twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ చెవిలో పువ్వెట్టిన వర్మ (ఐస్ క్రీమ్ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.0/5
    హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ వరుసగా ప్లాపు సినిమాల తీస్తున్నా.....జనాలు మళ్లీ మళ్లీ థియేటర్లకు రావడానికి కారణం గతంలో ఆయన తీసిన 'శివ' లాంటి హిట్ చిత్రాలే. వర్మ గొప్ప సినిమా తీస్తాడని ఆశతో ప్రేక్షకులు థియేటర్ల వరకు వెళ్లడం, సినిమా చూసి నిరాశగా తిరిగా రావడం గత కొంతకాలంగా జరుగుతున్న తంతే.

    తాజాగా 'ఐస్ క్రీమ్' పేరుతో ఓ సినిమాను తీసిన జనాల మీదకి వదిలిన వర్మ....మరోసారి జనాలను నిరాశ పరిచారు. తన సినిమాపై ఆసక్తి పెంచడానికి విడుదల ముందు నుండే చాలా గిమ్మిక్స్ చేసే వర్మ 'ఐస్ క్రీమ్' విషయాలోనూ అదే పబ్లిసిటీ ఫార్ములా వాడారు. ఫ్లోకామ్ కెమెరా అంటూ.....న్యూడ్ సీన్స్ అంటే ఊదర గొట్టాడు. జనాల్లో ఆశలు రేపేలా ట్రైలర్ రూపొందించారు.

    దీంతో 'ఐస్ క్రీమ్' సినిమా గురించి చాలా ఊహించుకుని వెళ్లిన ప్రేక్షకులు....వర్మ మరోసారి తమ చెవుల్లో పువ్వెట్టాడనే విషయం గ్రహించి, షరా మామలూగానే థియేటర్ల నుండి నిరాశతో వెనుదిరిగారు. సినిమా గురించి చెప్పకుండా ఏమిటీ సోది అనుకుంటున్నారా...? వస్తున్నాం, ఆ విషయానికే వస్తున్నాం....

    రేణు (తేజస్వి) మెడికల్ స్టూడెంట్. ఆమె లవర్ విశాల్ (నవదీప్). రేణు కుటుంబం కొత్తగా ఓ ఇంట్లోకి అద్దెకు వస్తారు. తల్లిదండ్రులు పెళ్లికి ఊరికి వెళ్లడంతో ప్రయుడిని ఇంటికి పిలుస్తుంది రేణు. ఆ ఇంట్లో గతంలో ఉన్నవారు పూజలు చేయించి ఒక బొమ్మని ఉంచుతారు. వారికి ఆ ఇల్లు చూపించిన ఏజెంట్ వాటిని కదపకూడదు అని చెపుతాడు. అనుకోకుండా విశాలల్ దాన్ని తన్నేస్తాడు. అప్పటి నుండి ఆ ఇంట్లో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో దయ్యాలు ఉన్నాయని భయపడుతుంది రేణు. కానీ విశాల్ ఆమె చెప్పే విషయాలు నమ్మడు. రేణుకు ఏదో మానసిక వ్యాధి ఉందని లైట్ తీసుకుంటాడు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? చివరికి ఏమైంది? అనేది మిగతా స్టోరీ.

    'Ice Cream' movie Review

    సినిమాలో నటీననటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.....తేజస్వి పెర్ఫార్మెన్స్ ఫర్వలేదు. తొలి సినిమా కాబట్టి అందాల ఆరబోత పరంగా కాస్త ఎక్కువే చేసిందని చెప్పొచ్చు. నవదీప్ తన పాత్ర పరిధి మేరకు నటించాడు. సినిమాలో ఈ రెండు పాత్రలు తప్ప చెప్పుకోవడానికి పెద్ద పాత్రలేమీ లేవు.

    సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఫ్లోకామ్ కెమెరా అంటూ ఊదర గొట్టిన వర్మ ఆ కెమెరాతో అద్భుతాలు ఏమీ చేయలేదు. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ యావరేజ్. ఇక ఎడిటింగ్ కూడా షార్ప్‌గా లేదు. న్యూడ్ సీన్ అంటూ సినిమాకు బాగానే పబ్లిసిటీ చేసారు. ఆ సీన్లు ఊహించుకుని వేళితే మాత్రం అలాంటివేమీ సినిమాలో కనిపించవు. ఇది జస్ట్ పబ్లిసిటీ గిమ్మిక్ మాత్రమే అని మీకు సినిమా చూసిన తర్వాత గానీ అర్థం కాదు. ఒక రకంగా సినిమా కంటే ట్రైలరే బాగుందనే భావన మీకు కలుగుతుంది.

    కథ ప్రాధాన్యత ఇవ్వకుండా.....కెమెరా, ఇతర విషయాలను నమ్ముకుని సినిమాలు తీద్దామనే ఆలోచనలో ఉన్నంత కాలం వర్మ సినిమాలు ఇలానే ఉంటాయి. వర్మ ప్రతిసారి కొత్త నిర్మాతలతో సినిమాలు తీస్తున్నారు...కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నారనుకుంటే పొరపాటే. వర్మతో సినిమాలు తీసిన పాత నిర్మాతలు చేతులు కాల్చుకుని అతనికి దూరంగా వెళ్లి పోన్నారు కాబట్టే కొత్త వాళ్లు వచ్చి మళ్లీ చేతులు కాల్చుకుంటున్నారు. 'ఐస్ క్రీమ్' సినిమా విషయంలోనూ అదే జరిగింది. అదీ సంగతి.

    బ్యానర్: భీమవరం టాకీస్
    నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
    దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
    మ్యూజిక్: సాయి కార్తీక్
    నటీనటులు: నవదీప్, తేజస్వి

    English summary
    
 Ice Cream is a 2014 Telugu film, screenplay and directed by Ram Gopal Varma. It is with suspense, thrill, comedy and love. This is the first Asian film to use ‘Flowcam System’ technology. Navdeep and Tejaswi are in lead roles, and upcoming actress Sandeepthi played key role in this movie. Ice Cream is a horror thriller which will not scare except for a handful of moments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X