twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్నం ‘కడలి’ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    హైదరాబాద్: 'రావణ్' సినిమా ప్లాపు తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా సమయం తీసుకున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎట్టకేలకు 'కడలి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు కార్తీక్ తనయుడు గౌతం, రాధ కూతురు తులసిలను హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు తీసిన మణిరత్నం సినిమాలంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం సహజమే. కడలి చిత్రంపై కూడా అదే తరహా ఆసక్తి నెలకొంది.

    కడలి చిత్రాన్ని మణిరత్నం యాక్షన్, పంచ్ డైలాగులు లాంటి కమర్షియల్ అంశాలతో కూడిన అందమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అర్జున్, అరవింద స్వామి, గౌతం పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రాజీవ్ మీనన్ కెమెరా, జయమోహన్ స్క్రిప్టు, మణిరత్నం దర్శకత్వం వెరసి ఈ సినిమాకు అందరూ టాప్ టెక్నీయన్స్ పని చేసారు.

    కడలి సినిమా మొత్తం మత్స్యకార గ్రామం నేపథ్యంలో ఒక క్రైస్తవ జాలరి జీవితం చుట్టూ, క్రైస్తవ జాలరి కుర్రాడు థామస్.... బిట్రిస్ అనే అమ్మాయిని కలుసుకోవడం వల్ల అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది సినిమాలో చూపించారు. మంచికి చెడుకు మధ్య పోరాటం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే విషయాలలో ప్రేమకథను మిలితం చేసి చూపించాడు దర్శకుడు మణిరత్నం. మంచి, చెడు అనే విషయాలను బేస్ చేసుకుని బైబిల్‌లోని ధీమ్స్ న‌ు తన సినిమాలోని పాత్రల్లోకి జొప్పించి ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేసాడు.

    సామ్ ఫెర్నాండెజ్(అరవింద స్వామి) సిన్సియర్‌గా అంకిత భావంతో ఉండే వ్యక్తి. బెర్గ్‌మెన్స్(అర్జున్) ఫన్నీగా ప్రేమ తత్వంతో ఉండే వ్యక్తి. వీరిద్దరు చర్చి‌ఫాదర్‌గా శిక్షణ కోసం క్రిస్టియన్ సెమినార్‌కు వెలుతారు. అయితే తర్వాత ఇద్దరు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటారు. సామ్ సముద్రం పక్కన ఉండే ఓ గ్రామానికి వచ్చి చర్చి ఫాదర్‍‌గా జీవితం మొదలు పెడతాడు. అక్కడే అతడికి తల్లిని కోల్పోయి అనాథ బాలుడైన థామస్‌(గౌతం)తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పెరిగి పెద్దవాడైన థామస్ బెర్గ్‌మెన్స్ కూతురు బిట్రిస్(తులసి)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది తర్వాతి కథ.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    సినిమా ప్రారంభం నుంచి తొలిభాగం ముగిసే వరకు సినిమాను బాగానే నడిపించిన మణిరత్నం... రెండోభాగాన్ని మాత్రం స్లోగా నడిపించి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    సామ్ పాత్రలో అరవింద స్వామి, బెర్గ్‌మెన్స్ పాత్రలో అర్జున్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకు ఈ రెండు పాత్రలు ఎంతో కీలకం.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    హీరోగా తెరంగ్రేటం చేసిన గౌతం మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. యాక్షన్ సీన్లు, డాన్స్ సీన్లు చూస్తే అతను ఎంతో హార్డ్ వర్క్ చేసాడనే విషయం స్పష్టం అవుతుంది. హీరోయిన్ తులసితో గౌతం రొమాన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    సినిమాలో మూడు ముఖ్యపాత్రలతో పోలిస్తే తులసి పాత్ర ప్రాధాన్యం తక్కువే. తనకు అవకాశం ఉన్నంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. పాటల్లో చాలా బాగా కనిపించింది. మంచు లక్ష్మి చిన్న పాత్రలో కనిపించింది.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    సినిమాలోని టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే... రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అద్భుతం. సముద్రం అందాలను ఎంతో అద్భుతంగా చూపించారు. పిక్చరైజేషన్ బాగుంది.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    ఆర్ ఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలెట్. గుంజుకున్నా, పచ్చని తోట, యాడకే పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శశిధర్ ఆర్ట్ డైరెక్షన్ పెంటాస్టిక్.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    కడలి అంటే సముద్రం. మాములు సమయంలో అది ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. కడలి ఉగ్రరూపం దాలిస్తే ఎంతో డేంజర్. ఈ అంశమే సినిమా కథలోని పరమార్థం.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    ఓవరల్ గా కడలి సినిమా మంచి స్క్రిప్టు. అద్భుతమైన నటన ఇందులో చూడొచ్చు. అయితే మణిరత్నం నేరేషన్ స్లోగా ఉండటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఓపికను నశింపచేస్తుంది. మణిరత్నం సినిమాల అభిమానులు కూడా ఒకసారి కంటే ఎక్కువ చూడటం కష్టం.

    ప్రేక్షకుల సహనానికి పరీక్ష (మణిరత్న ‘కడలి’ రివ్యూ)

    నిర్మాత: మణిరత్నం మరియు మనోహర్ ప్రసాద్
    దర్శకత్వం: మణిరత్నం
    తారాగణం: గౌతం, తులసి, అర్జున్, అరవింద స్వామి, మంచు లక్ష్మి
    సంగీతం: ఏఆర్ రెహ్మాన్

    English summary
    After the failure of Raavan, filmmaker Mani Ratnam has taken more than two years to mould his next master-piece, which features newcomers like Gautham Karthik and Thulasi Nair in the lead roles. His latest directorial venture has simultaneously been made and released in Telugu as Kadali and Tamil as Kadal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X