twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ గెలిచిన 'గజనీ'(రివ్యూ)

    By Staff
    |
    Ghajini
    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    సినిమా: గజనీ
    బ్యానర్: గీతా ఆర్ట్స్
    నటీనటులు: అమీర్ ఖాన్, అసిన్, జియాఖాన్,
    ప్రదీప్ రావత్ తదితరులు.
    సంగీతం: ఎ.ఆర్.రహమాన్
    కెమెరా: రవి.కె.చంద్రన్
    కథ..స్క్రీన్ ప్లే..దర్శకత్వం: ఎ.ఆర్ .మురుగదాస్
    నిర్మాతలు: ఠాగూర్ మధు, మధు వంతెన
    రీలీజ్ డేట్: ఇవరై ఐదు డిసెంబర్ 2008

    ఇప్పటికే సూర్య హీరోగా చేసిన 'గజనీ' చూసేసాం..మళ్ళీ హిందీ వెర్షన్ చూడాల్సిన అవసరం ఉందా..అంటే ఉందనే రేంజిలో ఈ చిత్రం సమాధానమిస్తుంది. సౌత్ లో ఘన విజయం సాధించిన గజనీ ఇప్పుడు నార్త్ ధియోటర్స్ లోనూ దాడి చేసి కలెక్షన్స్ దోస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్ర వీక్ గా ఉందన్నా..హృదయం ఎక్కడున్నది వంటి హిట్ సాంగ్ మిస్సయిందన్నా అవన్నీ మరిపిస్తూ మరింత బిగువైన స్క్రీన్ ప్లేను జతచేసుకుని ముందుకు దూసుకుపోతున్నాడు.

    తెల్సిన కథే మళ్ళీ...
    ఎయిట్ పాక్స్ గల సంజయ్ సింగానియా(అమీర్ ఖాన్) సెల్ ఫోన్స్ రంగంలో పేరున్న పెద్ద పారిశ్రామిక వేత్త.అయితే దురదృష్ణం ఏమిటంటే.. అతను షార్ట్ టైమ్ మెమరీ లాస్ కంప్లైంట్ తో భాధ పడుతూంటాడు. అంతేగాక అతని ప్రేయసి కల్పన(అశిన్) దారుణ మరణానికి కారణ మైన గజనీ(ప్రదీప్ రావత్) అనే విలన్ ని పట్టుకోవాలని పట్టుదలతో తిరుగుతూంటాడు.దాంతో వ్యాపారాలన్నీ పట్టించుకోకుండా ఎప్పుడూ తన ప్రేయసి ప్లాట్ లోనే ఉంటూ..మర్డర్ ప్లాన్స్ వేసుకుంటూ..అమలు పరుచుకుంటూ గడిపేస్తూంటాడు. అయితే అతనికి తనకు షార్ట్ టైమ్ మెమరీ లాస్ ఉందని తెలియటంతో (మరీ ప్రతీ పది హోను నిముషాలకూ ఒకసారి జ్ఞాపక శక్తి రీప్రెష్ అయిపోతూంటుంది) దానిని నమ్ముకోకుండా ఓ చక్కని ఆలోచన చేస్తాడు. తన శరీరంపై తనకు కావల్సిన ఫోన్ నెంబర్స్ ,గుర్తులూ టట్టూల రూపంలో రాసుకుని,ఓ పోలరాయిడ్ కెమెరాతో ఫొటోలు తీసుకుంటూ వాటినాధారంగా విలన్ ని వెతుకుతూంటాడు. మరో ప్రక్క ఇతనిపై అనుమాన పడిన ఓ పోలీస్ ఆఫీసర్ ఇతన్ని దగ్గరగా వెంటాడుతూంటాడు. అలాగే ఈ ప్రయాణంలో అతనికి సునీత(జియాఖాన్) అనే మెడికల్ స్టూడెంట్ పరిచయమవుతుంది. అయితే ఆమె కూడా సంజయ్ ని అనుమానించి విలన్ గజనీకి అతని ఎడ్రస్ చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఈ క్లిష్ట స్ధితిలో సంజయ్ తన పగ ఎలా తీర్చుకున్నాడు. అసలు గజనీ ...కల్పనని చంపాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది వంటివన్ని తెరపై చూడాల్సిన విషయాలే.

