For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జోహార్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: చైతన్య కృష్ణ, ఈశ్వరీ రావు, నైనా గంగూలీ, ఎస్తేరా అనిల్, శుభలేఖ సుధాకర్
  Director: తేజా మార్ని

  టాలీవుడ్‌ చిత్రాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లోనే ఫీల్‌గుడ్ చిత్రమనే టాక్‌ను సొంతం చేసుకొన్న చిత్రం జోహార్. ప్రచార చిత్రాలు, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాయి. సినిమా రిలీజ్ ముందు లాక్‌డౌన్ విధించడంతో జోహార్ థియేటర్ మెట్లు ఎక్కలేకపోయింది. అయితే ప్రస్తుతం ఓటీటీ జోరు కొనసాగుతుండటంతో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథ, కథనం, దర్శకుడు, నటీనటుల ప్రతిభ గురించి చర్చించుకోవాల్సిందే.

  జోహార్ కథ

  జోహార్ కథ

  ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందిస్తున్న అచ్యుత రామయ్య (చలపతిరావు) అకాల మరణంతో ఆయన కుమారుడు, యువ నాయకుడు (చైతన్య కృష్ణ) సీఎం పదవిని చేపడుతారు. తన తండ్రి చేసిన అరాచకాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు బయటకు రాకుండా.. ఆయనను దేవుడిగా చేసే ప్రయత్నాన్ని భుజానికి ఎత్తుకొంటాడు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని కట్టించి ఆయనను దేవుడిగా మార్చాలనుకొనే ప్రయత్నాలకు నిధులు కొరత ఏర్పడుతుంది. ఎలాగైనా తాను కొన్న పనిని చేయాలని మొండిపట్టు పట్టిన యువ సీఎం సంక్షేమ పథకాల్లో కోత పెడుతాడు.

  జోహార్ కథ కథలో మలుపు

  జోహార్ కథ కథలో మలుపు

  తన తండ్రిని దేవుడిగా మలిచే ప్రయత్నంలో పేదలకు, క్రీడాకారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? విద్యారంగం, వ్యవసాయ రంగం ఎలాంటి సంక్షోభంలో కూరుకుపోయింది. స్వచ్ఛంద సంస్థను నడిపే స్వాతంత్ర్య సమరయోధుడు (శుభలేఖ సుధాకర్), ఓ క్రీడాకారిణి (నైనా గంగూలీ), పేద రైతు (ఈశ్వరీ భాయ్), విద్యార్థిని (ఎస్తేర్ అనిల్) జీవితాలు భగ్నమవుతాయి. ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయాలు వారి జీవితాలకు ఎలాంటి ముంగింపు పలికాయనే ప్రశ్నకు సమాధానమే జోహార్ చిత్ర కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  నాన్న నరికిన తలలు కాదు.. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గుర్తుకురావాలి. నా తండ్రి పేరు చెబితే కీర్తి ప్రతిష్టలు గురుకురావాలి. ప్రతిపక్షాలు చెసే విష ప్రచారం కాదు.. పాలకులు రాసేదే చరిత్ర కావాలి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మరణంతో ఆ పదవిని చేపట్టిన యువ సీఎం ఎమోషనల్ స్పీచ్‌తో కథ మొదలవుతుంది. తొలి భాగంగా యువ నేత ప్రయత్నాలతోపాటు ఉద్దాన కిడ్నీ సమస్యను ఎదుర్కొనే ఓ పేద రైతు (ఈశ్వరీభాయ్), వారణాసిలో వేశ్య కూతురు (ఎస్తేరా అనిల్), స్వాతంత్ర్య సమరయోధుడు (శుభలేఖ సుధాకర్), క్రీడాకారిణి (నైనా గంగూలీ) జీవితాలను సృశిస్తూ కథ సాగుతుంది.

   సెకండాఫ్ అనాసిస్

  సెకండాఫ్ అనాసిస్

  ఇక సెకండాఫ్‌లో యువ నేత తీసుకొన్న నిర్ణయం సమాజంలోని వివిధ వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపించింది. వ్యవసాయ, క్రీడా, వైద్య, విద్య రంగాలు ఎలా కుదేలయ్యాయనే కోణంలో కథ భావోద్వేగంగా సాగుతుంది. పాలకులు జవాబుదారీగా లేకపోతే ప్రజలు జీవితాలు ఎలా భగ్నమవుతాయనే విషయాన్ని పలు రకాల కథలను మేలవించి తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. క్లైమాక్స్‌లో నాలుగైదు కథలకు ముంగింపు ఇచ్చిన విధానం హృదయాలను తాకుతుంది.

  దర్శకుడు తేజా మార్ని ప్రతిభ

  దర్శకుడు తేజా మార్ని ప్రతిభ

  దర్శకుడు తేజా మార్ని ఎత్తుకున్న పాయింట్.. దాని చుట్టు కథలను అల్లిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. తాను రాసుకొన్న కథను వెండితెరపైన ఆవిష్కరించిన తీరు హ్యాట్సాఫ్ అని చెప్పవచ్చు. ప్రతీ ఒక్కరిని ఆలోచింప జేసేలా కథను, ఆయా పాత్రల్లో జొప్పించిన భావోద్వేగం ఆయన సామాజిక స్పృహను తెలియజేస్తుంది. దర్శకుడిగా జోహర్ మలిచిన తీరు అద్భుతమైన ఫీలింగ్‌ను కలుగజేస్తుండటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్

  యువ సీఎంగా చైతన్య కృష్ణ, పేద రైతుగా ఈశ్వరీ రావు, స్వాతంత్ర్య సమరయోధుడిగా శుభలేఖ సుధాకర్, క్రీడాకారిణిగా ఎస్తేరా, అంకిత్ కోయా, జర్నలిస్టుగా రోహిణి తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. సినిమాలో ప్రతీ పాత్ర ఎమోషన్స్‌ పండించడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యారు. ప్రతీ నటుడు తమ పాత్రలో ఒదిగిపోయారు. ఉద్దాన కిడ్నీ సమస్య బాధితురాలిగా ఈశ్వరీ రావు పాత్ర గుర్తుండి పోతుంది. అలా ప్రతీ పాత్ర హృదయాన్ని టచ్ చేస్తుంది.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి పనితనం బ్రహ్మండంగా ఉంది. పలు వేరియేన్లతో సాగే కథలో ప్రేక్షకుడినీ లీనమయ్యేలా సన్నివేశాలను చిత్రీకరించారు. లైటింగ్, రెయిన్ ఎఫెక్ట్ షాట్స్ సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. పాటలకు అంతగా ప్రాధాన్యం కనిపించకపోగా రీరికార్డింగ్ మాత్రం ఆకట్టుకుందని చెప్పవచ్చు. సందీప్ మార్ని, రత్నాజీ రావు మార్ని నిర్మాణ విలువలు బాగున్నాయి. సాహితీ విలువలు ప్రధానంగా, డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  పేదల సంక్షేమం మరిచి పాలకులు స్వప్రయోజనాలకు, స్వార్ధానికి పాల్పడితే ఎలాంటి దారుణాలకు దారి తీస్తుందనే సామాజిక స్పృహ ఉన్న చిత్రం జోహర్. పేదలను ఓటు బ్యాంకుగానే చూస్తే సమాజంలో ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగుతాయనే విషయాన్ని వెండితెరపై చూపించడంలో దర్శకుడు తేజా మర్ని సఫలమయ్యారు. కమర్షియల్ విలువలను కాపాడుతూనే సామాజిక అంశాలను జోడించి విజన్‌ను అభినందించాల్సిందే. అన్ని రకాల విలువలు పుష్కలంగా ఉన్న జోహార్ ప్రతీ ఒక్కరిని మెప్పిస్తుంది. ఈ సినిమా బేసిక్‌గా థియేట్రికల్ ఎక్సిపీరియెన్స్ మూవీ.. కానీ ఓటీటీలో రిలీజ్ కావడం ఇబ్బందికరమైన పరిస్థితే అని అనిపిస్తుంది.

  Johar Movie Actors Esther Anil & Ankit Koyya Exclusive Chit Chat | Filmibeat Telugu
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: చైతన్య కృష్ణ, ఈశ్వరీ రావు, నైనా గంగూలీ, ఎస్తేరా అనిల్, శుభలేఖ సుధాకర్, అంకిత్ కోయా, రోహిణి తదితరులు
  దర్శకత్వం: తేజా మార్ని
  రచన: రాం వంశీకృష్ణ, ఫణీంద్ర గంగుల
  పాటలు: చైతన్య ప్రసాద్, ప్రమోద్, మూర్తి
  ఆర్ట్: గాంధీ
  ఎడిటింగ్: సిద్ధార్థ తాతోలు, అన్వర్ అలీ
  మ్యూజిక్:ప్రియదర్శన్ బాలసుబ్రహణ్యం
  సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
  నిర్మాతలు: సందీప్ మార్ని, రత్నాజీ రావు మార్ని
  రిలీజ్: ఆహా ఓటీటీ
  రిలీజ్ డేట్: 2020-08-14

  English summary
  Johaar movie review and Rating: Teja Marni debutant directors made Johaar Movie feel good. Naina Ganguly, Teja Marni, Esther Anil, Chaitanya Krishna are performance taken next level. This movie released on Aha on 14 August.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X