For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇవివి'ఎవడి గోలవాడిదే' సమీక్ష

  By Staff
  |

  Evadigola Vaadidee
  సినిమా: ఎవడి గోలవాడిదే

  నటీనటులు: ఆర్యన్‌ రాజేష్‌, దీపిక, బ్రహ్మానందం, కోవై సరళ,

  ఎల్బీ శ్రీరాం, జయప్రకాష్‌రెడ్డి, కొండవలస లక్ష్మణరావు, తెలంగాణ శకుంతల,

  మల్లిఖార్జునరావు, చలపతిరావు, బాబూ మోహన్‌, చలపతిరావు, అలీ,

  ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణ భగవాన్‌, జ్యోతి తదితరులు

  సంగీతం: కమలాకర్‌

  కథ: లార్‌స్కో యూనిట్‌

  మాటలు: జనార్ధన్‌ మహర్షి

  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారాయణ

  నిర్మాత: లగడపాటి శిరీషా శ్రీధర్‌

  విడుదల తేదీ: జనవరి 21, 2005

  కామెడీ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. 'లాజిక్‌' పక్కన పెట్టి కథ సరైన ట్రాక్‌లో నడిపితే హిట్‌ కొట్టొచ్చు. కానీ కామెడీకి పక్కలో బల్లెంలా ద్వందార్ధాలు, పాత జోకులతో నడిపే కథనం, ప్రాస డైలాగులు దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ టైపు సినిమాల్లో చెప్పుకోదగిన కథ ఉండదు. ఎనిమిది జంటలున్న 'ఎవరిగోల వారిదే' సినిమాలో ఏ జంట ట్రాక్‌ ఆ జంటదే. కథంటూ ప్రత్యేకంగా లేని ఈ సినిమాలో ఆర్యన్‌ రాజేష్‌ పెళ్ళి చూపులకు వెళ్ళి, పెళ్ళి కూతురు పక్కనున్న హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. పెళ్ళికూతురు తండ్రి (కొండవలస) ఒక ఫ్యాక్షనిస్టు. ఫ్యాక్షనిస్టు కూతుర్ని చేసుకుంటే, ప్రత్యర్ధుల దాడిలో ఆ ఫ్యాక్షనిస్టు మరణిస్తే ఆస్ధి మొత్తం తన కొడుకుకు వస్తుందని హీరో తండ్రి ఎవిఎస్‌ ఆశ. ఫ్యాక్షనిస్టు కూతుర్ని కాకుండా హీరోయిన్‌ (దీపిక)నే చేసుకుంటానని, ఆమెను వెదుక్కుంటూ బ్యాంకాక్‌ వెళ్తాడు. బాబూమోహన్‌ హోటల్‌లో దిగుతాడు. అదే హోటల్‌లో కృష్ణ భగవాన్‌ ఒక అమ్మాయిని బుక్‌ చేసుకుని దిగుతాడు. ఆ అమ్మాయే మన హీరోయిన్‌ (మీకు కళ్ళు తిరగవచ్చు). కృష్ణభగవాన్‌, ఆర్యన్‌ రాజేష్‌ ఇద్దరి పేర్లూ శంకర్‌ కావడంతో హీరోయిన్‌ హీరో రూముకు వస్తుంది.

  హీరోయిన్‌ దీపిక స్వయంగా మంచిదని, ఆమె తల్లికి వైద్యం చేయించడం కోసం వ్యభిచారానికి సిద్ధపడిందని తెలుసుకుంటాడు. ఆమె తల్లికి వైద్యం చేయిస్తాడు. ఈ విషయం తెలుసుకుని ఫ్యాక్షన్‌ నాయకుడు కొండవలస బ్యాంకాక్‌ వస్తాడు.

  హీరోహీరోయిన్లకు మిగతా పాత్రల ట్రాక్‌తో సంబంధం లేకుండా ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంతో ఈ సినిమాలో ఎవరి కథ వారిదే అయింది. కథ ఎవరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా కథ నడుస్తుందో తెలియదు. ప్రేక్షకుడు ఎవరిని ఫాలో అవ్వాలో తెలియదు. ఇది స్క్రీన్‌ ప్లేలోని పెద్ద లోపం. ఇటువంటి 'మాస్‌ హ్యూమర్‌' చిత్రాలు ఇవివి స్కూలు నుంచి చాలా రావడంతో ప్రేక్షకుడు కొత్త దనం ఫీలవడు. ఫ్యాక్షన్‌ సెటైర్‌తో నడిచే స్కేరీ మూవీ ఇది.

  రెండు పాటలు బాగున్నాయి. అనుభవమున్న దర్శకుడు కావడంతో అన్ని పాత్రలు ఉన్నా ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్‌ కారు. ఇదే కథతో మరో దర్శకుడు ఈ సినిమా తీసి ఉంటే ఒకరోజుకే డబ్బాలు వెనక్కి వెళ్ళి ఉండేవి. జనార్ధన మహర్షి మాటలు కొన్ని చోట్ల పేలాయి. బ్రహ్మానందం 'డ్రాయర్‌ డైలాగ్‌' బాగా ఉండడంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేస్తారు. అలీ సినిమా కథ చెప్పే ఎపిసోడ్‌ ఫర్వాలేదు. శకుంతల, కృష్ణ భగవాన్‌ ఎపిసోడ్‌, జయప్రకాష్‌ రెడ్డి హోంమోసెక్స్‌ ఉదంతం వికారం పుట్టిస్తాయి. పన్నెండు నిముషాల క్లెయిమాక్స్‌ పాట ఇవివి పాత ప్రయోగమే.

  దట్స్‌తెలుగు రిమార్క్స్‌: ఈ సినిమాను టీవీలో వచ్చినప్పుడు ఉచితంగా, తాపీగా చూడవచ్చు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X