Idly Kadai Twitter Review: ఇడ్లీ కొట్టు ట్విట్టర్ మూవీ రివ్యూ
టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నిర్మాతగా, దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ఇడ్లీ కడాయ్ (తెలుగులో ఇడ్లీ కొట్టు). వంబర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిత్య మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్ పార్తీబన్, పీ సముద్రఖని, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాను చెన్నైలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన విషయాల్లోకి వెళితే..
ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు కథను కూడా ధనుష్ అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నది.

ఇడ్లీ కొట్టి సినిమా కథ విషయానికి వస్తే.. తన తండ్రి శివనేషన్ (రాజ్ కిరణ్) నిర్వహించే హోటల్‌ను పునరుద్దరించి సవ్యంగా నడుపాలని మురుగన్ (ధనుష్) నిర్ణయం తీసుకొంటాడు. కానీ చిన్న గ్రామంలో ఆ ఇడ్లీ కొట్టును తెరిచి నడిపించడానికి అనేక సమస్యలు, పలు సవాళ్లు ఎదురవుతాయి. మురుగన్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదురించాడు? తండ్రి చిరకాల కోరికను ఎలా తీర్చాడు అనేది సినిమా కథ.
ఇడ్లీ కడాయ్ సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ యావరేజ్‌గా కూడా లేదు. ధనుష్ యాక్టింగ్ బాగుంది. స్టోరి చాలా స్లోగా సాగుతుంది. స్క్రీన్ ప్లే ఫర్వాలేదనిపిస్తుంది. విజయ్, నిత్యమీనన్ ఫెర్ఫార్మెన్స్ కూడా అంతంతా మాత్రమే గానే ఉంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇడ్లీ కడాయ్ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకొన్నారు. ఈ సినిమాలో ధనుష్, అరుణ్ విజయ్ మధ్య జరిగే యాక్షన్ సీన్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఎమోషనల్, కమర్షియల్ డ్రామా ఉంటుందని ఊహిస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ధనుష్ ట్రాన్స్‌ఫార్మ్ బాగుంటుంది అని 100 శాతం భావిస్తున్నాం. ప్రీ క్లైమాక్స్ సర్‌పైజ్ అదిరిపోతుందని 100 పర్సంట్ గ్యారెంటీ. త్వరలోనే ఈ సినిమా రివ్యూ కోసం వెయిట్ చేయండి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇడ్లీ కడాయ్ సినిమాకు ముందు నా రివ్యూ. ఈ మూవీలో ఎమోషనల్ డ్రామా ఉంటుంది. తప్పకుండా ఫ్యామిలీని రప్పించే కథ ఉంటుంది. సింపుల్ పాయింట్‌తో రిఫ్రెషింగ్ కథ. స్టోగా సాగే కథ. మౌత్ టాక్ బాగుంటే.. సినిమా హిట్ అవుతుంది అని నెటిజన్ పేర్కొన్నాడు.
ఇడ్లీ కడాయ్ సినిమాపై నాకు 100 పాయింట్లకు గాను 80 పాయింట్ల ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ధనుష్ డైరెక్షన్, అరుణ్ విజయ్ విలనిజం, జీవీ ప్రకాశ్ మ్యూజిక్, నిత్య మీనన్‌తో లవ్ ట్రాక్, విలేజ్ డ్రామా ఈ సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నాను అని నెటిజన్ అన్నాడు.
ఇడ్లీ కడాయ్ సినిమా అందర్నీ ఆకట్టుకొంటుందని భావిస్తున్నాను. ఈ సినిమాకు 100 మార్కులకు 100 సాధిస్తుంది. రాజ్ కిరణ్ ప్లాస్ బ్యాక్, ఎమోషనల్ డ్రామా ఆకట్టుకొంటుంది అని నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
ధనుష్ ఇడ్లీ కడాయ్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా పాజిటివ్ పాయింట్స్‌లో జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అరుణ్ విజయ్ సీక్వెన్స్, అలాగే ప్రీ-ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ప్రేక్షకులని థ్రిల్ చేశాయి. కానీ, లవ్ సీన్స్ సరిగా కనెక్ట్ కాకపోవడం, నిత్యామేనన్ పాత్రలోని కొన్ని సన్నివేశాలు క్రింజ్‌గా అనిపించడం మైనస్. ముఖ్యంగా హీరో ధనుష్ పెర్ఫార్మెన్స్ ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.5/5 స్టార్ మాత్రమే ఇచ్చారు.


Click it and Unblock the Notifications