    ఇక ఈ గజనీ సినిమా హాలీవుడ్ సినిమా మెమొంటో నుండి పుట్టిందని తమిళ వెర్షన్ వచ్చిన దగ్గరనుండి అంతా గగ్గోలు పెడుతున్నారు(అసలు నాకూ మెమొంటో అనే విచిత్రమైన స్క్రీన్ ప్లే నేరేషన్ గల సినిమా ఒకటుందని ఈ ప్రచారంలోనే తెలిసింది). అయితే ఇక్కడ రెండింటికీ పోలక తేవటం అనవసరం. కాన్సెప్ట్ దాకా మురగదాస్ తీసుకున్నాడు కానీ కథనీ,కధనాన్ని ఎత్తేయలేదు. ఇక ఈ సినిమా ఇంత హిట్టుకి బిగి సడలని స్క్రీన్ ప్లేనే కారణమని చెప్పుకోవాలి. అయితే తమిళ వెర్షన్ లో ఉన్న కథనాన్ని కొద్దిగా ఈ సినిమాలో మార్చారు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ప్రదీప్ రావత్ డబుల్ సీన్స్ తొలిగించారు. అక్కడ తిరిగి షార్ట్ టైమ్ మెమరీ మీదే ప్లే చేసాడు.అద్బుతం అనిపించుకున్నాడు. నిజానికి తారె జమీన్ పర్ తర్వాత అమీర్ ఖాన్ ఇలాంటి సినిమాలో ఇలాంటి పాత్ర ద్వారా మళ్ళీ పలకరిస్తాడని ఎవరూ ఊహించరు. అక్కడే వారి ఊహలకు భిన్నంగా వెళ్ళి అందరికీ షాక్ ఇచ్చి అతను సగం మార్కులు వేయించుకున్నాడు. ఇక అందరూ సిక్స్ పాక్ అంటూ శ్రమ పడుతూంటే ..అతను ఏకంగా ఎయిట్ పాక్ అంటూ మరో ట్విస్టు ఇచ్చాడు.ఇక సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ ...అసిన్ తో క్యూట్ లవ్ స్టోరీ. మళ్ళీ చూసినా చూడాలనిపించింది. అదీ మనకు నాగార్జున మురళికృష్ణుడు సినిమాలో కనిపించే ట్రాకే అనుకోండి. అలాగే అన్నిటికన్నా గొప్పగా చెప్పుకోవాల్సింది రవిచంద్రన్ కెమెరా పనితనం.

    అసిన్ ని చంపే సీన్స్ లో ఆ భయాన్ని ఎస్టాభ్లిష్ చేసేందుకు ఎన్నుకున్న కలర్ స్కీమ్ అధ్బుతమనిపిస్తాడు. అన్నిటికన్నా చివరలో చెప్పుకున్నా మొదట వరసలో ఉండేది ...అందరికీ తెలిసిందీ ఎ.ఆర్.రహమాన్ పాటల గొప్పతనం. ధియోటర్ బయిటకు వచ్చినా కైసీ ముజీ పాట అప్రయత్నంగా మన పెదాలు పాడేస్తూంటాయి. నటుల్లో అమీర్ ఖాన్,అసీన్ పోటీపడి నటించారు. ప్రదీప్ రావత్ అచ్చ మన తెలుగు విలన్ లాగానే బిహేవ్ చేస్తూ భయపెట్టాడు. జియాఖాన్ ఒక్కత్తే తేలిపోయింది. అయితే విలన్ ప్రదీప్ రావత్ ప్రక్కన ఉండే గూండాలు మరీ ఎనభైల కాలంనాటివారిలా అనిపించటం ఓ మైనస్. అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్ర కావాలనే సగంలో చంపేయటం స్క్రిప్టులో కనపడని లోపంలా కనిపిస్తుంది. అయితే సూర్య గజనీ చూసిన వారికి ఇది అంత తృప్తి అనిపించకపోయే అవకాశం ఉందా అంటే దాదాపు లేదనే చెప్పాలి. వరస కామిడీలు,రొమాంటిక్ ఫిల్మ్స్ తో నడుస్తున్న బాలీవుడ్ మళ్ళీ ఈ సినిమాతో యాక్షన్ సినిమాల నిర్మాణానికి పూనుకుంటుందేమో చూడాలి.పాపం ఖాలీగా ఉన్న సన్నీడయోల్,బాబిడయోల్ వంటి వారికి పని కలుగుతుంది.

    ఇక కథ తెల్సిన ఈ సినిమాను మళ్ళీ చూసినా నష్టం లేదనపిస్తుంది.అలాగే ఇన్నాళ్లూ ప్రియదర్శన్ పుణ్యాన సౌత్ కామిడీలే హిందీ తెరకెక్కాయి. ఇక మురుగదాస్ ఎంట్రీతో యాక్షన్ సినిమాలూ అక్కడ వర్కవుట్ అవుతాయోమని ఆశలు కల్పిస్తుందీ చిత్రం. అయితే ఈ షార్ట్ టైమ్ మెమరీ సినిమా మరీ లాంగ్ టైమ్ (మూడు గంటలు పైగానే) ఉండటమే బ్యాడ్ అనిపిస్తుంది. అదే తొలిసారి చూసేవారికైతే పూర్తి స్ధాయి సంతృప్తి ఇస్తుంది. అయితే సినిమా చూసేటప్పుడు షార్ట్ టైమ్ మెమరీ లాస్ అనే జబ్బు ఉంటుందా..హీరో అంత కోటీశ్వరుడు కదా..డబ్బు పడేసి ప్రొపిషనల్ కిల్లర్స్ తో చంపించవచ్చు కదా..అయినా అంత తెలివైన హీరోయిన్..పోష్ లుక్ తో ఉండే అమీర్ ఖాన్ నేఫద్యాన్ని గుర్తు పట్టదా...ఎంత ప్రేమ అయితే మాత్రం లవర్ చెడ్డీ యాడ్లో నటించమంటే ..తానెవరో..తన రేంజి ఏంటో ప్రపంచానికి తెల్సిపోతుందని భయపడకుండా ఎలా ఒప్పుకుంటాడు...వంటి అధ్బుతమైన డౌట్స్ రానివారే ఈ సినిమాకు వెళ్ళటం మేలు. వారికి తప్పని సరిగా నచ్చుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X