Idly Kadai First Review: ఇడ్లీ కడాయ్ ఫస్ట్ రివ్యూ
టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నిర్మాతగా, దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ఇడ్లీ కడాయ్ (తెలుగులో ఇడ్లీ కొట్టు). వంబర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిత్య మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్ పార్తీబన్, పీ సముద్రఖని, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాను చెన్నైలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన విషయాల్లోకి వెళితే..
ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు కథను కూడా ధనుష్ అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నది.

ఇడ్లీ కొట్టి సినిమా కథ విషయానికి వస్తే.. తన తండ్రి శివనేషన్ (రాజ్ కిరణ్) నిర్వహించే హోటల్‌ను పునరుద్దరించి సవ్యంగా నడుపాలని మురుగన్ (ధనుష్) నిర్ణయం తీసుకొంటాడు. కానీ చిన్న గ్రామంలో ఆ ఇడ్లీ కొట్టును తెరిచి నడిపించడానికి అనేక సమస్యలు, పలు సవాళ్లు ఎదురవుతాయి. మురుగన్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదురించాడు? తండ్రి చిరకాల కోరికను ఎలా తీర్చాడు అనేది సినిమా కథ.
ఇడ్లీ కడాయ్ సినిమా సెన్సార్ క్లియరెన్స్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సినిమాను చూసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాపై, అలాగే చిత్రంలోని సన్నివేశాలపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలు ధనుష్ చిత్రీకరించిన విధానం, వాటిలో ధనుష్ నటించిన తీరుపై వారు ప్రశంసల వర్షం కురిపించారని తెలిసింది. నిర్మాతగా కూడా ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా నిర్మించారు అని సెన్సార్ అధికారులు అభిప్రాయపడ్డారు అని చిత్ర యూనిట్ వెల్లడించింంది.
ఇక ఇడ్లీ కొట్టు సినిమా అందరికి నచ్చే చిత్రం. ఫ్యామిలీ కలిసి చూసే విధంగా, అన్ని వయసుల వారు, అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ఉంది. ఈ సినిమాకు యూ (U) సర్టిఫికెట్ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నిడివి 147 నిమిషాలు అంటే.. 2 గంటల 27 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారు. దాంతో ఈ సినిమా ఎలాంటలి ల్యాగ్ లేకుండా సూటిగా కథ చెప్పేలా ఉండాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.
తన జీవితానికి, హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ సినిమా కథకు సెన్సార్ అధికారులు యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటి వరకు మా సినిమా. ఇక నుంచి ఈ చిత్రం మీదీ అంటూ ధనుష్ ఈ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేశారు. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా చేశారు. ఈ సినిమా థియేటర్‌లో ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్టోరీల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











