twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ బ్రాండ్‌ ' గుడుంబా '

    By Staff
    |

    Gudumaba Shankar
    -వి.బి చౌదరి
    చిత్రం: గుడుంబా శంకర్‌
    నటీనటులు: పవన్‌ కళ్యాణ్‌, మీరా జాస్మిన్‌,
    ఆశిశ్‌ విద్యార్ధి, సాయాజీ షిండే, కోట, బ్రహ్మానందం,
    అలీ,కవిత, వేణుమాధవ్‌ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    దర్శకత్వం: వీరశంకర్‌
    నిర్మాత: నాగబాబు

    'ఒక్కడు'తో ప్రారంభమైన 'ఆపదలో అమ్మాయి' ట్రెండ్‌కు కామెడీ కలిపి ఎంటర్‌టెయినింగ్‌గా తయారుచేసిన చిత్రం 'గుడుంబా శంకర్‌'. జానీతో నిరాశ పడిన పవన్‌కళ్యాణ్‌ అభిమానులకు పూర్తి స్ధాయి వినోదాన్ని అందించే ప్రయత్నం చాలా వరకు సఫలం అయిందనే చెప్పాలి. అయితే సినిమా ప్రక్రియకు వెన్నెముక లాంటి 'అన్‌ప్రెడిక్టబిలిటీ' లోపించడంతో చివర్లో ఏం జరబోతోందో ఇంటర్వల్‌లోనే ప్రేక్షకుడికి అవగతమై పోయింది. అయితే ఈ దశలో ప్రవేశించిన కామెడీ పాత్రలూ సంఘటనలూ సినిమాను బోర్‌కొట్టించకుండా ముందుకు నడిపాయి.

    గుడుంబా శంకర్‌ అనబడే శంకర్‌ దీక్షితులు పోలీసులకు సాయపడుతూ అవినీతిపరుల ఆటకట్టించే ప్రాసెస్‌లో బెజవాడ నారాయణ (సాయాజీ షిండే) మనిషిని కోమాలోకి పంపుతాడు. దేవుడు (కోట) అనే పోలీసు సలహాతో ఆవూరి నుంచి పారిపోతాడు గుడుంబా. ఆ పారిపోయే ప్రయత్నంలో గౌరి అనే అమ్మాయిని రక్షించడం, ప్రేమించడం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఇష్టం లేని పెళ్ళి తప్పించుకోడానికి పారిపోతోందని తెలుసుకోవడం- ఫస్టాఫ్‌లో కథ.

    ఓ దొంగ జ్యోతిష్కుడు (బ్రహ్మానందం) మాటలు నమ్మి గౌరిని పెళ్ళాడితే కలిసొస్తుందని నమ్మిన కుమారస్వామి (ఆశిశ్‌ విద్యార్ధి) గౌరిని ఎత్తుకెళుతుంటే 'నేను కాపాడుతాగా' అని హీరో అభయం ఇవ్వడంతో జరబోయే కథేమిటో మనకు ముందే తెలిసిపోతుంది.

    ఇక సెకండాఫ్‌లో ఫాల్స్‌ పంతుల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారా కళ్యాణ్‌జీ ఆనంద్‌ జీ అనే 'వెడ్డింగ్‌ ప్లానర్‌'గా కుమారస్వామి ఇంట్లో ప్రవేశిస్తాడు గుడుంబా శంకర్‌. కుమారస్వామికి సాయం చేస్తున్నట్టు నటిస్తూనే రకరకాల ఎపిసోడ్లతో ఆ పెళ్ళి చెడగొట్టడం వంటి సన్నివేశాలు తెరమీద చూస్తేనే బాగుంటాయి.

    ఇంత నేలబారు కథ ఎంటర్‌టైనింగ్‌గా తయారవడానికి పవన్‌కళ్యాణ్‌ నటన బాగా ఉపయోగపడింది. ఎన్టీఆర్‌, మోహన్‌బాబుల డైలాగ్‌ డెలివరీని ఇమిటేట్‌ చేయడం, 'మీ మొలతాళ్ళు తెగ' అని శాపనార్ధాలు పెట్టడం వంటి అనేక సన్నివేశాల్లో పవన్‌ రెచ్చిపోయి నటించాడు. తన బ్రాండు నటనతో వినోదాన్ని పుష్కలంగా పంచాడు. ఫాల్స్‌ పంతులుగా బ్రహ్మానందం కత్రినా గా అలీ, హీరో చేతిలో పదేపదే ఫూల్‌ అయ్యే విలన్‌గా ఆశిశ్‌ విద్యార్ధి యధాశక్తి వినోదాన్ని పంచారు. టిపికల్‌ తెలుగు హీరోయిన్‌ పాత్రలో మీరా జాస్మిన్‌ ముద్దుగా కొన్ని చోట్ల 'బొద్దు'గా నటించింది. ఇంకా సునీల్‌, వేణుమాదవ్‌, రాజన్‌ పి దేవ్‌ సహా బోలెడు మంది నటులు ఈ ఫార్సికల్‌ కామెడీని పండించడానికి ఉపయోగపడ్డారు.

    దాదాపు అన్ని పాటలూ ఆకట్టుకొనేలా ఉన్నాయి. టెక్నికల్‌గా అన్ని అంశాలూ బాగున్నా బలహీనమైన కథ ఈ సినిమాకు మైనస్‌ పాయింట్‌. ఆ బలహీనతను కామెడీతో కప్పిపెట్టి పవన్‌ మార్కు కిక్కెక్కించే 'గుడుంబా' తయారు చేశారు. మొత్తంగా ఇదొక యావరేజి హిట్‌ చిత్రం. గొప్పగా ఉందని చెప్పలేం.

    ఈ సినిమా ఫార్ములా ఒక్కడు: పాతిక శాతం దిల్‌వాలే దుల్హనియా... :పాతిక శాతం పవన్‌ కళ్యాణ్‌ టచ్‌: యాభై శాతం

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X