For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కథే రాంగ్... (హృతిక్ 'బ్యాంగ్‌ బ్యాంగ్‌' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5

  'బ్యాంగ్‌ బ్యాంగ్‌' బాలీవుడ్‌లోనే కాదు భారతీయ సినీ పరిశ్రమలోనే గత కొంతకాలంగా హాట్‌ టాపిక్‌గా మారిన చిత్రమిది. యాక్షన్‌ సినిమాల హీరో హృతిక్‌ రోషన్‌ నుంచి వచ్చిన పవర్‌ఫుల్‌ సినిమా కావటంతో అభిమానులంతా ఆసక్తిగా థియోటర్స్ కి వెళ్లారు. దీనికితోడు కత్రినా కైఫ్‌ అందచందాలు ఎలాగూ ఉన్నాయి. 'సలామ్‌ నమస్తే', 'తరా రమ్‌పమ్‌', 'బచ్‌నా హే హసీనో', 'అంజానా అంజాని' చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ నిర్మించింది. ఈ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రచార చిత్రాల్లోని పోరాట సన్నివేశాలు, హృతిక్‌, కత్రినాల కెమిస్ట్రీతో సినిమాకు భారీ హైప్‌ వచ్చింది. ఈ హైప్ కు తగ్గట్లు సినిమా ఉందా లేదా అన్నది చూద్దాం.

  చిత్రం కథేమిటంటే...లండన్ లో కోహినూర్ వజ్రం ఉంటుంది. దాన్ని రాజ్ వీర్(హృతిక్ రోషన్)దొంగతనం చేస్తాడు. అయితే ఆ వజ్రాన్ని అతని నుంచి లేపేయటానికి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఓమర్ జాఫర్(డానీ), హమీద్ గుల్(జావెద్ జాఫ్రీ) గ్యాంగ్ వెంటపడుతూంటూంది. అయితే ఈ మాఫియా గ్యాంగ్ లకు దొరకకుండా ఓమర్ జాఫర్ ని ఎలగైనా కలుసుకోవాలని రాజ్ ప్రయత్నిస్తూంటారు. ఇంతకీ రాజ్...ఓమర్ జాఫర్ ని ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు. ఈ ఛేజింగ్ లో రాజ్ తో కలిసిన హర్లీన్(కత్రినా) ఎవరు... అసలు కోహినూర్ వజ్రం దొంగతనం వెనక ఉన్న అసలు కథ ఏమిటి తెలుసుకోవాలంటే చిత్రం పూర్తిగా చూడాల్సిందే.

  హాలీవుడ్‌ సినిమా 'నైట్‌ అండ్‌ డే'కిది రీమేక్‌. 2010లో విడుదలైన ఈ చిత్రంలో టామ్‌ క్రూయిజ్‌, కెమెరన్‌ డియాజ్‌ ప్రధాన పాత్రధారులు. 'బ్యాంగ్‌ బ్యాంగ్‌'ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ చిత్రం లాంటి కథ,కథనాలు మనకు గతంలో కొన్ని చిత్రాల్లో వచ్చేసి ఉండటంతో పెద్ద గొప్పగా అనిపించదు. పూర్తి ఛేజింగ్ లతో నడుస్తూండటంతో రెగ్యులర్ సినీ గోయిర్స్ కు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే హృతిక్ రోషన్ చేసిన సాహసాలు, కత్రినా అందచందాలు ఈ సినిమాకు ప్లస్. వీటిని అద్బుత రీతిలో ఆవిష్కరించారు. అంతకు మించి ఈ సినిమాలో ఏమీ లేదనిపిస్తుంది.

  మిగితా రివ్యూ స్లైడ్ షోలో...

  సెంటిమెంట్ ని కలిపాడు

  సెంటిమెంట్ ని కలిపాడు

  ఓ రకంగా ఇది ఇండియన్ జేమ్స్ బాండ్ కథ అని చెప్పాలి. అయితే కథ గొప్పగా ఉండదు. అతి సాధారణమైన కథే అయినా ఛేజ్ సీక్వెన్స్ లతో ఆసక్తి కరంగా నడిచే ఈ కథనానికి చివర్లో చిన్న సెంటిమెంట్ టచ్ ఇచ్చి దర్శకుడు కొంత వరకూ సక్సెస్ అయ్యాడు.

  సరైన ఎంపిక

  సరైన ఎంపిక

  'బ్యాంగ్‌ బ్యాంగ్‌'లో హీరోగా తొలుత షాహిద్‌ కపూర్‌ను అనుకున్నారు. ఆ తర్వాత హృతిక్‌ రోషన్‌ వచ్చి చేరాడు. అయితే ఈ చిత్రంలో హృతిక్ చేసిన సాహసాలు చూస్తే దర్శకుడు చాలా కరెక్టుగా ఎంపిక చేసాడనిపిస్తుంది. హృతిక్ లేకపోతే ఇండియన్ వెర్షన్ కి ఈ సినిమా పూర్తి వృధా.

  పండుగే..

  పండుగే..

  థాయ్‌లాండ్‌, గ్రీస్‌, అబుదాబి తదితర ప్రాంతాల్లో నీటిలో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా రిస్క్‌తో కూడిన ఈ సన్నివేశాల కోసం హృతిక్‌ ఐదారురోజులపాటు రోజుకు ఐదేసి గంటలు కఠోర శిక్షణ పొందేవాడట. అదంతా తెరపై కనిపిస్తూంటుంది. సినిమా యాక్షన్ అభిమానులకు పండుగలా ఉంటుంది.

  హైలెట్స్ లో ...

  హైలెట్స్ లో ...

  చిత్రం హైలెట్స్ లో ఒకటి...నీటి ఉపరితలంపై చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాల కోసం జెట్‌స్కీ నడపడం నేర్చుకున్నాడు హృతిక్‌. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారిగా చిత్రీకరణ కోసం ఫ్త్లెబోర్డును ఉపయోగించారు. దీని సహాయంతో హృతిక్‌ గాల్లోకి 45 అడుగుల ఎత్తు ఎగిరి ఫైట్‌ చేశాడు. అదే చూసేటప్పుడు అద్బుతంగా ఉంది.

  ఛేజ్ లు...

  ఛేజ్ లు...

  బాలీవుడ్‌ చరిత్రలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం 120కిపైగా కార్లతో ఛేజ్‌ సన్నివేశాన్ని చిత్రీకరించిన సీన్ అదిరిపోతుంది. ఇందులో ఎఫ్‌1 రేస్‌ కార్లనూ వినియోగించారు. ఇదీ తొలిసారిగా మన ఇండియన్ తెరపై కనపడటం తో చాలా ఆసక్తిగా ఉంటుంది.

  అలాగే...ఇవి కూడా అదిరాయి

  అలాగే...ఇవి కూడా అదిరాయి

  థాయ్‌లాండ్‌లో ఓ సన్నివేశ చిత్రీకరణలో భాగంగా హృతిక్‌ 40 అడుగుల ఎత్తు నుంచి నీటిలో దూకాడు. ఆ సమయంలో హృతిక్‌ తలకు గాయమై రక్తం గడ్డకట్టింది. కొన్నాళ్లకు దీని తీవ్రత తెలుసుకున్న హృతిక్‌ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో సినిమా ఆలస్యమైంది. ఆ తర్వాతా హృతిక్‌ రిస్కీ యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొన్నాడు. వీటికి ఆండీ ఆమ్‌స్ట్రాంగ్‌ నేతృత్వం వహించారు. ఈ సీన్స్ కూడా తెరపై బాగున్నాయి.

  కత్రినా కైఫ్

  కత్రినా కైఫ్

  కత్రినా....హృతిక్‌ రోషన్‌తో చేసిన మూడో చిత్రమిది. గత రెండు చిత్రాలు 'జిందగీ నా మిలేంగీ దొబారా', 'అగ్నిపథ్‌' (ప్రత్యేక గీతం)ల కంటే ఈ చిత్రంలో ఆమె పాత్ర బాగుంటుంది. యాక్షన్‌ సన్నివేశాలప్పుడు హృతిక్‌తో ఉండటం కూడా చూసేవారికి, ముఖ్యంగా ఆమె అబిమానులకు కొత్త అనుభూతినిచ్చింది''

  పాటలు

  పాటలు

  ఈ సినిమా ట్రైలర్ లో వాడిన 'తూ మేరీ...' పాట టీజర్‌కు థియోటర్ లో మంచి స్పందన వచ్చింది. మిగతా పాటలు కూడా బాగున్నాయి.

  అన్నీ బాగున్నా...

  అన్నీ బాగున్నా...

  విలనిజం సరిగ్గా పండకపోవటం, బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమాపై ఇంట్రస్టుని క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చాయి.

  ఎవరెవరు

  ఎవరెవరు

  నటీనటులు: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, డానీ, జావేద్ జాఫ్రీ తదితరులు

  సినిమాటోగ్రఫీ: వికాస్ శివరామన్, సునీల్ పటేల్

  సంగీతం: విశాల్- శేఖర్

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సలీం సులేమాన్

  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిద్దార్ధ్ ఆనంద్

  విడుదల తేదీ:02,అక్టోబర్, 2014.

  ఫైనల్ గా ఇది హృతిక్ అభిమానులను, యాక్షన్ చిత్రాల అభిమానులను అలరించే చిత్రం. పబ్లిసిటీ, హైప్ ఉన్నంత బ్యాంగ్ గా అయితే ఈ చిత్రం లేదు. టైం పాస్ చిత్రంగా ఓ సారి చూడవచ్చు. ట్రైలర్స్ చూసి సీరియస్ గా ఓ గొప్ప యాక్షన్ చిత్రం చూడబోతున్నాం అని వెల్తే నిరాశపడతారు.

  English summary
  Hrithik Roshan's Bang Bang' movie released today with Just ok talk. In this film Hrithik Roshan is the only eye candy.The rest is burble.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X