For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇష్టంగా సినిమా రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 2.75/5

  అర్జున్ రెడ్డి, RX 100 చిత్రాలు యూత్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు ప్రాణం పోశాయి. కంటెంట్‌తో వస్తున్న సినిమాలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఇష్టంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్లు, ట్రైలర్లు సెన్సేషనల్‌గా మారడంతో ఇష్టంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వీ రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు 'ఇష్టంగా' చిత్రాన్ని నిర్మించారు.

  అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటించారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ క‌మెడియ‌న్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషించారు. డిసెంబర్ 28న సినిమా విడుదలైంది. అర్జున్ మహీ, తనిష్క్ రాజన్, దర్శకుడు సంపత్ వీ రుద్రకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  ఇష్టంగా కథ

  ఇష్టంగా కథ

  అమెరికాలో డ్యాన్స్ అకాడమీ, ఐఫాలో ప్రదర్శన ఇవ్వాలనే కోరిక కలిగిన డ్యాన్సర్ కృష్ణ (అర్జున్ మహి). అమ్మాయిలతో జల్సాగా తిరుగుతూ జీవితాన్ని పరిపూర్ణంగా బతికే యువకుడు. అలాంటి లక్షణాలు ఉన్న కృష్ణకు సత్య (తనిష్క్ రాజన్) అనే జర్నలిస్టుతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరవుతారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకొందామని అడిగిన సత్య ప్రపోజల్‌ను కృష్ణ తిరస్కరిస్తాడు. పెళ్లి మీద తనకు నమ్మకం లేదని, సహజీవనమే ఇష్టమని చెబుతాడు. ఆ క్రమంలో వారి మధ్య లవ్ బ్రేక్ అవుతుంది.

  ఇష్టంగా సినిమాలో మలుపులు

  ఇష్టంగా సినిమాలో మలుపులు

  కృష్ణ, సత్య మధ్య విభేదాలు ఎంత వరకు వెళ్లాయి? కృష్ణ సహజీవనం ప్రపోజల్‌ను సత్య అంగీకరించిందా? సహజీవనంలో వారి మధ్య ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? సహజీవనంలో గర్భవతిగా మారిన సత్య పరిస్థితి ఏమైంది? కృష్ణ జీవితంలో ప్రియదర్శి, దువ్వాసి మోహన్ పాత్ర ఏమిటి? యూఎస్‌లో డ్యాన్స్ స్కూల్ పెట్టాలని, ఐఫాలో పెర్ఫార్మ్ చేయాలనే కోరిక నెరవేరిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఇష్టంగా సినిమా కథ.

  ఫస్టాఫ్‌లో

  ఫస్టాఫ్‌లో

  యూత్‌కు నచ్చే రొమాంటిక్ అంశాలతో సినిమా కథ ప్రారంభమవుతుంది. అర్జున్ మహీ, తనిష్క్ రాజన్ మధ్య లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేలా ఉండటంతో సినిమా చకచకా పరుగులు పెడుతుంది. కానీ రొటీన్ సన్నివేశాలు, రెగ్యులర్ కామెడీ కొంత బోర్ కొట్టిస్తుంది. ఓ మంచి పాయింట్‌తో తొలిభాగం ముగుస్తుంది.

  సెకండాఫ్‌లో

  సెకండాఫ్‌లో

  ఇక సెకండాఫ్‌లో కథ, కథనాలు వేగం పుంజుకొంటాయి. ఆసక్తికరమైన అంశాలతో కథలో బలం బయటకు కనిపిస్తుంటుంది. ప్రధానంగా రెండో భాగంలో తల్లి సెంటిమెంట్ భావోద్వేగాన్ని నింపుతుంది. లిప్‌లాక్‌ సన్నివేశాలు యూత్‌ను అలరించేలా ఉంటాయి. క్లైమాక్స్‌లో మాతృత్వం గొప్పతనం, తల్లిగా మారడానికి మహిళలు చేసే త్యాగాలు సినిమాకు హైలెట్‌గా మారాయి.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  సహజీవనం కాన్సెప్ట్‌కు మాతృత్వం అంశాన్ని జోడించడంతోనే దర్శకుడు సంపత్ వీ రుద్రకు తొలి సక్సెస్ లభించిందని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి, RX 100 ప్రభావంతో సినిమాను రొమాంటిక్‌గా మలచడంలో సఫలమయ్యాడని చెప్పవచ్చు. ఇక హీరో అర్జున్ మహీ, హీరోయిన్ తనిష్క్ రాజన్ పాత్రలను మలిచిన తీరు బాగుంది. కామెడీ ట్రాక్‌ను ఆకట్టుకునే విధంగా రూపొందించకపోవడం సినిమాకు కొంత మైనస్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో తనిష్క్ రాజన్ ప్రెగ్నెంట్‌గా మారిన తర్వాత సినిమా మరోస్థాయికి చేరుకొంటుంది. బిడ్డకు జన్మనిచ్చే అంశం, అలాగే మాతృమూర్తిగా మారడానికి మహిళలు కష్టపడే విషయాన్ని హీరో తెలుసుకొనే అంశం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు.

  హీరో అర్జున్ మహీ పెర్ఫార్మెన్స్

  హీరో అర్జున్ మహీ పెర్ఫార్మెన్స్

  ఇక హీరో అర్జున్ మహీ నేటితరం యూత్‌కు ప్రతిబింబంగా కనిపించే యువకుడి పాత్రలో కనిపించాడు. అర్జున్ మహీ బాడీలాంగ్వేజ్ బాగుంది. అలాగే స్క్రీన్ ప్రజెన్స్‌తో బ్రహ్మండంగా ఆకట్టుకొన్నాడు. రొమాంటిక్ సీన్లలో ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ఇంకా యాక్షన్ సీన్లలో అర్జున్ ఫెర్మార్మెన్స్ ఆకట్టుకొంది. అలాగే ఎమోషనల్ సీన్లలో కూడా సూపర్‌గా రాణించాడు. డ్యాన్సర్ పాత్రలో నటించినందున ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పెట్టి ఉంటే క్యారెక్టర్‌కు అదనపు ఆకర్షణగా మారి ఉండేది. తనకు మూడో సినిమా అయినప్పటికీ.. నటనపరంగా ఇంకా కొంత రాటుదేల్సాలి ఉంటుంది.

  తనిష్క్ రాజన్ గ్లామర్

  తనిష్క్ రాజన్ గ్లామర్

  తనిష్క రాజన్‌ అటు నటన పరంగా, గ్లామర్ పరంగా అదరగొట్టింది. రొమాంటిక్ సీన్లను అద్బుతంగా పండించింది. లిప్ లాక్ సన్నివేశాల్లో ఈజ్‌తో నటించింది. ప్రధానంగా సెకండాఫ్‌లో తన పాత్రతో డామినేట్ చేసింది. కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను తానే స్వయంగా భుజానకెత్తుకొని మెప్పించింది. భవిష్యత్‌లో మంచి హీరోయిన్‌గా స్థిరపడే అవకాశం ఉన్నట్టు కనిపించింది.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో ప్రియదర్శి, దువ్వాసి మోహన్ నటించాడు. దువ్వాసి మోహన్ ఆడవేషంలో సన్నివేశం హాస్యాన్ని పండించింది. ప్రియదర్శి రొటీన్ పాత్రలోనే కనిపించాడు. ప్రియదర్శి కొన్ని సీన్లలో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి. తాగుబోతు రమేష్ పాత్ర కూడా రొటీన్‌గా ఉంది.

  మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  యేలేంద్ర మహావీర్ అందించిన సంగీతం బాగుంది. చిరు సెగలో గుండెలో చెలరేగే, నాలే నువ్వే పాటలు బాగున్నాయి. కందికొండ సాహిత్యం బాగుంది. ఆనంద్ నడకట్ల సినిమాటోగ్రఫి బాగుంది. గోవా సన్నివేశాలను బాగా చిత్రీకరించాడు. యాక్షన్ సీన్ల షూట్ బాగుంది.

  ఎడిటింగ్ గురించి

  ఎడిటింగ్ గురించి

  బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. కథ వేగాన్ని పెంచే విధంగా చేసిన ఎడిటింగ్ పనితీరు నాగేశ్వర్ రెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. షావలిన్' మల్లేష్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. శ్రీనాథ్ అందించిన మాటలు సందర్భోచితంగా ఆకట్టుకొన్నాయి.

  ప్రొడక్షన్ వాల్యూస్

  ప్రొడక్షన్ వాల్యూస్

  నిర్మాత అడ్డూరి వేంకటేశ్వరరావు అనుసరించిన సినీ నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక సినిమా క్వాలిటీని పెంచాయి. అలాగే లోకేషన్ల ఎంపిక కూడా సినిమాకు మరింత గ్లామర్ తెచ్చిపెట్టాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఇష్టంగా సినిమా మాతృత్వపు విలువను, మహిళల త్యాగాలను చాటిచెప్పే చిత్రం. కాకపోతే యూత్‌ను టార్గెట్‌గా చేయడమే ప్రధానమైన దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. ఈ జనరేషన్ టేస్ట్‌కు తగిన సినిమా అని చెప్పవచ్చు. మౌత్ పబ్లిసిటీ, ప్రమోషన్‌ను బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  కథ, కథనాలు
  హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ
  హీరో స్క్రీన్ ప్రజెన్స్
  హీరోయిన్ గ్లామర్
  మ్యూజిక్
  సినిమాటోగ్రఫి
  సెకండాఫ్

  మైనస్ పాయింట్స్ః
  ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ .వి.రుద్ర‌
  నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు
  రచన సహకారం: చిట్టి శర్మ
  సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్
  సంగీతం: యేలేంద్ర మహావీర్
  ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
  మాటలు: శ్రీనాధ్ బాదినేని
  పాటలు: కందికొండ, రంబాబు గోశాల, అలరాజు
  ఆర్ట్: విజయ్ కృష్ణ
  ఫైట్స్: షావలిన్' మల్లేష్
  పి.ఆర్.ఓ: సాయి సతీష్
  బ్యానర్: ఎ.వి.ఆర్ మూవీ వండర్స్
  రిలీజ్: 2018-12-28

  English summary
  Ishtangaa movie is a cute love story with living relationship story. Arjun Mahi, Tanishq Rajan are lead pair. Sampath V rudra is the director. This movie set to release on December 28th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X