twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఘర్షణ

    By Staff
    |

    Gharshana
    -జలపతి గూడెల్లి
    చిత్రం: ఘర్షణ
    నటీనటులు: వెంకటేష్‌, అసిన్‌, సలీమ్‌ అగా, తదితరులు
    సంగీతం: హారిష్‌ జైరాజ్‌
    నిర్మాత: జి.శివరాజు, వెంకటరాజు, కలైపులి. ఎస్‌.థాను
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌

    తమిళంలో సంచలనం సృష్టించిన హిట్‌ చిత్రం 'కాక..కాక' గురించి చాలా ప్రచారం జరిగింది. తెలుగులో ఈ చిత్రం రీమేక్‌, 'ఘర్షణ' విడుదలకు ముందు కూడా చాలా ఆర్భాటం జరిగింది. కానీ, ఈ హంగామా అంతా అనవసరం అని సినిమా చూశాక అర్థమైంది. చాలా స్టైల్‌గా తీసిన, సాధారణ సినిమా ఇది. గొప్పగా చెప్పుకునే అంశం ఏదీ లేదు.

    కెమెరా గిమ్మిక్కులు (స్టైల్‌గా కన్పించి యాంగిల్స్‌, ఫాస్ట్‌ మూవ్‌మెంట్స్‌ వంటివి), స్టైల్‌ ఎడిటింగ్‌ వంటి పై పై మెరుగులు మినహాయిస్తే, సినిమాలో అసలు విషయం లోపిించింది. పోలీసులకు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్‌లు మనకు(తెలుగువారికి) బాగా తెలిసిన విషయం. కానీ, గ్యాంగ్‌స్టర్స్‌ను 'ఎన్‌కౌంటర్‌' చేయడం అనేది స్థానిక కథ కాదు. తమిళం ఒరిజినల్‌ సంగతి తెలియదు కానీ, ఈ థీమ్‌ను, దర్శకుడు గౌతమ్‌ 'ఘర్షణ'లో ్యండిల్‌ చేసిన తీరు మరీ బోర్‌ కొట్టేలా ఉంది. ప్రథమార్థం ఫర్వాలేదనిపించినా, ద్వితీయార్థం మరీ సాగతీత. క్లైమాక్స్‌లో ప్రేక్షకులు అందరూ ముందే లేచిపోయేలా చాలా స్టుపిడ్‌గా తీశాడు.

    వెంకటేష్‌ నటన మరీ నాసిరకంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన బాడీ పెంచుకోవడం వంటి ప్రయత్నాలు చేసినా, ఆయన నటన మాత్రం వాస్తవానికి దూరంగా ఉన్నట్లు కన్పిస్తుంది. మనుషులు చనిపోయినప్పుడు ఎవరైనా కంటి తడిపెట్టడమో, బాధగా కళ్ళు మూసుకోవడమో చేస్తారు. కానీ వెంకటేష్‌.. ఇందులో.. 'షిట్‌..మ్యాన్‌...' అంటూ అందరిపై అరుస్తూ..దూరం జరుగు అనే సైగ చేస్తూ, అతిగా ఓవరాక్టింగ్‌ చేశాడు. సినిమాలో ఇదో ప్రధాన లోపం. అదీ కాకుండా, ఆయన వయసు మీద పడుతోన్న తీరు కనపడుతూనే ఉంది. హారిష్‌ జైరాజ్‌ అందించిన చాలా చక్కటి సంగీతం వృధా అయింది.

    సినిమా ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. నాగార్జునసాగర్‌కు సమీపంలోని నది ఒడ్డున రామచంద్ర (వెంకటేష్‌) గాయాలతో పడి స్పృహతప్పిపడి ఉన్న దృశ్యాలతో మొదలవుతుంది. హీరోనే కథ చెపుతుంటాడు. నగరంలో గుండాలను ఎన్‌కౌంటర్‌ చేసే ఓ పోలీసు బృందానికి డిసిపి రామచంద్ర సారథ్యం. చాలా మందిని మట్టుపెడుతాడు. ఓ సందర్భంలో పరిచయమమైన ఓ యువతి మాయ(అసిన్‌) ఆయన మనసులో కలవరం రేపుతుంది. ఆమెను ప్రేమిస్తాడు.

    కానీ, పెళ్ళి చేసుకుంటే వృత్తిరీత్యా ప్రమాదం అని సంశయిస్తుంటాడు. చివరికి, ప్రేమే జయిస్తుంది. మాయను పెళ్ళి చేసుకునేందుకు సిద్దపడుతాడు. అదే సమయంలో ఓ స్థానిక గుండాని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ గుండా తమ్ముడు 'పాండా' (సలీమ్‌) హీరోని కొట్టి, హీరో బృందంలోని పోలీసులనూ బయపెట్టి, మాయను కిడ్నాప్‌ చేస్తాడు. మాయని తీసుకురావడం, పాండాని చంపడమే సెకాంఢాఫ్‌ అంతా సాగుతుంది.

    ఆసిన్‌, వెంకటేష్‌ల మధ్య ప్రేమ సన్నివేశాలు, ప్రథమార్థంలో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు బాగున్నాయి. అయితే, తర్వాతే సినిమా గతి తప్పింది. కులశేఖర్‌ రాసిన సంభాషణాలు యాడ్‌ ఏజెన్సీల ట్రాన్స్‌లేషన్‌ కాపీలాగా పేలవంగా ఉన్నాయి. బూత్‌లను సెన్సార్‌ చేశారు.

    అసిన్‌ క్యూట్‌గా ఉంది. విలన్‌గా నటించిన సలీమ్‌ పాత్రే అధికం సినిమాలో. అతని నటన ఓకే. సంగీతం (హారీష్‌), కెమెరావర్క్‌ చాలా బాగున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X