»   » గూఢచారి మూవీ రివ్యూ: టాలీవుడ్ బాండ్ చిత్రం

గూఢచారి మూవీ రివ్యూ: టాలీవుడ్ బాండ్ చిత్రం

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Goodachari Movie Review గూఢచారి మూవీ రివ్యూ

  Rating:
  2.5/5
  Star Cast: అడివి శేషు, శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, మధుశాలిని, రవి ప్రకాశ్, జగపతి బాబు
  Director: శశి కిరణ్ తిక్క

  విభిన్నమైన చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటంతో టాలీవుడ్‌లో కొత్త ఆలోచనలతో సినిమాల నిర్మాణం జోరందుకున్నది. ఆ క్రమంలో వచ్చిన చిత్రమే గూఢచారి. అడివి శేషు, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రలో కనిపించారు. దేశభక్తి ప్రధానంగా సాగిన ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ కొత్తరకం చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  గూఢచారి స్టోరి

  అర్జున్ అలియాస్ గోపి (అడివి శేషు) దేశ భద్రతకు పాటుపడే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో చేరాలని కలలు కంటాడు. దేశం కోసం పనిచేస్తూ చనిపోయిన తన తండ్రి ఆశయాలను కొనసాగించాలనుకొంటాడు. తన గాడ్ ఫాదర్ సత్య (ప్రకాష్ రాజ్) సంరక్షణలో పెరుగుతున్న అర్జున్ దేశ భద్రతకు సంబంధించిన త్రినేత్ర అనే మిషన్‌లో చేరుతారు. అక్కడ పనిచేసే బృందం (అనీష్ కురివిల్లా, యార్లగడ్డ సుప్రియ (నదియా), వెన్నెల కిషోర్, మధుశాలిని (లీనారాజన్))తో కలిసి పనిచేస్తాడు. ఆ సమయంలోనే సైక్రియాటిస్ట్ (శోభిత ధూళిపాల)తో ప్రేమలో పడుతాడు. కానీ తన ప్రేయసి చేసిన కారణంగా తన అధికారి (అనీష్), మరో మంత్రిని తీవ్రవాదుల కాల్పుల్లో పోగొట్టుకొంటాడు. ఈ క్రమంలో అర్జున్‌పై దేశద్రోహ నేరం మోపబడుతుంది. తన టీమ్‌లోనే ఒకరు తీవ్రవాదులకు సమాచారం అందిస్తున్నారని తెలుసుకొంటాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి రానా (జగపతిబాబు) చనిపోలేదని తెలుసుకొంటాడు.

  గూఢచారి కథలో ట్విస్టులు

  దేశద్రోహం కేసులో ఇరుక్కొన్న అర్జున్ ఎలా బయటపడ్డాడు? చనిపోయాడనుకొన్న తన తండ్రి ఎలా బతికాడు? తన తండ్రిని కలుసుకొన్న తర్వాత ఎదురైన సంఘటనలు ఏంటీ? త్రినేత్రలో పనిచేస్తూ ఉగ్రవాదులకు సమాచారం అందించేది ఎవరు? అర్జున్ మిషన్‌లో ప్రకాశ్ రాజ్ పాత్ర ఏంటి? యార్లగడ్డ సుప్రియ, మధు శాలిని పాత్రలేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే గూఢచారి సినిమా కథ.

  ఫస్టాఫ్‌లో

  అడివి శేషు (అర్జున్) రా విభాగంలో చేరాలన్న ప్రయత్నాలతో సినిమా ఆరంభమవుతుంది. త్రినేత్ర మిషన్‌లో చేరిన తర్వాత శిక్షణ జరిగే తీరుతో కథ ముందుకెళ్తుంది. త్రినేత్రలో చేరిన తర్వాత ఉగ్రవాదులు పన్నిన ఉచ్చులో అడివి శేషు ఇరుక్కుపోవడం.. ఆ కుట్రలో తన అధికారి అనీష్ బలవ్వడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. త్రినేత్రపై ఉగ్రవాదుల దాడి చేయడానికి కారణమనే అపవాదును అడివి శేషు ఎదుర్కోవడం, పోలీసుల వేట నుంచి తప్పించుకోవడం లాంటి అంశాలతో చకచకా ఇంటర్వెల్ వరకు సాగుతుంది. తొలి భాగంలో మేకింగ్ ఆసక్తికరంగా ఉండటం ప్లస్ పాయింట్ అయితే.. ఎమోషన్ సీన్లు సరిగా పండకపోవడం కొంత నిరాశజనకంగా మారుతుంది.

  సెకండాఫ్ రివ్యూ

  ఇక రెండో భాగంలో తనను కుట్రలో ఇరికించిందెవరూ? వారు ఎందుకు తనను టార్గెట్ చేశారు? అనే తెలుసుకోవడం, ఉగ్రవాదులను పట్టుకోవడానికి బంగ్లాదేశ్ వెళలడం లాంటి అంశాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో తన తండ్రి మరణించలేదు.. తన తండ్రే ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడనే విషయం కథను మలుపు తిప్పుతుంది. తన గాడ్ ఫాదర్ ప్రకాశ్ రాజ్‌ కోసం తన తండ్రిని ఎందుకు చంపాల్సి రావడం కొంత ఎమోషనల్‌గా మారుతుంది. దేశానికి ద్రోహం తలపెట్టే ఉగ్రవాదులను మట్టుపెట్టడం, త్రినేత్ర మిషన్‌లో పనిచేస్తున్న వ్యక్తి ఎవరనేది తెలుసుకొని అతడిని అంతం చేయడంతో కథ ముగింపు పలుకుతుంది. దేశభక్తి అంశం కథలో అంతర్లీనంగా ఉన్నప్పటికీ.. సరిగా ఎలివేట్ కాకపోవడం మైనస్ అని చెప్పవచ్చు.

  దర్శకుడు శశికిరణ్ గురించి

  దర్శకుడు శశి కిరణ్ తిక్క విజన్, టేకింగ్ చాలా రిచ్‌గా ఉన్నాయి. పాత్రల చిత్రీకరణ, క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కాకపోతే దేశభక్తి ప్రధానంగా సాగే కథలో ప్రేక్షకుడిని లీనం చేయకపోవడంలో స్క్రిప్టుపరంగా కొంత తడబాటు కనిపిస్తుంది. కాకపోతే పీఎస్వీ గరుడ ఫ్లేవర్‌లో కనిపించే ఈ సినిమా తెలుగు తెరపై కొత్త రకం ప్రయోగమే. తన పరిధి మేరకు శశి కిరణ్ సఫలమయ్యాడనే చెప్పవచ్చు.

  అడివి శేషు పెర్ఫార్మెన్స్

  అడివి శేషుకి హీరోగా మోస్తారు సక్సెస్ కూడా లేదు. ప్రతిభ ఉన్న చిన్న, చితక రోల్స్‌తో నెట్టుకొచ్చాడు. కానీ తన బాడీ లాంగ్వేజ్, టాలెంట్ తగినట్టు తాను రాసుకొన్న కథకు ప్లసయిందనే చెప్పవచ్చు. పాత్ర కోసం పడిన తపన స్క్రీన్‌పై కనిపిస్తుంది. చాక్లెట్ బాయ్‌లా కనిపించే అడివి శేషుకు గూఢచారితో ఇమేజ్ మారుతుంది.

  ప్రకాశ్ రాజ్, జగపతిబాబు రోల్స్

  గూఢచారి చిత్రంలో ప్రకాశ్ రాజ్ పాత్ర కీలకమైనప్పటికీ.. ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే జగపతి బాబు పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలిభాగంలో అనీష్ కురివిల్లా పాత్ర కొంత ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉంటుంది.

  శోభిత ధూళిపాల గ్లామర్

  ఇక సమీరా పాత్రలో శోభిత ధూళిపాల హీరోయిన్‌గా కనిపించారు. కానీ ఆమె పాత్ర కేవలం అతిథి పాత్రకే పరిమితమైంది. పాత్ర పరిధి మేరకు అందాలను ఆరబోసి గ్లామర్‌తో సిల్వర్ స్క్రీన్‌తో నింపేసింది. పాత్ర పరిధి చిన్నగా ఉండటంతో శోభిత ఆకట్టుకోలేకపోయింది.

  మ్యూజిక్ గురించి

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే శ్రీ చరణ్ పాకాల సంగీత ఆకట్టుకొన్నది. ప్రధానంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పాటలే క్యాచీగా ఉండకపోవడం మైనస్.

  సినిమాటోగ్రఫీ

  గూఢచారి సినిమాకు సినిమాటోగ్రఫి స్పెషల్ అట్రాక్షన్. షానీల్ డియో కెమెరా వర్క్ బాగుంది. యాక్షన్ల సీన్లు హాలీవుడ్ స్ఠాయిలో ఉన్నాయి. క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు సూపర్ అనిపించాయి.

  ఎడిటింగ్, ఇతర విభాగాలు

  గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. తెరపై సీన్లు చకచకా పరుగులు పెట్టాయి. సినిమా మూడ్‌కు తగినట్టుగా రేఖా బొగ్గారపు అందించిన క్యాస్టూమ్ యాప్ట్‌గా కనిపించాయి.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  గూఢచారి సినిమాను అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభట్ల, అభిషేక్ నామా, విశ్వప్రసాద్, కృష్ణ సిద్దిపల్లి సంయుక్తంగా అభిషేక్ నామా బ్యానర్‌పై రూపొందించారు. మోస్టారు బడ్జెట్‌లో సినిమాను హైక్లాస్‌గా రూపొందించారు. ఖర్చుపెట్టిన ప్రతీ పైసా తెరపైన కనిపించింది.

  ఫైనల్‌గా

  గూఢచారి సినిమా తెలుగు తెరపై కొత్త జోనర్ అని చెప్పవచ్చు. విభిన్నమైన చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. దేశభక్తి, యాక్షన్ కలిపి చేసిన చిత్రమిది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే కమర్షియల్‌గా సినిమా నిలబడుతుంది.

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్

  • కథ, కథనాలు
  • అడివి శేషు యాక్టింగ్
  • సినిమాటోగ్రఫీ
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

  మైనస్ పాయింట్స్

  • ఎమోషన్స్ పండకపోవడం
  • కామెడీ లేకపోవడం
  • స్టోరి ఫ్లాట్‌గా ఉండటం

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: అడివి శేషు, శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, మధుశాలిని, రవి ప్రకాశ్, జగపతి బాబు, యార్లగడ్డ సుప్రియ తదితరులు
  దర్శకత్వం: శశి కిరణ్ తిక్క
  నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభట్ల, అభిషేక్ నామా, విశ్వప్రసాద్, కృష్ణ సిద్దిపల్లి
  సంగీతం: శ్రీచరణ్ పాకాల
  సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
  ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
  బ్యానర్: అభిషేక్ నామా బ్యానర్
  రిలీజ్ డేట్: 2018-08-03

  English summary
  Goodachari is a spy thriller film directed by Sashi Kiran Tikka and produced by Abhishek Pictures. The film stars Adivi Sesh and Sobhita Dhulipala in the lead roles,with a supporting cast including Prakash Raj, Madhu Shalini and Ravi Prakash. The film features music composed by Sricharan Pakala, Cinematography by Shaneil Deo and editing by Garry Bh. It is released on 3 August 2018. In this occassion, Filmibeat Telugu brings exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more