For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కళ కాదు ముఖి ('చంద్రకళ' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5
  తమిళ,తెలుగు,కన్నడ భాషల్లో హర్రర్ కామెడీలు వర్కవుట్ అవుతున్నాయి. దాంతో కామెడీలు తీసే దర్శకులు ఇమ్మీడియట్ గా తమ జానర్ కి హర్రర్ మిక్స్ చేసేసి వదిలేస్తున్నారు. అలా ఇనిస్టెంట్ గా కథ తయారు చేస్తున్నప్పుడు ఏదో ఒక హిట్ సినిమా తీసుకుని దాన్ని తనదైన స్టైల్ లో మార్చుకుని, స్టార్ కాస్ట్ మారిస్తే కొత్త సినిమా తయారైపోతుందనే ఫార్ములాతో చంద్రముఖ చిత్రాన్ని దగ్గర పెట్టుకుని సుందర్ సి ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు. దాంతో టైటిల్ లోనే కాక కథలోనూ పోలిక కనపడటంతో పెద్ద ఆసక్తి కలిగించలేకపోయింది. దాంతో ఈ డబ్బింగ్ డబ్బా...డబ్బులు కురిపించటం కష్టమే అనిపిస్తోంది. టాక్ పట్టించుకోకుండా కేవలం హన్సికను చూసి వెళ్ళే వారితోనూ, ఈ జానర్ కి ఉన్న క్రేజ్ తోనూ థియోటర్స్ కళకళ్ళాడాలి.

  https://www.facebook.com/TeluguFilmibeat

  'ప్రేమ కథా చిత్రమ్' హిట్ తో మన తెలుగులో హర్రర్ కామెడీలకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. దానికి తోడు రీసెంట్ గా వచ్చిన గీతాంజలి,బూచమ్మ బూచోడు సైతం హిట్ కావటంతో ఇతర భాషల్లో ఉన్న హర్రర్ కామెడీలను సైతం కొనుక్కొచ్చి ఇక్కడ డబ్ చేసి వదిలేస్తున్నారు. ముఖ్యంగా హన్సిక, కోట శ్రీనివాసరావు వంటి తెలిసున్న ముఖాలు ఉండటం బిజినెస్ పరంగా మరింత ప్లస్ అయ్యింది.

  రెగ్యులర్ గా ఈ తరహా చిత్రాల్లో లాగనే ...మురళి(వినయ్ రాయ్)కుటుంబానికి చెందిన ఓ జమీందారు బంగ్లా అమ్మకానికి పెడతారు. దాన్ని శుభ్రం చేయటానికి వచ్చిన వారంతా ఒకరు తర్వాత మరొకరు మాయమవుతూంటారు. దాంతో ఆ భవంతిలో దెయ్యం తిరుగుతోందని,అదే ఇదంతా చేస్తోందని అందరూ భావించి,భయపడతారు. అప్పుడు ఆ ఇంటికి మురళి భార్య అన్న అయిన రవి(సుందర్.సి) వస్తాడు. ఆయన ఈ సంఘటనలు వెనక ఉన్న కారణాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఈ లోగా తన చెల్లిలే(ఆండ్రియా) ఈ హత్యలన్నీ చేస్తోందని తెలుసుకుని షాక్ అవుతాడు. అప్పుడు రవి ఏం చేసాడు...తన చెల్లికీ చంద్రకళ(హన్సిక) కీ సంభంధం ఏమిటి.. ఇంతకీ చంద్రకళ ఎవరు..ఆ భవంతికి చంద్రకళకూ ఉన్న సంభంధం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే మిగతా కథ తెలుసుకోవాల్సిందే.

  Hansika's Chandrakala review

  తమిళ చిత్రం‘అరన్మణి' డబ్బింగ్ గా వచ్చిన ఈ చిత్రం పక్కా ఫార్ములా వ్యవహారం. దెయ్యం, ఓ భవంతి, పగ,ప్రతీకారం లతో రొటీన్ గా ఎటువంటి ట్విస్ట్ లు లేకుండా సాగిపోతుంది. అలాగే ఫస్టాఫ్ లో దెయ్యం ఛాయలు ఉన్న సీన్స్ లు ఉన్నా భయపెట్టలేకపోయారు. సుందర్ సి ట్రేడ్ మార్క్ కామెడీ సీన్స్ అంతంతమాత్రంగా, తమిళ వాసన కొడుతూ ఉన్నాయి. దానికి తోడు ఫ్లాట్, క్యారెక్టర్స్ చంద్రముఖి కి బాగా దగ్గరగా ఉండటం జరిగింది. చంద్రముఖిలో చివర్లో దెయ్యం లేదు గియ్యం లేదు..అదంతా సైక్లాజికల్ అంటారు..దాన్ని తీసేసి దెయ్యం ఉంది...చంద్రముఖి నిజంగా దెయ్యమే అని రాసుకుంటే పుట్టిన కథే ఇది.

