»   » ఇది నా లవ్ స్టోరి సినిమా రివ్యూ: తరుణ్ కమ్‌బ్యాక్.. కానీ..

ఇది నా లవ్ స్టోరి సినిమా రివ్యూ: తరుణ్ కమ్‌బ్యాక్.. కానీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఇది నా లవ్ స్టోరి సినిమా రివ్యూ

review : 2/5

హీరో తరుణ్ గతంలో లవర్ బాయ్‌గా ప్రేక్షకులను అలరించాడు. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను లాంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దిమ్మ తిరిగే హిట్లను అందించాడు. కానీ కొద్దికాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమైపోయాడు.

తాజాగా కన్నడంలో ఘన విజయం సాధించిన సింపుల్ ఆగి ఓందు లవ్ అనే సినిమా రీమేక్‌‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో రక్షిత్ శెట్టి పోషించిన పాత్రను తరుణ్, శ్వేతా శ్రీవాస్తవ కనిపించిన పాత్రను ఓవియా పోషించారు. దర్శకుడు రమేష్ గోపి రూపొందించిన ఫీల్‌గుడ్ ప్రేమకథ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

 ఇది నా లవ్ స్టోరి కథ

ఇది నా లవ్ స్టోరి కథ

అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. తన చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపే విషయంపై మాట్లాడానికి తన కాబోయే బావ చెల్లెలు శృతితో మాట్లాడానికి ఓ గ్రామానికి అభిరామ్ వెళ్తాడు. కానీ శృతికి బదులు అభినయ (ఒవియా హెలెన్)ను కలుసుకొంటాడు. తొలి చూపులోనే అభినయతో ప్రేమలో పడుతాడు. కొద్ది సమయంలోనే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు.

 కథలో ట్విస్టు

కథలో ట్విస్టు

తమ జీవితంలో జరిగిన ప్రేమ వైఫల్యాల (బ్రేకప్‌) గురించి అభిరామ్, అభినయ ఒకరికొకరు చెప్పుకొంటారు. అలా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. అంతా సవ్యంగా జరుగుతుందనుకొంటుండగానే అభినయ ఫిర్యాదు చేయడంతో అభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ క్రమంలో అభినయ గురించి ఓ భయంకరమైన విషయం తెలుస్తుంది?

 క్లైమాక్స్‌లో

క్లైమాక్స్‌లో

అభినయ గురించి తెలిసిన భయంకర వాస్తవం ఏమిటి? అభిరామ్‌పై అభినయ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభినయ ప్రేమను ఏ విధంగా అభిరామ్ పొందుతాడు. అభినయని పెళ్లి చేసుకోవడానికి అభిరామ్ ఏలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఇది నా లవ్‌స్టోరి సినిమా.

స్క్రిప్టు, డైరెక్షన్ విశ్లేషణ..

స్క్రిప్టు, డైరెక్షన్ విశ్లేషణ..

కన్నడ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడంలో దర్శకుడు రమేష్ గోపి తడబాటుకు గురైనట్టు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. సన్నివేశాల నిడివి పెరిగిపోవడం సినిమాకు ప్రధానంగా మైనస్ పాయింట్. ఇక మితిమీరిన డైలాగ్స్ ప్రేక్షకుడిని సినిమాపై దృష్టి కేంద్రీకరించకుండా చేస్తాయి.

 స్టోరీ అనాలిసిస్

స్టోరీ అనాలిసిస్

ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించే విధంగా కథనం లేకపోవడం దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కథ, మిగితా విభాగాలపై దర్శకుడు పట్టు కోల్పోవడమే సినిమాకు అవరోధంగా మారిందనే భావన కలుగుతుంది. సినిమా మొత్తం రెండు పాత్రల నడుమ సాగడం కొంత అసహనానికి గురిచేస్తుంది. కథలో ట్విస్టులు, ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో సినిమా వేగం తగ్గినట్టు కనిపిస్తుంది.

ఆకట్టుకొన్న తరుణ్

ఆకట్టుకొన్న తరుణ్

కెరీర్ ఆరంభంలో లవర్ బాయ్ ఇమేజ్‌‌ను సొంతం చేసుకొన్న తరుణ్ ఆ తర్వాత వైఫల్యాలు వెంబండించాయి. దాంతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు. తన ఇమేజ్‌కు తగిన కథను ఎంచుకొన్న తరుణ్.. ఈ చిత్రంలో తన టైమింగ్‌తో ఆకట్టుకొన్నాడు. అదరగొట్టే డ్యాన్సులు చేశాడు. కీలక సన్నివేశాల్లో హావభావాలు ప్రదర్శించాడు.

 ఓవియా హెలెన్ గ్లామర్

ఓవియా హెలెన్ గ్లామర్

గ్లామర్ తారగా పేరున్న ఓవియా తన నటనతో కూడా మెప్పించింది. అయితే గ్లామర్‌ను అంతగా పండించకపోవడం, మేకప్, క్యాస్టూమ్ విషయంలో అశ్రద్ధ వహించిందా అనే అనుమానం కలుగుతుంది. గ్లామర్ విషయంలో దృష్టిపెట్టి ఉంటే మాస్ ప్రేక్షకులకు ఓవియా చేరువయ్యేది.

 సినిమాటోగ్రఫీ సూపర్

సినిమాటోగ్రఫీ సూపర్

ఇది నా లవ్‌స్టోరికి ప్రధానమైన బలం సినిమాటోగ్రఫి. క్రిస్టఫర్ జోసెఫ్ సినిమాటోగ్రఫిని అందించారు. అందమైన లొకేషన్లు ఆహ్లాదకరంగా ఉంటాయి. పాటల చిత్రీకరణ బాగున్నది. చాలా సన్నివేశాలలో సహజసిద్ధమైన లైటింగ్‌ను వాడుకోవడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడతుంది.

 శ్రీనాథ్ విజయ్ మ్యూజిక్

శ్రీనాథ్ విజయ్ మ్యూజిక్

ఇది నా లవ్‌స్టోరి సినిమాకు మ్యూజిక్ అదనపు ఆకర్షణ. శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఎడిటింగ్ విభాగానికి చాలా వర్క్ ఉందనడానికి అనవసరపు సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి. ప్రేక్షకులను విసిగిస్తాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ఇది నా లవ్‌స్టోరి సినిమాకు నిర్మాతగా ఎస్‌వీ ప్రకాశ్ వ్యవహరించారు. లోకేషన్లు, సాంకేతిక విభాగాల ఎంపిక నిర్మాణ విలువలకు సాక్ష్యంగా నిలిచాయి. సాంకేతికంగా ఈ సినిమా చాలా రిచ్‌గా కనపడుతుంది.

ఫైనల్‌గా..

ఫైనల్‌గా..

ఇది నా లవ్ స్టోరిలోని మొదటి భాగం చాలా నిస్సారంగా సాగుతుంది. కథలో దమ్ము లేకపోవడం, డైలాగ్స్‌లో అతి సినిమాకు ప్రతికూలంగా కనిపిస్తాయి. ఫీల్‌గుడ్ కథను దర్శకుడు సరైన విధంగా చెప్పలేకపోవడమే ఈ సినిమాకు మైనస్ పాయింట్. సెకండాఫ్‌లో కథలో వేగం ఉండటం ఓ పాజిటివ్ పాయింట్ అని చెప్పవచ్చు. ప్రేమకథా చిత్రాలను ఆదరించే వారికి ఇది నా లవ్ స్టోరి నచ్చే అవకాశం ఉంది.

 బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
తరుణ్, ఓవియా నటన
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
కొంతలో సెకండాఫ్

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

కథ, కథనం, డైలాగ్స్
డైరెక్షన్
ఫస్టాఫ్


తెర ముందు.. తెర వెనుక
నటీనటులు: తరుణ్, ఓవియా హెలెన్ తదితరులు
దర్శకుడు: రమేష్ గోపి
నిర్మాత: ఎస్వీ ప్రకాశ్
సంగీతం: శ్రీనాథ్ విజయ్
సినిమాటోగ్రఫీ: క్రిస్టఫర్ జోసెఫ్
బ్యానర్: రాం ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్: 14 ఫిబ్రవరి 2018

English summary
Idi Naa Love Story is Telugu romantic film, produced by Prakash SV, starring Tarun and Oviya. The film is a remake of the 2013 hit Kannada film, Simple Agi Ondh Love Story. This movie hits theatres on Feb 14th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu