twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండె 'భళ్ళు'మంది(రివ్యూ)

    By Staff
    |

    Gunde Jhallumandi
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్ :యునైటెడ్ మూవిస్
    తారాగణం:ఉదయ్ కిరణ్,అదితి శర్మ,ఆహుతి ప్రసాద్,
    వేణు మాధవ్,అజయ్ తదితరులు.
    సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
    ఎడిటింగ్: కె.వి.కృష్ణా రెడ్డి
    యాక్షన్: గణేష్
    ఆర్ట్ :నాగేంద్ర
    కొరియోగ్రఫి :స్వర్ణబాబు,శ్రీ విద్య
    కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకుడు: మదన్
    నిర్మాత :పరుచూరి శివ రామ ప్రసాద్
    రిలీజ్ డేట్: 12 సెప్టెంబర్ 2008

    'పెళ్ళయిన కొత్తలో' సినిమా పరిశ్రమ దృష్టిని ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్న మదన్ రెండో ప్రయత్నం 'గుండె ఝల్లుమంది'. అయితే మొదటి సినిమాలో ఉన్నంత ఎంటర్ టైన్ మెంట్ గానీ, స్క్రిప్టు పై గ్రిప్ గానీ ఈ బోయ్ మీట్స్ గాళ్ సినిమాలో కనిపించవు. ఫార్సికల్ డ్రామాగా జరిగే ఈ కథలో సీన్లు పదే పదే రిపీటవటం,లవ్ స్టోరీకి ఉండాల్సిన పాటల డెప్త్ కనపడకపోవటం,స్క్రీన్ ప్లే లోపాలు,తగ్గిన వినోదం ప్రేక్షకుడ్ని విసిగిస్తాయి. అయితే కలెక్షన్స్ కోసం చీప్ కామిడీని,అసభ్యతను ఎన్నుకోనందుకు మదన్ ని అభినందించాలి.

    బాలరాజు(ఉదయ్ కిరణ్) తన పల్లెలో ప్రెసెడెంట్ అవ్వటానికి అవసరమైన చదువైన బి.ఎ పాసవ్వాలని సిటీకి బయిలుదేరతాడు. అక్కడ తన అక్కలా ప్రేమలో పడి కెరీర్ ని పాడు చేసుకోకూడదని డిసైడ్ అయి ఉన్న నీలిమ (అదితి శర్మ)కలుస్తుంది. ఆమె అప్పటికే తాను రాజేష్ (ఊహాజనిత వ్యక్తి) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని పబ్లిసిటీ చేసుకుని అందర్ని దూరంగా పెడుతూంటుంది. అయితేనేం హీరో,హీరోయిన్లు ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరికొకరు చెప్పుకోలేక చివర రీలు దాకా తెగ లాగుతారు. ఇంతలోకి తాము క్రియేట్ చేసిన రాజేష్ అనే క్యారెక్యర్ సీను లోకి వచ్చి ట్విస్ట్ ఇస్తాడు. అప్పుడేం జర్గిందనేది మిగతా కథ.

    క్లాసిక్ నేరేషన్ లో తీర్చిదిద్దిన ఈ కథ సరదా...సరదా ప్రేమ కథగా తీర్చిదిద్దుదామని మదన్ మొదలు పెట్టాడని అర్ధమవుతూంటుంది. అయితే ఇంటర్ వెల్ కి రావాల్సిన ట్విస్ట్ (తాను క్రియేట్ చేసిన క్యారెక్టర్ తనకే ఎదురుపడి ట్విస్ట్ ఇవ్వటం) క్లైమాక్స్ లో రావటంతో కథకు అనవసరమైన సన్నివేశాలు పెరిగిపోయాయి. అలాగే సమస్య వచ్చిన దాని నుంచి పుట్టే అవసరమైన డ్రామా అంతా మిస్సయింది. దాంతో కాంఫ్లిక్ట్ లేకుండా కథ కడ వరకూ డైలాగులు సాయింతో వెళ్ళిపోయింది. నిజానికి ప్రేక్షకుడు ఎంజాయి చేసేది ఆ మిడిల్ భాగాన్నే.

    ఇక సినిమాలో శ్రీనివాసరెడ్డి పాత్ర (హీరో కి సలహా అవసరమైనప్పుడల్లా ఎదురుగా కనపడి కంటిన్యూగా సలహాలు ఇవ్వటం) బాగా పేలింది. అలాగే పెళ్ళయిన కొత్తలో వేణుమాధవ్ పాత్రకు కంటిన్యూగా కనపడే కామిడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. డైలాగులే మదన్ కి బలం అయినా వాటిని మరింత ట్రిమ్ చెయ్యాలనిపిస్తుంది. అలాగే రైటరే డైరక్టర్ కావటంతో తాను రాసుకున్న సన్నివేశాలపై మమకారం పోక రాసుకున్న వాటినన్నిటినీ వాడసినట్లు కనపడుతుంది. ఉదయ్ కిరణ్ లవర్ బొయ్ ఇమేజ్ పెద్దగా వర్కవుట్ అయినట్లు (ప్రేక్షకుల రెస్పాన్స్) కనపడటం లేదు. హీరోయిన్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాల్లో మంచి అభినయాన్నే ప్రదర్శించింది. విలన్ గా అజయ్ పాత్ర చాలా రొటీన్ గా ఉండి క్లైమాక్స్ కే పనికి వచ్చింది.

    ఆహుతి ప్రసాద్ అనవసరంగా వచ్చీరాని తెలంగాణా స్లాంగ్ ఎత్తుకున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. చందమామ లో ఆయన మాట్లాడిన గోదావరి జిల్లాల మాదిరి యాస లా ఇది పేలుతుందని పెట్టి ఉండవచ్చు. అలాగే చిన్న పిల్లల ముదురు మాటలు,హీరో ల ప్రేమలకు సలహా లివ్వటం ఈ మధ్య కనపడంటం లేదు . దాన్నీ ఈ సినిమా తీరుస్తుంది. ఇక రీరికార్డింగ్, పాటలు మరింత బావుంటే బావుండననిపిస్తుంది. అయితే ఇది..అదే..ఇది అదే పాట,గుండె ఝల్లుమంది టైటిల్ సాంగ్ బాగుంది. కెమెరా,ఎడిటింగ్ సినిమా మూడ్ ని కొంత వరకూ క్యారీ చేసాయి.

    మనం ఆపుకున్నా,కాదనుకున్నా పుట్టాలనుకున్న సమయానికి ప్రేమ దానంతట అదే పుడుతుంది అనే సందేశం(?)తో వచ్చిన ఈ సినిమా ఫస్టాఫ్ ట్రిమ్ చేయాల్సిన అవసరముంది. అప్పుడు ఫరవాలేదనిపించే చిత్రమనిపించి... ఫ్యామిలీలుకు నచ్చే అవకాశమిస్తుంది. అయితే ఆనలుగురు రచయిత కాబట్టి అలాంటి సామాజిక ప్రయేజనం ఉన్న సబ్జెక్టును ఎన్నుకుని ఉంటాడని వెళితే తీవ్ర నిరాశ తప్పదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X