»   » ‘జువ్వ’ మూవీ రివ్యూ: కొత్తదనం లేని రోటీన్ ఎంటర్టెనర్

‘జువ్వ’ మూవీ రివ్యూ: కొత్తదనం లేని రోటీన్ ఎంటర్టెనర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Juvva Movie Review And Rating ‘జువ్వ’మూవీ రివ్యూ

Rating: 1.75/5

రాజమౌళి దగ్గర అసిస్టెంటుగా పని చేసి దర్శకుడిగా మారిన త్రికోటి తాజాగా 'జువ్వ' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించడం, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రమోట్ చేయడం, ట్రైలర్ కూడా బావుండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు ఏమేరకు అందుకుంది? గతంలో 'దిక్కులు చూడకు రామయ్య' లాంటి వినూత్న సినిమా తీసి ప్రశంసలు అందుకున్న త్రికోటి కమర్షియల్ సక్సెస్ అందుకోలేక పోయారు. మరి పూర్తి కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన 'జువ్వ'తో త్రికోటి తన గోల్ రీచ్ అయ్యాడా? ఓ లుక్కేద్దాం...

కథ ఏమిటంటే...

కథ ఏమిటంటే...

శృతి తన స్కూలు రోజుల్లో బసవరాజు అనే ప్రేమోన్మాద విద్యార్థి వల్ల చాలా డిస్ట్రబ్ అవుతుంది. అతడి ఉన్మాద చర్యలను ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌ను సైతం చంపేసి జైలుకెళతాడు బసవరాజు. ఓసారి జైలు నుండి తప్పించుకుని శృతి ఇంటికి వచ్చి తన ఉన్మాదాన్ని ప్రదర్శిస్తాడు. బసవరాజు వల్ల ఎప్పటికైనా తన కూతురుకు ప్రమాదం ఉంటుందని భావించిన శృతి తండ్రి తన కూతురు ఊరు, పేరు అన్నీ మార్చేస్తాడు. పెరిగి పెద్దయి జైలు నుండి విడుదలైన వచ్చిన బసవరాజు(అర్జునా).... శృతి(పాలక్ లల్వానీ) ఆచూకీ కోసం వెతుకుంతుంటాడు.


 హీరో, హీరోయిన్, ఒక విలన్...

హీరో, హీరోయిన్, ఒక విలన్...

‘జువ్వ' కథలో హీరో రానా(రంజిత్). హీరోయిన్‌తో కానీ, విలన్‌తో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. కథ ముందుకు సాగే కొద్దీ హీరోయిన్ హీరో ప్రేమలో పడుతుంది, హీరో- విలన్ మధ్య ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. శృతి కోసం ఎరినైనా చంపేసే రకం బవసరాజు, తన ప్రేమ కోస ఎంతకైనా తెగించే రకం రానా...... చివరకు కథ ఎలా సుఖాంతం అయిందో తెరపై చూడాల్సిందే.


 హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్

హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్

హీరోగా పరిచయం అయిన రంజిత్ లుక్ పరంగా బావున్నాడు. ఫైట్స్, డాన్సులు బాగానే మ్యానేజ్ చేశాడు. అయితే నటన పరంగానే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. హీరోయిన్ పాలక్ లల్వానీ అటు నటన పరంగానూ, ఇటు అందం పరంగానూ యావరేజ్.


 విలన్, ఇతర నటీనటులు

విలన్, ఇతర నటీనటులు

ఈ చిత్రంలో విలన్ పాత్రలో అర్జునా అనే మలయాళ నటుడు నటించాడు. విలన్ పాత్రలో ఓకే కానీ.... మరీ అంత పవర్‍‌ఫుల్‌గా అయితే ఏమీ కనిపించలేదు. పోసాని, మురళీ శర్మ, సప్తగిరి, అలీ, బద్రం, సురేఖవాణి, ప్రభాస్ శ్రీను, ఆనంద్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.


 టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల పరంగా కూడా సినిమా అంతగొప్పగా ఏమీ లేదు. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ పెద్దగా ఆకట్టుకోలేదు. సురేష్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటింగ్, ఇతర టెక్నికల్ అంశాలు మరీ గొప్పగా కాకుండా, మరీ చెత్తగా కాకుండా యావరేజ్‌గా ఉన్నాయి.


రోటీ కథ

రోటీ కథ

సినిమా కథ, కథనం ఆసక్తికరంగా లేదు. సినిమాలో వెతుకుదామన్నా కొత్త పాయింట్ ఒక్కటీ కనిపించదు. చిన్నతనం నుండి హీరోయిన్ అంటే పడి చచ్చే ఒక ఉన్మాద విలన్, ఆమె తనకు దక్కక పోతే ఎవరికీ దక్కకూడదనే శాడిజం.... పోలికలతో ఒక రోటీన్ విలన్ పాత్ర, జులాయిగా తిరిగే హీరో హీరోయిన్ అందం చూసి ప్రేమలో పడిపోవడం, తన తెలివితేటలతో విలన్ నుండి హీరోయిన్ ను సేవ్ చేసి కథను ముగించడం. ఇలాంటివి ఇప్పటికే చాలా వచ్చాయి.


అదే మిస్సయింది

అదే మిస్సయింది

ఏ కథలో అయినా భావోద్వేగాలు పండినపుడే ఆ సీన్లు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కొన్ని కథలు రొటీన్‌గా ఉన్నా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పిస్తాయి. ‘జువ్వ' విషయంలో మాత్రం కథతో పాటు కథనం కూడా ఆకట్టుకోలేక పోయింది.


 ఫస్టాఫ్ ఇలా...

ఫస్టాఫ్ ఇలా...

సినిమా ప్రారంభంలో హీరోయిన్, విలన్ చిన్నతనం.... హీరోయిన్ పెద్దయిన తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్‌ను హీరో పడేసే క్రమంలో కొన్ని ఆక్‌పాక్ కామెడీ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో విలన్ జైలు నుండి విడుదలైన హీరోకు ఫ్రెండ్ అవ్వడం.... లాంటి రోటీన్ సన్నివేశాలతో తొలిభాగం సాగుతుంది.


సెకండాఫ్ ఇలా

సెకండాఫ్ ఇలా

ఇక రెండో భాగం అయితే ప్రతి సీనూ ప్రేక్షకుడు ముందే ఊహించే విధంగా సాగుతుంది. హీరోకు విలన్ గురించి అసలు విషయం తెలియడం, విలన్ నుండి తన ప్రియురాలిని కాపాడే ప్రయత్నం చేయడం..... క్లైమాక్స్‌లో ఓ యాక్షన్ సీన్‌, విలన్‌ను ఫినిష్ చేసి తన ప్రేమలో సక్సెస్ అవ్వడం ఇలా పరమ బోరింగ్‌గా సినిమా సాగుతుంది.


 ప్లస్, మైనస్ పాయింట్స్

ప్లస్, మైనస్ పాయింట్స్

సినిమాలో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ పెద్దగా ఏమీ లేదు. మైనస్ పాయింట్స్ అంటే కథ, కథనంతో పాటు ఇలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి.


 చివరగా...

చివరగా...

‘జువ్వ' సినిమా కొత్తదనం లేని రోటీన్ మూవీ. కమర్షియల్ అంశాలు కొన్ని ఉన్నా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే విధంగా ప్రజంట్ చేయలేక పోయారు.


 నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

తారాగణం: రంజిత్ సోము, పాలక్ లల్వానీ, పోసాని కృష్ణ ముర‌ళి, అలీ, స‌ప్త‌గిరి, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, ప్ర‌భాక‌ర్, విజయ్ చంద‌ర్, ఆనంద్, ఐనాక్స్ వెంక‌ట్, పింగ్ పాంగ్ సూర్య‌, జ‌బ‌ర్ధ‌స్త్ శ్రీను, షేకింగ్ షేషు, సారిక రామ‌చంద్ర‌రావు, ఏడిద శ్రీరాం, మోహ‌న్ రావు, హిమ‌జా, మునిరాజు, ల‌త‌, తుల‌సి, ప్ర‌స‌న్న కుమార్, ప్ర‌భాష్ శ్రీను, రాజేష్‌, భ‌ద్ర‌మ్, సురేఖా వాణి, స‌నా, దువ్వాసి మోహ‌న్ , ప్ర‌జ్వాల్, ఆయుష్, ఎస్తార్ అనీల్, విష్ణు ప్రియ‌, ప‌ద్మ‌జా, ఫ‌రీద్, క‌బీర్, అజ‌ర్, నాగు త‌దిత‌రులు న‌టించారు.


క‌థ, మాట‌లు: ఎమ్. ర‌త్నం, సాహిత్యం: అనంత శ్రీరాం, వ‌శిష్టి, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్, జానీ, ఎడిటింగ్: కోట‌గిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు, యాక్ష‌న్: వెంక‌ట్, నందు, ఆర్ట్: రామ్ అర‌స‌విల్లి, సినిమాటోగ్ర‌ఫీ: సురేష్‌, సంగీతం: ఎమ్.ఎమ్. కీర‌వాణి, నిర్మాత : డా. భ‌ర‌త్ సోమి, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: త్రికోటి పేట‌.


English summary
Juvva Movie Review and rating . The Juvva Movie is ‘pakka’ Action Romantic film directed by Triekoti Peta. The movie starred by Ranjith, Palak Lalwani, Murali Sharma, Ali, Posani Krishna Murali, Sapthagiri, Raghu Babu and more.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu