»   » ఐశ్వర్య రాయ్ అదరగొట్టింది (జజ్బా మూవీ రివ్యూ)

ఐశ్వర్య రాయ్ అదరగొట్టింది (జజ్బా మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

ముంబై: ఈ సంవత్సరం చర్చనీయాంశం అయిన చిత్రాల్లో ఐశ్వర్య రాయ్ నటించిన జజ్బా చిత్రం ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఐష్ దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో సినిమా కావడంతో ఇటు అభిమానుల్లో, అటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆల్రెడీ ఓ బిడ్డకు తల్లి అయిన ఐష్... ఈ సినిమాలో కూడా పాపకు తల్లిగా నటించింది. మరి ఈ సినిమా విశేషాలు ఏమిటనేది రివ్యూలో చూద్దాం...

సింగిల్ మదర్ అనురారాధ వర్మ (ఐశ్వర్యరాయ్)కి సనాయా (అసారా అర్జున్) అనే పాప. ప్రొఫెషనల్ గా ఆమె సక్సెస్ ఫుల్ క్రిమినల్ లాయర్. ఓ రోజు అనురాధ వర్మ కూతురు సనాయా కిడ్నాప్ కు గురవుతుంది. పాపను విడిచిపెట్టాలంటే... రేపిస్టు, హంతుకుడు అయిన మియాజ్ షేక్(చందన్ రాయ్ సన్యాల్)ను నాలుగు రోజుల్లో జైలు నుండి బయటకు తీసుకురావాలని బెదిరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిజాయితీగల లాయర్ గా.... ఓ వైపు నిస్సహాయురాలైన తల్లిగా ఆమె ఈ పరిస్థితిని ఎలా ఫేస్ చేసింది అనేది తెరపై చూడాల్సిందే.

Jazbaa Movie Review

తన కూతురును రక్షించుకోవడంలో ఆమెకు తన బెస్ట్ ఫ్రెండ్, ఇన్స్ స్పెక్టర్ యోహాన్ (ఇర్ఫాన్ ఖాన్) సహకరిస్తాడు. అప్పటికే అతను సస్పెన్షన్ లో ఉంటాడు. అయితే తన వల్ల అయిన సహాయం చేస్తాడు. ఈ క్రమంలో వీరు హియాజ్ షేక్ వల్ల హత్యకు, అత్యాచారినికి గురైన బాధితురాలి తల్లి(షబానా అజ్మి)ని కలుస్తారు. మరిన్ని వివరాలు సేకరిస్తారు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది.

ఐశ్వర్యారాయ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. ఐదేళ్ల తర్వాత మళ్లీ తెర ముందుకు వచ్చినా ఆమె నటనలో ఏ మాత్రం పదును తగ్గ లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఐష్ పోషించిన క్రిమినల్ లాయర్ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇర్ఫాన్ ఖాన్ తనదైన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. షబానా అజ్మీ, జాకీష్రాఫ్, సిద్ధాంత్ కపూర్ తమ తమ పాత్రల్లో ఎఫెక్టివ్ గా నటించారు.

Jazbaa Movie Review

సినిమాలోని పాటలు కూడా స్టోరీకి సింక్ అయ్యే విధంగా ఉన్నాయి. రాబిన్ భట్, కమలేష్ పాండే రాసిన డైలాగులు స్టోరీకి మరింత వెన్నె తెచ్చే విధంగా, ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఇతర టెక్నికల్ విభాగాలు మంచి పనితనం కనబర్చాయి.

సినిమా స్టోరీ యూనిక్ గా ఉంది. అయితే కథ ఈ విషయంలో దర్శకుడికి పెద్దగా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొరియన్ ఫిల్మ్ ‘సెవెన్ డేస్' చిత్రానికి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. అయితే ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా దర్శకుడు సినిమాను తెరకెక్కించడంలో సఫలం అయ్యాడు. అయితే ఎమోషన్ సీన్స్ కాస్త ఓవర్ గానే చూపించారని చెప్పొచ్చు. క్లైమాక్స్ బావుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే.... ఐశ్వర్యరాయ్ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ వీకెండ్ ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్ మూవీని ఎంజాయ్ చేసేందుకు ‘జజ్బా' ఒక మంచి ఆప్షన్.

English summary
Jazbaa starring Aishwarya Rai Bachchan was one of the most talked about film this year! The film not only gained attention owing to Aishwarya Rai Bachchan making a comeback to silver screen after a gap of 5 years but the fact that she chose a rather realistic role of a mother caught the peoples' attention. Now is Jazbaa the kind of movie we are expecting it to be? Read to find out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu