For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గురి..ప్రేక్షకులుబలి!

  By Staff
  |

  Guri
  చిత్రం: గురి

  నటీనటులు: శ్రీహరి, నవీన్‌, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం

  నిర్మాత: తలమంచి నరసారెడ్డి

  దర్శకత్వం: భరత్‌

  ఫక్తు సి-గ్రేడ్‌ చిత్రం ఇది. సారీ, డి-గ్రేడ్‌ చిత్రం. శ్రీహరి, నవీన్‌లిద్దరూ నటించిన ఈ సినిమా ద్వారా దర్శకుడు భరత్‌ చెప్పాలనుకున్నదేమిటో గానీ, ఓ పది సీన్లు తీసి వాటిని పదే పదే ఎడిటింగ్‌ సమయంలో రీపిట్‌ చేసి ప్రేక్షకుల మీదికి వదిలాడు. 'తాజ్‌మహల్‌పై రక్తపు చుక్కలు..' వంటి అనేకానేక చిత్రాలు ప్రారంభించి పూర్తి చేయని దర్శకుడు భరత్‌ మరీ ఛీఫ్‌గా రూపొందించాడు.

  నవీన్‌ నటన, పాటలు, సంఘవి, నవీన్‌ల మధ్య రోమాన్స్‌, శ్రీహరి ఫైట్‌లు అన్ని అలా స్పోర్డాక్‌గా తీసి కలిపినట్లు కన్పించింది. సినిమా పూర్తిగా యాక్షన్‌ సినిమా కానీ మనకు ఇంత స్టుపిడ్‌గా తీయవచ్చుని తెలుసుకొన్నప్పుడల్లా మనకు నవ్వు వస్తుంటుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ప్లాష్‌బ్యాక్‌లో శ్రీహరి నటన ఒక్కటే సినిమాలో కాస్తా చెప్పుకోదగ్గ అంశం. అతి పెద్ద జోక్‌ నవీన్‌ నటన. హీరోగా అన్ని సినిమాలు చేసిన నవీన్‌ ఎంత 'గొప్ప నటుడో' ఈ సినిమాతో 'తేలి'పోయింది! పరమదారుణంగా చేశాడు. నవీన్‌, సంఘవి, శ్రీహరి, దర్శకుడి పనితనం, కథ, ప్రోడక్షన్‌ వ్యాల్యూస్‌ దేంట్లోనూ చిన్న ప్రతిభ కూడా లేని ఒక అర్థం పర్థంలేని చిత్రమిది.

  శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్‌. లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతులకు కారణమవుతాడు. కానీ ఇందులో నా తప్పేమీ లేదని, డిస్ట్రిబ్యూటర్‌ మోసం చేశాడని, ఆయన ఒక లెటర్‌ రాసి పెళ్ళాం, కూతురు సహా ఆత్మహత్య చేసుకుంటారు. తన తండ్రి నిర్దోషని నిరూపించేందుకు..కలెక్టర్‌, డిస్ట్రిబ్యూటర్‌, ఎస్పీ, వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తాడు. కానీ వారు అంతా ఒకటేనని తెలుసుకొని...వారిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తాడు.

  హోంశాఖ మంత్రిని (ధర్మవరపు సుబ్రమణ్యం) అలిపిరి వద్ద (చంద్రబాబుపై జరిగిన దాడికి ఇది సెటైరా?) కిడ్నాప్‌ చేసి - డీజీపీని కలుస్తాడు. మొత్తం పోలీసు ఫోర్స్‌ అంతా తను చెప్పినట్లు వినాలని కోరుతాడు. డీజీపీ అందుకు అంగీకరిస్తాడు. సో..హీరోగారు..ఈ పోలీసు ఫోర్స్‌ను వేసుకొని ఈ నలుగురిని చంపుతాడు. మధ్యలో మరో నిజాయితీ పోలీసు నవీన్‌ అడ్డుకుంటాడు. కానీ అతను కూడా శ్రీహరి ప్లాష్‌బ్యాక్‌ విని సాయం చేస్తాడు చివర్లో.

  ఈ సోదీ కథకు రెండు గంటల భరించలేని కథనం, చిత్రణ. ప్రతి సీన్‌ అతుకుల బొంత. మధ్య మధ్యలో శ్రీహరి హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటాడు...బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాట వస్తుంటుంది. ఇంతకీ ఆ పాట ఏమిటంటే.. 'అద్భుతం' (తమిళంలో 'అమర్కలం')లోని 'అడిగా..అడిగా..' అనే పాటకు సాహిత్యం మార్చి ఉన్నదున్నట్టు వాడుకున్నారు. సినిమాలు ఇలా కూడా తీయవచ్చని భరత్‌ నిరూపించాడు. బలితీయడానికి ఆయన ప్రేక్షకులను, నిర్మాతనే గురి పెట్టుకొన్నట్లు కన్పిస్తోంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X