  అలాగే ఈ హర్రర్ కామెడీ ప్రత్యేకత ఏమీటీ అంటే... హర్రర్ ...కామెడీ పెద్దగా లేకుండా తీయటమే. తమిళంలో ఈ కథ,కథనం కొత్తదనిపించి హిట్ చేసారేమో కానీ తెలుగులో ఇలాంటి సీన్స్ చాలా చూసేసి ఉన్నారు. మన ప్రేమ కథా చిత్రమ్, గీతాంజలి,అరుంధతి కూడా ఇందులో కనపడుతూంటుంది.

  అసలు ఈ సినిమాకు చెత్తగా అనిపించేది..పాటలు, ఫైట్స్. రెగ్యులర్ హీరో సినిమాలా వాటిని పెట్టడం,అవి టైమ్ పాడూ లేకుండా మధ్యలో వచ్చి విసిగించటం జరుగుతుంది. అలాగే హర్రర్ కామెడీ కి లెంగ్త్ కూడా ఎక్కువైంది. కాస్త తెలుగు వెర్షన్ కు అయినా ట్రిమ్ చేస్తే బాగుండేది. సంతానం కామెడీ, కోవై సరళ కామెడీ అక్కడక్కడా బాగుంది.

  ఇక ఈ సినిమా కు వెళ్లాలి అనిపించటానకి ఏకైక కారణం..పోస్టర్స్ మీద,టీజర్స్ లో కనిపించే హన్సిక. అయితే సినిమాలో ఆమె కనపడేది చాలా చాలా తక్కువ సేపే అని చెప్పాలి. మొత్తం సినిమా ఆండ్రియాది. ఆండ్రియా క్లైమాక్స్ లో చాలా బాగా చేసింది. అలాగే హన్సిక...విలేజ్ అమ్మాయి అన్నారు కానీ ఏదో సిటీ అమ్మాయికు బలవంతంగా విలేజ్ కాస్ట్యూమ్స్ వేసినట్లుంది. కాకపోతే విలేజ్ ఎట్మాస్మియర్ ని కెమెరామెన్ బాగా పట్టుకున్నాడు.

  సుందర్ సి..(దర్శకుడు కమ్ యాక్టర్) ...చంద్రముఖి లో రజనీ టైప్ పాత్రలో కనిపించాడు. కానీ రజనీ ఎక్కడ..సుందర్ ఎక్కడ...ముఖంలో ఏ ఎమోషన్ కనపడకుండా మేనేజ్ చేసాడు. టెక్నికల్ గా సెంధిల్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేయించుకుంటే అనవసరమైన నస తగ్గేది. సాంగ్స్ ని ,ఫైట్స్ ని పూర్తిగా తీసేస్తే ఖచ్చితంగా ఇంతకన్నా బాగుంటుంది.

  ఫైనల్ గా ఈ చిత్రం హన్సిక అభిమానులకు మాత్రమే కాక ఏదో కాసేపు నవ్వుకుందామనుకునే వాళ్లకు పనికివస్తుంది. భయపడిపోతాం, విరగపడి నవ్వేసుకుందాం, హన్సిక అందచందాలు చూసి తరిద్దాం అనుకుంటే వారికి ఇది పీడకలని మిగిలుస్తుంది.

  సంస్థ:శ్రీ శుభశ్వేత ఫిల్మ్స్‌

  నటీనటులు:హన్సిక, విమల్‌, లక్ష్మీరాయ్‌, ఆండ్రియా, సుందర్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం తదితరులు

  మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి,

  పాటలు: వనమాలి,

  సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్‌,

  ఫొటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌,

  సహనిర్మాత: పద్మారావు వాసిరెడ్డి,

  నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు,

  కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్‌ సి.

  English summary
  Hansika, Lakshmi Rai, Andrea's hit tamil film ‘Aranmai’ directed by Sundar.C is released in Telugu as ‘Chandrakala’ today with divide talk. C.Kalyan is presenting the film produced by Swethayalana, Varuna, Teja and CV.Rao on Sri Subha Swetha Films banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X