»   » ఇలాంటి నిధి వేటలు చాలా చూసాంగా!! (జాకీ ఛాన్ ‘కుంగ్‌ ఫు యోగా’రివ్యూ)

ఇలాంటి నిధి వేటలు చాలా చూసాంగా!! (జాకీ ఛాన్ ‘కుంగ్‌ ఫు యోగా’రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

జాకీ ఛాన్‌ పేరు వినగానే ... కుంగ్‌ ఫుతో ఆయన చేసే ఫైట్లు,కామెడీ సీన్స్ మనందరికీ గుర్తొస్తాయి. అందుకే ఇక్కడ మన దేశంలోనూ ఆయన వీరాభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలకు వీర డిమాండ్ ఉంది. ఆ విషయం ఆయన గమనించి, క్యాష్ చేసుకోవాలని బావించి, డైరక్ట్ గా ఇండియన్ నటీనటులను తోడేసుకుని మన దేశ లొకేషన్స్ లోనే ఓ సినిమాని తీసి వదిలేసారు.

మన దేశ నటులతో కలసి ఓ సినిమా చేయడం, భారతదేశ నేపథ్యంలో జరిగే ఓ కథతో అది తెరకెక్కడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిచ్చింది. దానికి తోడు చైనీస్‌, భారతీయ సంస్కృతులను ప్రతిబింబించేలా ఆ చిత్రానికి 'కుంగ్‌ ఫు యోగా' అని టైటిల్ కూడా పెట్టారు. ఈ చిత్రంలో కొన్ని కీ సీన్స్ ని భారత్‌లోనే చిత్రీకరించడం.. ఓ బాలీవుడ్‌ టైపు సాంగ్ లో జాకీచాన్‌ స్టెప్పులేశాడనే వార్తలు రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.


మరో ప్రక్క ఈ చిత్రంలో జాకీ చాన్‌తో పాటు మన తెలుగు సినిమాల్లో విలన్ గా చేసిన సోనూ సూద్‌ కనిపించటంతో తెలుగు వాళ్లలోనూ ఇంట్రస్ట్ పెరిగింది. ఇలా ఆసక్తి, అంచనాలు కలబోతగా మన ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది. అసలు ఈ చిత్రం కథేంటి..కుంగుఫూకి,యోగాకి ఎలా ముడిపెట్టారు ...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

హెల్ప్ అడిగితే జాకీఛాన్ ..

హెల్ప్ అడిగితే జాకీఛాన్ ..

ఇండియానా జోన్స్ ను గుర్తు చేసే ఈ చిత్రం కథలో చైనా పురాతత్వ శాస్త్ర ప్రొఫెసర్‌ జాక్‌ గా జాకీచాన్‌ కనిపిస్తారు. ఆయన్ను భారత్‌కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త అష్మిత (దిశాపటానీ) రాజస్దాన్ లోని తమ పూర్వీకులకు చెందిన సంపదను కనుగొనేందుకు హెల్ప్ అడుగుతుంది.

నిధిని వెతుక్కుంటూ..

నిధిని వెతుక్కుంటూ..

అష్మిత మాటలతో ...భారతదేశంలో మగధ సామ్రాజ్య కాలం నాటి ఓ విలువైన నిధి గురించి అతనికి తెలుస్తుంది. అష్మిత ఆహ్వానం మేరకు ఆ నిథిని వెతుక్కుంటూ.... తన అసెస్టెంట్స్ జు(యిజింగ్ జాంగ్), నువోమిన్( మియా ముఖి)లతో కలిసి ఇండియాకు వస్తాడు జాకీచాన్.

విలన్ ఎంట్రీ

విలన్ ఎంట్రీ

ఇక్కడికి వచ్చాక అస్మిత(దిశా పటానీ) సహాయంతో నిధికి వెతుకుతుంటాడు జాక్‌. ఈ క్రమంలో మగధ రాజుల కాలంలో ఆ నిధిని తీసుకెళ్లిపోయిన తిరుగుబాటు దళ సభ్యుల అవశేషాలు ఓ మంచు గుహలో దొరుకుతాయి. ఆ దళ నాయకుడి వారసుడు రాన్‌డల్‌(సోనూసూద్‌) గురించి వారికి తెలుస్తుంది.

విలన్ కీ నిధే కావాలి

విలన్ కీ నిధే కావాలి

విలన్ ...రాన్ డల్ (సోనూ సూద్ )...ఇదే నిథిని కనుగొనేందుకు పోటీపడుతుంటాడు. కంప్యూటర్ యానిమేటెడ్ యానిమల్స్, ఖరీదైన మోడర్న్ కారులు కలిగివున్న ర్యాండల్.. తనకున్న 12 మంది అనుచరగణం సహాయంతో తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి ఎలాగైనా ఆ సంపదను సొంతం చేసుకోవాలని కుట్ర పన్నుతాడు.

నిథి కావాలంటే వజ్రం లింక్

నిథి కావాలంటే వజ్రం లింక్

అయితే ఓ దశలో .. సోనూసూద్ , జాకీ ఛాన్ తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. సోనూని కలిశాక ఆ నిధిని తెరవడానికి అవసరమైన ఓ వజ్రాన్ని దుబాయిలో వేలం వేస్తున్నారని తెలుస్తుంది. మరి వారు ఆ వజ్రాన్ని దక్కించుకున్నారా? ఆ నిధి వారి సొంతమైందా? కైరా(దిశా పటానీ)కు, ఈ కథకు సంబంధమేంటి అన్నది తెరపై చూడాలి.

కాంబినేషన్ అదే..

కాంబినేషన్ అదే..

జాకీ చాన్‌, ప్రముఖ చైనా దర్శకుడు స్టాన్‌లీ టాంగ్‌ కాంబినేషన్‌లో రూపొందిన "రంబుల్‌ ఇన్‌ ది బ్రాంక్స్‌", "ది మిత్‌", "చైనీస్‌ జోడియాక్‌" వంటి చిత్రాలు రూపొందాయి. ఈ చిత్రాలు అన్నిటికీ ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా "కుంగ్ ఫు యోగా" ని నిర్మించారు చిత్ర నిర్మాతలు. అయితే వారికి కథే కలిసి రాలేదు.

ఎక్సపెక్టే,షన్ కు తగ్గట్లుగా..

ఎక్సపెక్టే,షన్ కు తగ్గట్లుగా..

సినిమాలో ...జాకీ చాన్ పాత్ర ను చాలా బాగా తీర్చిదిద్దారు. ఫైట్స్ ....మరియు నిధి ని చేదించే క్రమంలో ప్రధాన పాత్రధారులు చూపిన నైపుణ్యం ఆశ్చర్యపరిచేలా డిజైన్ చేసారు. అయితే మనం రెగ్యులర్ గా జాకి చాన్ నుంచి ఎక్సెపెక్ట్ చేసే స్దాయి కామెడీ, విన్యాసాలు కనపడలేదు.

ఫైట్స్ ఏవి..

ఫైట్స్ ఏవి..

ముఖ్యంగా జాకీచాన్‌ సినిమాలంటే యాక్షన్‌ సన్నివేశాలే గుర్తొస్తాయి. అయితే ఇందులో జాకీచాన్‌ మార్క్‌ కుంగ్‌ ఫు ఫైట్లు పెద్దగా కనిపించవు. అలాగే ‘కుంగ్‌ ఫు యోగా' అనే పేరు కూడా కేవలం ప్రమోషన్‌ గురించే పెట్టారా అనే డౌట్ వస్తుంది.

అలా యోగానివాడారు

అలా యోగానివాడారు

అయితే.. నీటిలో వాయుదిగ్బంధన యోగా ప్రక్రియ వంటి అంశాలను బాగా తెరకెక్కించారు దర్శకులు. సినిమా లో ని ఫస్టాఫ్ చాలా వరకు చైనా దేశం లోనే జరుగుతుంది కనుక ఆ దేశం లోని లొకేషన్లను తెరపై బాగా చూపించే ప్రయత్నం చేసారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత దుబాయ్ లో తీసిన చేజింగ్ సీన్స్ కూడా బాగున్నాయి.

హెలెట్స్ ఇవే..

హెలెట్స్ ఇవే..

కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసిన కొన్ని సీన్స్ బాగున్నాయి. చిత్ర సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్టాఫే బాగుందనిపిస్తుంది. మొదటి భాగం లో దుబాయ్ లో జరిగిన సన్నివేశాలు, రెండో భాగం లో ఇండియా లో నిధిని వెతికే క్లైమాక్స్ సీన్స్ బాగుండడం కొద్దిలో కొద్ది కలిసొచ్చే అంశం.

సింహంతో కామెడీ కేక

సింహంతో కామెడీ కేక

లొకేషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రిచ్‌ లుక్‌ కనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం అనవసరపు పాటలు, రొమాంటిక్‌ సన్నివేశాలను కలపలేదు. ఫస్టాఫ్ లో వచ్చే కార్‌ రేస్‌ ఆకట్టుకుంటుంది. అందులో సింహంతో కలిసి ఒకే కారులో కలిసి ప్రయాణించే సన్నివేశంలో జాక్‌ నటన కడుపుబ్బ నవ్విస్తుంది.

కొద్ది నిముషాల్లోనే

కొద్ది నిముషాల్లోనే

స్క్రీన్ ప్లే లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఇంట్రస్టింగ్ గా కథనాన్ని అందించడం లో దర్శకుడు విఫలమయ్యాడు అని చెప్పొచ్చు. సినిమా మొదలయిన కొద్ది నిమిషాల్లోనే మనకి అనేక విషయాలు గురించి చెప్తూ అర్ధం చేసుకొనే సమయం కూడా లేకుండా చేసి, కన్ఫూజ్ చేస్తాడు దర్శకుడు.

అరవై సంవత్సరాలు దాటిన

అరవై సంవత్సరాలు దాటిన

అయితే అరవై సంవత్సరాలు దాటిన ఈ వయస్సులోనూ జాకీచాన్‌ చలాకీగా కనిపించటం మచ్చటేస్తుంది. ప్రతిసారీ కుంగ్‌ ఫు ఫైట్లతో అలరించే జాకీ.. ఈ సారి బాలీవుడ్‌ తరహా స్టెప్పులేసి ఆకట్టుకోవటం మరో హైలెట్ . అందులోనూ సోనూసూద్‌తో కలసి జాకీచాన్‌ హుషారుగా డ్యాన్సులేశారు. ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.నెగటివ్‌ పాత్రలో సోనూసూద్‌ మనకు అలవాటైపోవటం వల్ల కొత్తగా అనిపించదు. దిశా పటానీ అందంగా కనిపించింది. తన పరిధి మేరకు నటించింది. అమైరా దస్తర్‌ పాత్ర కేవలం కామెడీకే పరిమితమైంది.

rn

ఈ సినిమా ట్రైలర్

జాకీచాన్‌తోపాటు బాలీవుడ్‌ నటులు సోనూసూద్‌, దిశాపటానీ, అమైరా దస్తూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుంగ్‌ ఫు యోగా'. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇక్కడ చూడండి

ఈ చిత్రం టీమ్ వీళ్లే

ఈ చిత్రం టీమ్ వీళ్లే

నిర్మాణ సంస్థ: తైహే ఎంటర్టైన్మెంట్స్, షైన్వర్క్ పిక్చర్స్
నటీనటులు: జాకీచాన్‌.. సోనూసూద్‌.. దిశాపటానీ.. అమైరా దస్తర్‌ తదితరులు
సంగీతం: నాథన్‌ వాంగ్‌.. కోమల్‌-శివన్‌
కథ.. దర్శకత్వం: స్టాన్లీ టాంగ్‌
నిర్మాత: బారిబీ టంగ్‌
విడుదల తేదీ: 03-02-2017

ఇండియానా జోన్స్ సినిమాను జాకీఛాన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం, అలాగే నిధి వేట సినిమాలు ఈ మధ్యన రావటం లేదు... చూసి చాలా కాలం అయ్యిందిగా ..అనుకునే వాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్. మిగతావాళ్ళకు కష్టమే.

English summary
Kung Fu Yoga is a disappointment for Jackie Chan fans. The actor deserves better, and so do we. I’m going with two out of five.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu