»   » రేష్మి సీన్స్‌తో ఊరించారు కానీ... (గుంటూరు టాకీస్ రివ్యూ)

రేష్మి సీన్స్‌తో ఊరించారు కానీ... (గుంటూరు టాకీస్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
హైదరాబాద్: ఎల్.బి.డబ్ల్యు, రోటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు లాంటి భిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన క్రైమ్ కామెడీ చిత్రం ‘గుంటూరు టాకీస్'. జబర్దస్త్ టీవీ షో యాంకర్ రేష్మి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. వారం పది రోజుల క్రితం.... రేష్మిపై చిత్రీకరించిన హాట్ అండ్ సెక్సీ సాంగ్ టీజర్ విడుదల చేయడంతో ‘గుంటూరు టాకీస్' మూవీపై హైప్ బాగా వచ్చింది. తాజాగా నేడు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి సినిమాలో ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం...

కథ విషయానికొస్తే...
గుంటూర్ టాకీస్ అనే మెడిక‌ల్ షాపులో ప‌నిచేసే హ‌రి(సిద్ధు), గిరి(న‌రేష్‌) రాత్రివేళ చిల్ల‌ర‌దొంగ‌త‌నాలు చేస్తుంటారు. సిద్ధు లవర్ రేష్మి. ఓసారి ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు సీఐ రఘుబాబు కు చెందిన ఇళ్లలో ఐదు లక్షలు దోచేస్తారు. ఆ డబ్బుతో ఇద్దరూ తమకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేద్దాం అనుకునే సమయానికి వారిని ఓ రౌడీ బ్యాచ్ బంధిస్తుంది. కోటి రూపాయ‌లు విలువ చేసే ఓ డ‌బ్బా గురించి అడుగుతూ ఎక్క‌డ దాచారంటూ హింసిస్తుంటారు. మరో వైపు తన డబ్బు కోసం సీఐ రఘుబాబు వీరి వెంట పడుతుంటాడు. రివాల్వర్ రాణి (శ్రద్ధా దాస్) కూడా వీరి కోసం వెతుకుతుంది. ఆ కోటి రూపాయల విలువ చేసే డబ్బాలో ఏముంది? వీరికి ఆడబ్బాకు సంబంధం ఏమిటి? రివాల్వర్ రాణి ఎవరు? రష్మి క్యారెక్టర్ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...
ఈజీగా మనీ సంపాదించేందుకు దొంగతనాలకు సైతం వెనకాడని హరి పాత్రలో సిద్ధూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన రష్మికి పెద్దగా నటించే అవకాశం దొరకలేదు. ఉన్నంతలో ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా మాత్రం ఓ సాంగులో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్, ముద్దు సీన్‌తో ఇరగదీసింది. రేష్మి నుండి ఈ రేంజిలో గ్లామర్ ప్రదర్శన ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. సిద్ధూ, రేష్మి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. గిరి పాతరలో నరేష్ ఒదిగిపోయాడు. శ్ర‌ద్ద‌దాస్ దాస్ పోషించిన రివాల్వర్ రాణి పాత్ర నిడివి కూడా తక్కువే ఉండటంతో ఆమెకు పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం దక్కలేదు. అయితే అందం, స్టైల్‌తో కట్టిపడేసింది. కామెడీ విలన్ పాత్రలో పాత్రలో మ‌హేష్ మంజ్రేక‌ర్ ఆకట్టుకున్నాడు.


విశ్లేషణ..

విశ్లేషణ..


ఏ సినిమాకైనా కథ ప్రధాన బలం. కానీ ఈ సినిమాకు అదే మైనస్ అయింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం ఇండస్ట్రీలో రన్నింగులో ఉన్న క్రైమ్ కామెడీ కాన్సెప్టును ఎంచుకున్నాడు. ఇలాంటి కథలు ప్రేక్షకులను మెప్పించేలా తీసుకెళ్లాలంటే కథనం వేగంగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ విషయంలో ప్రవీణ్ సత్తారు చాలా సాగదీత ధోరణి ప్రదర్శించాడు.


ప్రవీన్ సత్తారు

ప్రవీన్ సత్తారు


పాత్ర‌ల రూప‌క‌ల్ప‌న‌పై కూడా దర్శకడు సరిగా శ్రద్ధ పెట్టలేదు. సినిమాలో పాత్ర‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నా వాటి ప్ర‌భావం అంత‌గా క‌నిపించ‌దు.


టెక్నికల్ అంశాల పరంగా...

టెక్నికల్ అంశాల పరంగా...


సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. శ్రీ చ‌ర‌ణ్‌ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది.


రష్మి సీన్లతో ఊరించారు

రష్మి సీన్లతో ఊరించారు


రష్మి హాట్ సీన్లతో ఊరించారు కాబట్టి యూత్ ద్వారా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.


పైనల్ వర్డ్

పైనల్ వర్డ్


ఓవరాల్ గా చెప్పాలంటే......‘గుంటూరు టాకీస్' జస్ట్ యావరేజ్ మూవీ.


English summary
Guntur Talkies Review. To sum up watch this Guntur Talkies movie if you like movies like Delhi Belly like movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu