twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్ సెన్స్ ...(హౌస్ ఫుల్-3 రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    2016 ప్రారంభం అయినప్పటి నుండి బాలీవుడ్లో ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్ ఫిల్మ్స్ రాలేదు. ఆ తరహా కాన్సెప్టుతో తెరకెక్కిన 'హౌస్ ఫుల్-3' ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. ఈ చిత్రానికి సాజిద్-పర్హాద్ దర్శకత్వం వహించగా, సాజిద్ నడియావాలా 'నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టెన్మెంట్' బేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    ఈ సినిమాలో మెయిన్ హైలెట్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కూడా ప్రధాన కారణం ఆయనే. తన చివరి చిత్రం 'ఎయిర్ లిప్ట్'లో సీరియస్ క్యారెక్టర్లో కనిపించిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో అందుకు పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించారు. ఇందులో అక్షయ్ తో పాటు అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్, నర్గీస్ ఫక్రి, లీసా హెడెన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బోమన్ ఇరానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రేక్షకులను కామెడీతో పూర్తి స్థాయిలో ఎంటర్టెన్ చేయడమే లక్ష్యంగా వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఎంటర్టెన్ చేసిందో రివ్యూలో చూద్దాం...

    రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వారే సాండీ (అక్షయ్ కుమార్), బంటీ (అభిషేక్ బచ్చన్), టెడ్డీ (రితేష్ దేశ్ ముఖ్). ఈ ముగ్గురు బటుక్ పటేల్ కూతుర్లతో ప్రేమలో పడతారు. వారే సారా పటేల్(నర్గీస్ ఫక్రి), జెన్నీ పటేల్ (లీసా హెడెన్), గ్రేసీ పటేల్ (జాక్వెలిన్ పెర్నాండెజ్). తండ్రి దృష్టిలో ఈ ముగ్గురు చాలా సంస్కారమైన అమ్మాయిలు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం.

    బటుక్ పటేల్ తన కూతుర్లకు అసలు పెళ్లి అవసరం లేదనే ఆలోచనలో ఉంటాడు. ప్రపంచంలో ఇలాంటి ఆలోచన ఉన్న ఏకైక తండ్రి ఇతడే. ఒకరి తర్వాత ఒకరు సాండీ, బంటీ, టెడ్డీ బటుక్ పటేల్ కూతుర్ల బాయ్ ఫ్రెండ్స్ గా అతని ఇంట్లోకి ఎంటరవుతారు. అక్కడి నుండి ఫన్ డ్రామా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ ముగ్గురు బటుక్ పటేల్ కూతుర్లకు సరైన జోడీ అని ఎలా నిరూపించుకుంటారు? అనేది మిగతా స్టోరీ.

     పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

    పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

    లక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఆయన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇన్ స్టాల్మెంట్ మూవీ ‘హౌస్ ఫుల్'లో చేసినంతగా లేదు. మరో యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్ కూడా తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన నుండి ఆశించినంతగా కామెడీ పెర్ఫార్మెన్స్ రాలేదు. అభిషేక్ బచ్చన్ ఎప్పటి లాగే అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ లకు పోటీ ఇచ్చే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేక పోయారు. నర్గీస్ ఫక్రి, లీసా హెడెన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మగ్గురూ అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా సమానమైన మార్కులు కొట్టేసారు. ఇక బోమన్ ఇరానీ లాంటి వారి నటనకు వంకలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.

     టెక్నికల్ వాల్యూస్

    టెక్నికల్ వాల్యూస్

    సినిమాలో టెక్నికల్ వ్యాల్యూస్ ఏమంత గొప్పగా లేవు. సినిమాటోగ్రఫీ ఒకే. మ్యూజిక్ యావరేజ్. విఎఫ్ఎక్స్ చాలా పూర్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే.

     విషయం ఉందా?

    విషయం ఉందా?

    దర్శకుడు ఈ సినిమాలో కేవలం రొమాంటిక్ కామెడీ యాంగిల్‌లో ఉండే సీన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడే తప్ప కథ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. రొటీన్ స్టోరీలైన్ తీసుకుని కేవలం కామెడీగా, రొమాంటిక్ గా, సెక్సీగా సాగే సీన్లతో నింపే ప్రయత్నం చేసాడు. సినిమా అంతా ఏదో నాన్ సెన్స్ వ్యవహారంలా నడస్తుంది. గతంలో వచ్చిన హౌస్ ఫుల్, హౌస్ ఫుల్-2 లతో పోల్చితే ఈ సినిమా చాలా వరస్ట్ గా ఉంది.

     చివరగా....

    చివరగా....

    కేవలం అక్షయ్ కుమార్ కామడీ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే మింగుడుపడే సినిమా.

    English summary
    Finally, the first 'full entertaining' film of 2016, Housefull 3 has released today. The film is directed by Sajid-Farhad and produced by Sajid Nadiadwala under his banner Nadiadwala Grandson Entertainment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X