For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శృంగార ప్రియులకు నిరాశే.. (జిస్మ్-2 రివ్యూ)

  By Bojja Kumar
  |

  నిజ జీవితంలో పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ జిస్మ్-2లోనూ నిజ జీవిత పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లలో సన్నీ లియోన్ అందాల ఆరబోత, ఘాటైన ముద్దు సన్ని వేశాలు, అర్ధనగ్న సీన్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. శృంగార ప్రియులంతా సినిమాలో తమకు కావాల్సిన మసాలా బాగానే ఉంటుందని ఆశ పడ్డారు. నీలి చిత్రాల తారకాబట్టి సినిమాలో శృంగారం పండించే సీన్లలో ఇరగదీస్తుంది భావించారు. మరి సినిమాలో విషయం ఏమైనా ఉందా..? చెక్ ఔట్ ది రివ్యూ...

  ఇజ్న (సన్నీ లియోన్) ఒక నీలిచి చితరాల తార. కబీర్ విల్సన్ (రణదీప్ హుడా)ను ప్రేమించిన ఇజ్న అతని చేతిలో మోస పోతుంది. తన మోసపోయాననే విషయం తట్టుకోలేక ఇజ్న చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఇంటలిజెన్స్ ఏజెంట్ అయాన్ ఠాకూర్ (అరుణోదయ్ సింగ్) ఆమెను చనిపోకుండా నిలువరించి చని పోయే బదులు దేశం కోసం పని చెయ్యమని కోరుతాడు. తనకు ఇష్టం లేక పోయినా అయాన్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకుంటుంది. వీరు ఇద్దరు కలిసి కబీర్ ని చంపడానికి ప్లాన్ చేస్తారు. మరి కబీర్ ఎవరు? అయాన్ అతన్ని చంపడానికి ఎందుకు ప్లాన్ చేశాడు? మరి ఇజ్న చివరకు ఏం చేసింది? అనేది తర్వాతి కథ.

  సన్నీ లియోన్ కేవలం సెక్స్ చిత్రాలు చేయడానికే తప్ప మామూలు సినిమాల్లో నటించడానికి పనికి రాదని ఈ చిత్రం చూస్తే స్పష్టం అవుతుంది. అసలు సన్నీకి నటనే రాదు. రణదీప్ హుడా పేలవమైన హావ భావాలతో ఆకట్టుకోలేక పోయాడు. అరుణోదయ్ సింగ్ కూడా యాక్టింగ్ లో పూర్. అయితే ఈ ముగ్గురు ఫిజిక్ పరంగా మంచి బాడీ షేపులతో అందంగా కనిపించారు.

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే...
  దర్శకురాలిగా పూజ భట్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. సినిమాలు ఎలా తీయాలో అసలు ఆమె తెలియదని సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. అయితే సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది. సినిమా చిత్రీకరణ కోసం ఎంచుకున్న ఆహ్లాదకరమన లొకేషన్లు చూపరులను ఆకట్టుకుంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వా లేదు. పాటలు యావరేజ్.

  సినిమా ట్రైలర్లు చూసి ఈ చిత్రంలో మసాలా సీన్లు ఉన్నాయని ఆశించి వెళితే నిరాశ తప్పదు. రెండు మూడు చోట్ల ముద్దు సీన్ల తప్ప ఘాటైన సన్నివేశాలు ఏమీ లేవు. మహేష్ భట్ తీసిన జిస్మ్, మర్డర్ చిత్రాల్లో ఉన్నంత వేడి వేడి సీన్లు ఈచిత్రంలో కనిపించవు. అసలు సినిమానే స్టోరీ చెత్తగా ఉంది. కేవలం సన్నీ లియోన్ ను బాలీవుడ్ కి పరిచయం చేయడానికే ఈచిత్రం తీసినట్లుంది.

  ఫైనల్ గా చెప్పేదేమంటే...ఈ సినిమాకు వెళితే ఎందుకు వచ్చామా..? అని బాధ పడక తప్పదు.

  సంస్థ : క్లాక్ వర్క్ ఫిలింస్, ఫిష్ ఐ నెట్కవర్క్
  దర్శకత్వం : పూజా భట్
  నిర్మాతలు : డినో మోరియా, పూజా భట్
  కథ, స్క్రీన్ ప్లే : మహేష్ భట్
  మ్యూజిక్ : ఆర్కో ప్రావో ముఖర్జీ, మిథున్
  సినిమాటోగ్రఫీ : నిగమ్ బొంజాన్
  తారాగణం : సన్నీ లియోన్, రణదీప్ హుడా, అరుణోదయ్ సింగ్

  English summary
  Jism 2 film is designed to be Sunny Leone’s ticket to a place in the Bollywood sun, but it isn’t quite love-all in her favour. Yet, Jism 2 has enough soul not be swamped by a curvaceous body. It is more than just another 'booby' trap of a film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X