»   » జై లవకుశ మూవీ రివ్యూ: ఎన్టీవోడు.. ఏం చె.. చె.. చేశాడురా!

జై లవకుశ మూవీ రివ్యూ: ఎన్టీవోడు.. ఏం చె.. చె.. చేశాడురా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa Public Talk
Rating:
3.0/5

టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకులకు ఓ ప్రయోగశాల. ఇటీవల కాలంలో పలువురు ఎన్టీఆర్ స్టామినాకు తగినట్టు కథలు అల్లుకొని ప్రేక్షకులను మెప్పించారు. అందుకు సాక్ష్యంగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. కళ్లు చెదిరే విధంగా ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాను పరిశ్రమకు పరిచయం చేశాయి. దాంతో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.


ఈ నేపథ్యంలో రావణుడి పాత్రను ప్రధానంగా చేసుకొని దర్శకుడు బాబీ అల్లుకొన్న కథాచిత్రం జై లవకుశ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. టీజర్లు, ఫస్ట్‌లుక్ రికార్డుల దుమ్ము దులిపాయి. అలా రావణ (జై) పాత్రపై ఊహించని అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అలా రూపుదిద్దుకొన్న జై లవకుశ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ వచ్చిన జై పాత్ర ప్రేక్షకులను మెప్పించిదా? బాబీ అల్లుకొన్న కథ ఎన్టీఆర్‌కు మరో విజయాన్ని అందించిందా? రాశీఖన్నా, నివేదా థామస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నారా అనే విషయాలను తెలుసుకోవాలంటే కథ ఏమిటో తెలుసుకోవాల్సిందే.

కథ ఏంటంటే..

కథ ఏంటంటే..

జై, లవ, కుశ (ఎన్టీఆర్) ముగ్గురు కవలలు. నాటకాలు వేయడం అంటే ముగ్గురికి ప్రాణం. తన మేనమామ (పోసాని కృష్ణమురళి) నేతృత్వంలో నాటకాలు ఆడుతుంటారు. అయితే జైకి పుట్టుకతోనే నత్తి. నత్తి కారణంగా జైని తన మేనమామ తొక్కేస్తాడు. తనకు గుర్తింపు లేకుండా పోవడంతో తన సోదరులు లవ, కుశలపై కోపం పెంచుకొంటారు ఓ నాటకం ప్రదర్శిస్తుండగా వారిని చంపడానికి సిలెండర్ పేల్చుతాడు. ఆ ఘటన వల్ల ముగ్గురు సోదరులు విడిపోతారు. వారు అలా వేర్వేరు ప్రదేశాల్లోపెరిగి పెద్దవుతారు. లవ బ్యాంక్ ఆఫీసర్‌గా, కుశ చిల్లర దొంగగా మారుతారు. ఆ క్రమంలో కష్టాల్లో ఉన్న లవ, కుశ ఓ ప్రమాదం సందర్భంగా కలుసుకొంటారు.


కష్టాల్లో ఉన్న లవ, కుశలు కిడ్నాప్

కష్టాల్లో ఉన్న లవ, కుశలు కిడ్నాప్

మంచితనం ఎక్కువగా ఉండే లవ అడిగిన వారందరికీ అప్పులు ఇచ్చి ఇబ్బందుల్లో కూరుకుంటాడు. దొంగతనాలు చేసి డబ్బు సంపాదించి అమెరికాకు వెళ్లాలన్న ప్రయత్నానికి నోట్ల రద్దు గండికొడుతుంది. తమ్ముడిని మోసగించి డబ్బు కొట్టేయాలను ప్లాన్ చేసి సక్సెస్ అవుతాడు. కానీ చివరి క్షణంలో డబ్బు మాయం అవుతుంది. అలా కథ నడుస్తున్న క్రమంలో ప్రియ (రాశిఖన్నా)తో లవ ప్రేమలో పడుతాడు. పెళ్లి చేసుకొందామనే క్రమంలో ప్రియ అదృశ్యమవుతుంది. లవకు తమ్ముడు కుశుడి మీద, కుశుడికి అన్న లవ మీద అనుమానం కలుగుతుంది. కానీ వారిద్దరూ తప్పు చేయలేదని గ్రహిస్తారు. తన మాదిరిగానే ఉండే వ్యక్తి తన ప్రియను ఎత్తుకెళ్లి ఉంటారని గ్రహిస్తారు. అంటే తమ అన్న ఇంకా బతికి ఉన్నాడనే నమ్మకం కలిగిన నేపథ్యంలో జై క్యారక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అంతలోనే లవ, కుశలను జై కిడ్నాప్ చేస్తాడు.


గుర్తింపు కోసం జై దుస్సాహసం..

గుర్తింపు కోసం జై దుస్సాహసం..

చిన్నతనంలో తనకు గుర్తింపు లేకుండా చేసిన తమ్ముళ్లపై జై కక్ష పెంచుకొంటాడు. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యానికి సహకరించాలని వారిని జై ఆదేశిస్తాడు. సొంత సోదరులను, ప్రియను జై ఎందుకు కిడ్నాప్ చేశాడు. జై లక్ష్యం ఏమిటి? అన్నయ్య లక్ష్యానికి తమ్ముళ్లు చేసిన ఎలాంటి సహకారం అందించారు. తమ్ముళ్లు, మేనమామ వివక్ష కారణంగా రావణుడిగా మారిన జై మళ్లీ మంచి వాడు అవుతాడా? రావణుడిగా మారిన తన అన్నను రాముడిగా మార్చాలన్న లవ, కుశల ప్రయత్నం ఫలించిందా? రావణుడు మళ్లీ రాముడిగా మారాడా? ముగ్గురు అన్నదమ్ములు ఒక్కటవుతారా? ప్రియతో లవ్ పెళ్లి అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే జై లవకుశ.


తొలిభాగం ఇలా..

తొలిభాగం ఇలా..

జై లవకుశ సినిమా తెనాలి నాటక సంఘం ప్రదర్శించే రామాయణం నాటికతో ప్రారంభమవుతుంది. కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడానికి ఈ ఘట్టం అద్భుతంగా సహకారం అందించింది. ప్రథమార్థంలో లవ, కుశ పాత్రలతో సరదాగా సినిమా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు ఫైట్‌తో జై పాత్ర పరిచయం కావడంతో థియేటర్లో అలజడి మొదలవుతుంది. ఇంట్రడక్షన్ సీన్‌లోనే జై పాత్ర డెప్త్ ఏంటో దర్శకుడు బాబీ చెప్పేశాడు.


రెండో భాగంలో..

రెండో భాగంలో..

జై పాత్ర ఏంటి? జైలో దుష్ణ రావణుడు ఎలా ఉంటాడు. అతని నేర సామ్రాజ్యం ఏమిటీ అనే కథాంశంతో ముందుకెళ్తుతుంది. తన లక్ష్యం దిశగా తమ్ముళ్లను వాడుకోవాలనుకునే పాయింట్‌తో కథ కొత్త మలుపు తిరుగుతుంది.


బాల్యంలో జై రావణుడిగా మారే తీరును.. అలాగే పెద్దయ్యాక సోదరుల ప్రేమకు కరిగిపోయి రావణుడు రాముడిగా మారే విధానాన్ని బాబీ చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌ను బాగా దట్టించాడు. చివరి పది నిమిషాల్లో జై పాత్రలో ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంటుంది. రెంబో భాగంలో అన్నదమ్ముల మధ్య బంధాలను మళ్లీ పునరుద్ధరించాడానికి వేసిన నాటకం హైలెట్‌గా నిలుస్తుంది. చిత్ర ద్వితీయార్థంలో కథా వేగం కొంత మందగించినట్టు.. సినిమాను ఏదో చుట్టేసినట్టు అనిపిస్తుంది. చివర్లో అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్‌ను దర్శకుడు బాబీ తెరకెక్కించిన విధానాన్ని అభినందించకుండా ఉండలేం. రెండో భాగంలో రాశీఖన్నా, నివేదా గ్లామర్‌తోపాటు తమన్నా ఐటెంసాంగ్ ప్రేక్షకులను ఉత్తేజానికి గురిచేస్తాయి. చివర్లో ఎమోషనల్ ముగింపుతో జై లవకుశను ముగించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది.


ఎన్టీఆర్ నట విశ్వరూపం

ఎన్టీఆర్ నట విశ్వరూపం

జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడు. కథలో ఉన్న కొన్ని లోపాలను తన యాక్టింగ్‌తో సరిదిద్దాడు. జై పాత్రలో దుష్ణుడిగా, లవ పాత్రలో లవర్ బాయ్‌గా, కుశుడు పాత్రలో చిల్లర దొంగ మూడు విభిన్నపాత్రలతో ఆకట్టుకొన్నాడు. గతంలో ఇలాంటి పాత్రలను వేర్వేరు సినిమాల్లో చేసినప్పటికీ.. అవన్నీ మళ్లీ జై లవకుశలో మరోసారి రుచి చూపించాడు. ఎన్టీఆర్ తన కెరీర్‌లో వైవిధ్యమున్న పాత్రలతో మరోసారి ఆకట్టుకొన్నాడు. నటనపరంగా జై లవకుశ చిత్రం ఎన్టీఆర్ ఓ మైలురాయిగా నిలుస్తుంది. చిన్నతనంలో కుటుంబ సభ్యుల వివిక్షకు గురైన జై పాత్రను ఎన్టీఆర్ అద్భుతంగా పోషించాడు. ఈ చిత్రానికి జై పాత్ర ప్రాణం పోసింది.


దర్శకుడి ప్రతిభ..

దర్శకుడి ప్రతిభ..

మాస్ హీరోగానే కాకుండా, అద్భుత నటనా ప్రతిభ ఉన్న ఎన్టీఆర్‌ను ఊహించుకొని దర్శకుడు బాబీ అల్లుకొన్న కథ ప్రశంసనీయం. మూడు పాత్రల మధ్య సన్నివేశాలతోపాటు కథను నడిపించే తీరులోనే ఎక్కడా తడబాటుకు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో బాబీ సఫలమయ్యాడు. అందుకు రచయితలు కోన వెంకట్, చక్రవర్తిల స్క్రీన్ ప్లే సహకారం చక్కగా కుదిరింది. ఎన్టీఆర్ లాంటి నటుడితో కళాత్మక చిత్రం తీయలేం కాదా. అందుకే పక్కా కమర్షియల్ ఫార్ములాతో తారక్ బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా కథను అల్లుకొన్నాడు. ప్రేక్షకులకు కావాల్సిన డైలాగ్స్‌ను ఎన్టీఆర్ నోట బాగా పలికించాడు.


దేవీ శ్రీ ప్రసాద్ మ్యాజిక్

దేవీ శ్రీ ప్రసాద్ మ్యాజిక్

దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యాజిక్ సంగీత ప్రియులను ఆకట్టుకొన్నది. అసుర.. అసుర.. రావణ అంటూ సాగే పాటను, నీ కళ్లలోన, దోచేస్తా అనే పాటలకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. ట్రింగ్.. ట్రింగ్ అనే పాటకు, స్వింగ్ జరా అనే ఐటెమ్ సాంగ్‌ను రచయిత రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటల్లో అసుర, ట్రింగ్ ట్రింగ్, స్వింగ్ జరా జనాదరణ పొందాయి. వీటిని తెరమీద సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు అద్భుతంగా ఆవిష్కరించారు.


గ్లామర్ పంచడానికే..

గ్లామర్ పంచడానికే..

రాశీఖన్నా, నివేదా థామస్ పాత్రల పరిధి చాలా తక్కువ. సినిమా అంతా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేయడంతో వారు సపోర్టింగ్ క్యారెక్టర్లుగానే కనిపిస్తారు. పాటల సమయంలో వచ్చి హల్‌చల్ చేసి పోవడం తప్పా.. నటనపరంగా వారు పెద్దగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడదు. వారు గ్లామర్‌ను పంచడానికే పనికివచ్చారు.


ఐటెంగా ఇరుగదీసిన తమన్నా

ఐటెంగా ఇరుగదీసిన తమన్నా

ఇటీవల కాలంలో ఐటెం సాంగులతో మిల్కి బ్యూటీ తమన్నా భాటియా తెర మీద అదరగొట్టేస్తున్నది. ఈ చిత్రంలో స్వింగ్ జరా పాటలో తమన్నా యదేచ్చగా అందాలను ఆరబోసింది. పాటలో అదరగొట్టే స్టెప్పులతో ఊపు తెచ్చింది. సాంగ్‌లో ఎన్టీఆర్ చేసిన తాండవానికి తమన్నా మంచి జోష్ తెచ్చింది. ఈ సినిమాకు తమన్నా పాట పైసా వసూల్.


చోటా పనితీరు బాగుంది..

చోటా పనితీరు బాగుంది..

సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు పనితీరు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఎన్టీఆర్‌ను శక్తిమంతంగా చూపించడంలో చోటా తన ప్రతిభకు సానపెట్టాడు. అలాగే రాశీఖన్నా, నివేదా థామస్, తమన్నా అందాలను కెమెరాలో చాలా అందంగా ఒడిసిపట్టుకొన్నాడు. ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు, బిల్డప్ షాట్స్ తీసిన తీరు ప్రేక్షకుల్లో ఓ ఉత్సాహానికి గురిచేస్తాయి.


ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు

ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు

పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడానికి నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ పెట్టిన ప్రతీపైసాకు విలువ తెరమీద కనిపిస్తుంది. నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో మైలురాయిగా నిలిచే చితంగా జై లవకుశ మిగిలిపోతుంది. పరిశ్రమలో నందమూరి ముద్ర కనిపించేందుకు ఈ చిత్రం దోహదపడుతుంది.


చివరగా

చివరగా

మాస్ హీరోగా ఎన్టీఆర్‌కు ఓ క్రేజ్ ఉంది. డైలాగ్స్ చెప్పడంలో తారక్‌ది విభిన్నమైన శైలి. డాన్యుల్లోనూ ప్రత్యేకమైన శైలి. ప్రేక్షకులు, అభిమానులు ఎన్టీఆర్‌ను ఇలాంటి అంశాలను చూడాలనుకొంటారు. అలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం జై లవకుశ. ఇటీవల కాలంలో ఒక్క పాత్రను చేసి మెప్పించడమే హీరోలకు కష్టంగా మారుతున్నది. అలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాను మూడు పాత్రలతో భుజాన మోశాడు. ఈ చిత్రం క్యాటగిరిలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమే కాకుండా.. భారీ కలెక్షన్లను కొల్లగొట్టే చిత్రంగా నిలువడం ఖాయం. ఈ సినిమా రేంజ్ ఏంటో రెండు, మూడు రోజులు ఆగితే అర్థమవ్వడం ఖాయం.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
1. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం.. యాక్టింగ్
2. రాశీ ఖన్నా, నివేదా, తమన్నా గ్లామర్
3. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫి
4. కల్యాణ్ రామ్ నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లో కొన్ని నిమిషాలు
కథలో పెద్దగా పట్టించుకొని లోపాలు


తెర ముందు.. తెర వెనుక

తెర ముందు.. తెర వెనుక

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, తమన్నా, హంసానందిని, పోసారి కృష్ణమురళి, బ్రహ్మాజీ, సాయికుమార్ తదితరులు.


దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత: నందమూరి కల్యాణ్ రామ్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే: బాబీ, కోన వెంకట్, చక్రవర్తి
సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 21 సెప్టెంబర్ 2017.


English summary
Young Tiger Junior NTR's Jai Lava Kusa is releasing between huge expectations. Lead heroines are Raashi Khanna and Niveda Thomas. This movie which produced by NTR Arts banner, is going to release in 2400 screens worldwide. Specially in Hyderabad, This movie releasing in hyderabad over 100 screens is record.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu