For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎస్వీఆర్ గ్రాండ్ సన్ ‘మిస్టర్ 7’ రివ్యూ

  By Bojja Kumar
  |

  ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ హీరోగా వెండి తెరకు పరిచయ అవుతూ తెరకెక్కిన చిత్రం. జూనియర్ ఎస్వీఆర్ సరసన కథానాయికగా నీలమ్ ఉపాద్యాయ తెలుగు తెరకి పరిచయం అయింది. ఆర్. చరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జూ ఎస్వీఆర్ స్వయంగా తాతపేరు మీద స్థాపించిన బ్యానర్లో నిర్మించారు. తాత వారసుడిగా తెరంగ్రేటం చేయడం అంటే అంతా ఆషామాషీ కాదు. వారసత్వం నిలబెట్టుకోకపోతే...పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే చాలా మంది వారసుల విషయంలో గమనించాం. మరి తొలి అటెమ్ట్ జూ ఎస్వీఆర్ పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? చెకౌట్ ది రివ్యూ....

  లక్ష్మణ్ (జూ ఎస్వీఆర్) ఒక అనాథ. ఈ క్రమంలో దొంగగా మారి తన చిన్న నాటి స్నేహితుడు అంజి(శ్రీనివాసరెడ్డి)తో కలిసి కార్లు దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోకి పేరుమోసిన గ్యాంగ్ స్టర్ నాయక్(సత్యదేవ్) ఎంటర్ అవుతాడు. బ్యాంకును దోపిడీ చేయాలనేది అతని లక్ష్యం. లోకల్ దొంగలను చేరదీసి బ్యాంకును కొల్లగొట్టి తన పని అయిపోయాక వారిని చంపేస్తాడు. మరో వైపు లక్ష్మణ్ నక్షత్ర(నీలం)తో ప్రేమలో పడతాడు. తన కూతురిని నిజాయితీగా బతికేవాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని నక్షత్ర తండ్రి చెప్పడంతో చివరిసారిగా పెద్ద దొంగతనం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో మెర్సిడీస్ బెంజ్ కారును దొంగిలిస్తాడు. అందులో నాయక్ దోపిడీ చేసిన సొమ్ము ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి కథ.

  హీరోగా ఫస్ట్ ఎటెమ్ట్ లో జూ ఎస్వీర్ మంచి ప్రతిభ కనబరిచాడు. సినిమాలపై అతని ఉన్న మక్కువ ఈ చిత్రం చూస్తే స్పష్టం అవుతుంది. నీలం ఉపాధ్యాయ అందంగా కనిపించడంతో నటనలోనూ ఫర్వాలేదనిపించింది. అయితే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేక పోవడంతో కేవలం పాటలకు, రొమాన్స్ కు మాత్రమే పరిమితం అయింది. శ్రీనివాసరెడ్డి తనదైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రలో సత్యదేవ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఎమ్మెస్, జీవా పలు చోట్ల హాస్యం పండించారు. ఇతర నటీనటులు వారి పాత్రలకు అనుగుణంగా రాణించారు. రచన మౌర్య ఐటం సాంగు యావరేజ్.

  కథ కాస్త ఫర్వాలేదనిపించినా, స్క్కీప్లే మైనస్ గా మారింది. దర్శకుడు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోవడం, సైడ్ యాక్టర్స్ తో ఎంటర్ టైన్మెంట్ చోటివ్వడంతో సినిమా కాస్త ఫర్వాలేదు అనినిపిస్తుంది. హీరోగా జూనియర్ ఎస్వీఆర్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బాడీ బరువుని తగ్గించుకుని, డైలాగ్ డెలివరీ విషయంలో మంచి పట్టు సాధిస్తే భవిష్యత్ ఉంటుంది. ఫైనల్ గా ఈచిత్రం గురించి చెప్పాల్సి వస్తే దొంగగా నటించిన జూ ఎస్వీఆర్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల మనసును మాత్రం దోచుకోలేక పోయాడని చెప్పక తప్పదు.

  సంస్థ: ఎస్వీఆర్ మీడియా కార్పొరేషన్
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చరణ్ రెడ్డి
  నిర్మాత: ఎస్విఎల్ఎన్ రంగారావు
  సంగీతం: మున్నా కాశి
  ఎడిటింగ్: ఉద్ధవ్
  నటీనటులు: జూ ఎస్వీఆర్, నీల ఉపాధ్యాయ, శ్రీనివాస రెడ్డి, సత్యదేవ్, ఎమ్మెస్ నారాయణ, ఏవీఎస్, గుండు హనుమంతరావు తదితరులు...

  English summary
  SVR, grandson of S V Ranga Rao, has arrived and he has attempted his debut with a mass entertainer 'Mr 7. SVR has given a committed performance and his passion for cinema is evident. However, there are many departments that he needs to work on if he is planning for a long term career. Hero is a thief but fails to steal hearts of audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X