితంపై విరక్తి చెంది తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని చెబుతాడు. డబ్బు లేక పోవడమే తన ఆత్మహత్యకు కారణమని నంద వివరిస్తాడు. ఎక్కువ సంపద ఉండటమే తనకు ఆత్మహత్యకు కారణమని గౌతమ్ చెబుతాడు.


Goutham Nanda Movie Public Talk And Review
అనేక పశ్నలకు సమాధానం ఇలా..

అనేక పశ్నలకు సమాధానం ఇలా..

ఇలా ఒకరి జీవితాలను మరొకరు తెలుసుకొన్న గౌతమ్, నంద‌లు ఓ అవగాహనకు వస్తారు. 30 రోజులపాటు ఒకరి జీవితాల్లోకి మరొకరు వెళ్లాలని డిసైడ్ అవుతారు. గౌతమ్ జీవితంలోని విలాసాన్ని నంద, నంద జీవితంలోని కష్ట సుఖాలు గౌతమ్ తెలుసుకొంటారు. ఆ క్రమంలో గౌతమ్‌ను కొందరు చంపడానికి వెంటాడుతుంటారు. గౌతమ్‌ను ఎవరు చంపాలనుకొంటున్నారు? గౌతమ్ ప్లేస్‌లోకి వెళ్లిన నంద పరిస్థితి ఏమిటి? నంద జీవితంలోకి వెళ్లిన గౌతమ్ ఎలాంటి ప్రేమానురాగాలను పొందాడు. చివరికి గౌతమ్ గౌతమ్‌నందగా ఎందుకు మారాడానే ప్రశ్నలకు సమాధానమే గౌతమ్ నంద చిత్రం.


ఫస్టాఫ్‌ నెమ్మదిగా..

ఫస్టాఫ్‌ నెమ్మదిగా..

‘ధన మూలమిధమ్ జగత్', ‘డబ్బు అన్నింటికి పరిష్కారం కాదు' అనే రెండు అంశాలను ఓ సింగిల్ పాయింట్ చేసుకొని గౌతమ్‌నంద చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ నంద. ఈ చిత్రంలో గౌతమ్ క్యారెక్టర్, నంద క్యారెక్టర్లను ఎలివేట్ చేయడంతోనే తొలిభాగంలో ఎక్కువ సమయాన్ని తీసుకొన్నాడు దర్శకుడు. రెండు ఫైట్లు, మూడు పాటలతో సాదాసీదాగా గడిచిపోతుంది. రొటీన్ సినిమా చూస్తున్నామా అనే ఫిలింగ్ గురయ్యే ప్రేక్షకుడికి ఇంటర్వెల్‌ ముందు ఆసక్తికరమైన ట్విస్ట్‌తో రెండో భాగంపై ఆసక్తిని రేపి దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నారు.


సెకండాఫ్ చకచకా..

సెకండాఫ్ చకచకా..

ఇక రెండో భాగంలో నంద కుటుంబ సభ్యుల మధ్య గౌతమ్ జీవితాన్ని చక్కగా దర్శకుడు చిత్రీకరించాడు. సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఇక ప్రీక్లైమాక్స్ నుంచి సినిమా మరో రేంజ్‌కు చేరుతుంది. ప్రీ క్లైమాక్స్ మొదలైన నుంచి ఎండ్ టైటిల్ పడే వరకు సన్నివేశాలు ఆసక్తికరంగా చకచక దూసుకుపోతాయి. సినిమా చివరి 30 నిమిషాలు గోపిచంద్ తన నటనతో ప్రేక్షకులకు కొత్త అనుభూతికి గురవుతారు. ఓవరాల్‌గా గోపిచంద్‌ను కొత్త కోణంలో చూశానమనే భావన ప్రేక్షకులకు కలుగడం ఈ సినిమాకు ప్రధానమైన బలం.


దర్శకుడు సంపత్ నంది పనితీరు ..

దర్శకుడు సంపత్ నంది పనితీరు ..

భూమి సూర్యుడి చుట్టు తిరుగుతుంటే.. మానవ సమాజం డబ్బు చుట్టూ తిరుగుతుంది అనే కొత్త కాన్సెప్ట్‌ను దర్శకుడు సంపత్ నంది ఎంచుకొన్నారు. తన కథకు తగిన సన్నివేశాలను. పాత్రల లుక్‌లను అద్బుతంగా రూపొందించడంలో అతని కష్టం కనిపిస్తుంది. సినిమాను స్టయిలిష్‌గా అందించాలన్న తపనే కనిపించింది. తొలిభాగంలో కథనం, సన్నివేశాలను ఇంకా బాగా రాసుకోగలిగి ఉంటే తొలిభాగం కూడా మరింత ఆసక్తికరంగా ఉండేది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి కథను బలంగా చెప్పాలనే ఆలోచన కారణంగానే రొటీన్ సన్నివేశాలు, కామెడీతో అక్కడ వరకు లాగించాలనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా తన కథా ఆలోచనను మనం అభినందించకుండా ఉండలేం. ప్రతీ మనిషి తాము ఎవరం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే పాయింట్ చెప్పడం మంచి ప్రయత్నం. తాను నమ్మిన కథను ఆసక్తికరంగా అందించే ప్రయత్నంలో కొంత తడబాటుకు గురైనా చివరికి ప్రేక్షకుడిని మెప్పించడంలో సఫలమయ్యాడనే చెప్పవచ్చు.


మరోసారి విభిన్నమైన పాత్రలో గోపిచంద్

మరోసారి విభిన్నమైన పాత్రలో గోపిచంద్

గోపిచంద్ కెరీర్ ఆరంభంలో హీరోగా ప్రయత్నించినప్పటికీ.. ఆ తర్వాత విలన్ క్యారెక్టర్లతో దుమ్ము రేపాడు. మళ్లీ హీరోగా సినిమాలు చేసి మంచి విజయాలను ఖాతాలో వేసుకోవడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఇలా తన కెరీర్‌ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గౌతమ్‌నంద లాంటి సినిమాను గోపిచంద్ చేయడం మంచి ఛాయిసే. గౌతమ్ పాత్రలో స్టయిలిష్‌గా, నంద క్యారక్టర్‌లో మాస్ లుక్స్‌తో ఆకట్టుకొన్నాడు. హీరోయిజంతోపాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించాడని కచ్చితంగా చెప్పవచ్చు.


గ్లామరస్‌గా క్యాథరిన్

గ్లామరస్‌గా క్యాథరిన్

సరైనోడు చిత్రంతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకొన్న క్యాథరిన్.. గౌతమ్ నంద చిత్రంలో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ చిత్రంలో ముగ్ధ అనే సంపన్న కుటుంబానికి చెందిన యువతిగా కనిపించింది. గౌతమ్ ప్రేమ కోసం తపించే అమ్మాయిగా కనిపించిన క్యాథరిన్.. అందాలను చాలా స్వేచ్ఛగా ఆరబోసింది. వాన పాటలో అదరగొట్టింది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో గ్లామర్‌తోనే సరిపెట్టుకొవాల్సి వచ్చింది.


మధ్య తరగతి యువతిగా హన్సిక

మధ్య తరగతి యువతిగా హన్సిక

ఈ చిత్రంలో హన్సిక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతిగా కనిపించింది. స్పూర్తి పాత్రలో కనిపించిన హన్సిక తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. హీరో పాత్రకు సపోర్టింగ్‌గా తప్ప ప్రత్యేకంగా ఆమె పాత్రకు గుర్తింపు ఉండదు. ఒకట్రెండు సీన్లలో తప్ప మిగితా అంతా పాటలకే పరిమితం అయింది.


మిగితా పాత్రల్లో ..

మిగితా పాత్రల్లో ..

ఈ సినిమాలో తనికెళ్ల భరణి పాత్ర చాలా కీలకం. సినిమా ఓ మలుపు తిరగడానికి కారణం ఆయన పాత్ర కారణం కావడంతో ఆ పాత్రను చక్కగా డిజైన్ చేశారు. కనిపించిన రెండు సీన్లైనా తనికెళ్ల భరణి గుర్తుండిపోతారు. ఇక గోపిచంద్‌కు తండ్రిగా మరాఠీ నటుడు సచిన్ ఖేడ్కర్ పాత్ర గురించి పెద్దగా చెప్పుకొనే అవకాశం లేదు. విలన్ పాత్రలో కనిపించిన ముఖేశ్ రుషి, నిక్తిన్ ధీర్ పరిస్థితి కూడా అంతే. గోపిచంద్‌ (నంద)కు తండ్రి చంద్రమోహన్‌ కనిపించారు. తన పాత్ర పరిధి మేరకు ఆయన ఓకే అనిపించారు. కమెడియన్లు బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్ ఆకట్టుకోలేకపోయారు.


నాసిరకంగా థమన్ సంగీతం..

నాసిరకంగా థమన్ సంగీతం..

ఈ సినిమాకు ప్రధాన లోపం ఎస్ఎస్ థమన్ సంగీతం. పాటలు చాలా నాసిరకంగా అనిపిస్తాయి. మరోసారి రొటీన్ కొట్టుడే కొట్టాడు అనే ఫీలింగ్ అందరికి కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నార్మల్‌గా ఉంటుంది. కీలక సన్నివేశాలను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు తమన్ ప్రయత్నం చేసినట్టు ఎక్కడ అనిపించదు.


సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ హైలెట్

సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ హైలెట్

సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ కెమెరా పనితనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. విదేశాల్లో షూట్ చేసిన సన్నివేశాలలో రిచ్‌నెస్ కనిపిస్తుంది. ఇంతకు ముందు కనిపించని విధంగా గోపిచంద్‌‌ను చాలా స్టయిలిష్‌గా చూపించాడు. తెర మీద క్యాథరిన్ గ్లామర్ చక్కగా ఆకట్టుకునే విధంగా ఉంది. కీలక సన్నివేశాలను బాగా చిత్రీకరించారు.


ఎడిటర్‌కు ఇంకా పని ఉంది..

ఎడిటర్‌కు ఇంకా పని ఉంది..

గౌతమ్ నంద సినిమాకు ఎడిటర్‌గా గౌతమ్ రాజు పనితీరు ఫర్వాలేదనిపించింది. కానీ ఇంకా తన కత్తెర పదును పెట్టాల్సిన అవసరం ఉంది. తొలిభాగంలో, రెండో భాగంలో ఇంకా కొంచెం ఎడిటింగ్ స్కోప్ ఉంది. కొంత మేరకు నిడివిని తగ్గిస్తే సినిమా చాలా క్రిస్ప్‌గా మారడానికి అవకాశం ఉంటుంది.


నిర్మాణ విలువలు భేష్

నిర్మాణ విలువలు భేష్

కథ డిమాండ్ మేరకు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు జే భగవాన్, జే పుల్లారావు చాలా రిచ్‌గా సినిమాను రూపొందించారు. ఖర్చుకు వెనుకాడకుండా అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. శ్రీ బాలాజీ సినీ మీడియా నిర్మాణ విలువలు బాగున్నాయి.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
1. కథ, మాటలు
2. గోపిచంద్ యాక్టింగ
3. క్యాథరిన్ గ్లామర్
4. సౌందర్ రాజన్ ఫొటోగ్రఫి


మైనస్ పాయింట్స్
1. సినిమా నిడివి
2. మ్యూజిక్
3. స్క్రీన్‌ప్లే


తెర ముందు.. తెర వెనుక

తెర ముందు.. తెర వెనుక

నటీనటులు: గోపిచంద్, క్యాథరినా త్రెసా, హన్సిక మోత్వాని, తనికెళ్ల భరణి, బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్, చంద్రమోహన్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాతలు: జే భగవాన్, జే పుల్లారావు
సౌందర్ రాజన్
ఎడిటింగ్: గౌతంరాజు
సంగీతం: ఎస్ఎస్ థమన్
బ్యానర్: శ్రీ బాలాజీ సినీ మీడియా
రిలీజ్: 28 జూలై 2017


English summary
Director Sampath Nanda, Hero Gopichand's latest movie is Gautam Nanda. Catherine tresa, Hansikaare in lead roles. This movie released on 28th July. This movie picturised on back drop of Money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu