»   » పేలింది (‘పటాస్’రివ్యూ)

పేలింది (‘పటాస్’రివ్యూ)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  3.0/5
  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  ఎప్పుడూ విభిన్న కధాంశాలు,స్క్రీన్ ప్లే లు అంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్ కు అవేమీ కలిసి రాలేదు. అందుకేనేమో...ట్రెండ్ లో ట్రై చేసి హిట్ కొట్టాలనుకున్నాడు...రొటీన్ కథే అయినా కొత్త కామెడీ సీన్స్ తో కథనం పరుగెత్తించి పటాస్ ని అనుకున్న విధంగా భారీగా పేల్చాడు. దర్శకుడు కొత్తవాడైనా తనకున్న కలం బలంతో డైలాగులు పేల్చి స్క్రీన్ పై చెడుగుడు ఆడేసాడు. క్లైమాక్స్ తప్పించి సినిమా మొత్తం ఎక్కడా గ్రాఫ్ క్రిందకి పడకుండా పట్టుకుని కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్, సింగం చిత్రాలు కలిసి వండినట్లున్న ఈ చిత్రం 'గబ్బర్ సింగం' అనిపించుకున్నా కామెడీ తో దాన్ని దాటేసాడు. దాంతో ...ఆ రెండు చిత్రాలులా మంచి విజయం సాధిస్తుంది. అంతేకాదు ఈ రోజు మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు ఎమ్.ఎస్ నారాయణకు ఇది ట్రిబ్యూట్ లా, నివాళిలా ఉంది. చివరి షాట్ సైతం ఎమ్.ఎస్ నారాయణ కామెడీ మీదే ఉంటుంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  అవినీతి పోలీస్...తర్వాత మారి విలన్స్ భరతం పట్టడం వంటి కథలు తెలుగు తెరకే కాదు ఇండియన్ తెరకే బాగా ఓల్డ్. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని దర్శకుడు బాగా నమ్మినట్లున్నాడు. అందుకే ఎక్కడా తడబడకుండా ఈ పాత కథకు కొత్త రంగులు దిద్దాడు. ముఖ్యంగా ఈ కథకి కామెడీని అద్దటం, డైలాగులు ఫన్ గా రాసుకోవటంలో విజయవంతమయ్యాడు. మాస్ మసాలా పోలీస్ గా కొన్ని చోట్ల కళ్యాణ్ రామ్ ఆ పాత్రకు అతికించినట్లు అనిపించినా కథనం స్పీడుగా నడపటంతో ఎక్కడా ఆ తేడా రిజిస్టర్ కాదు. అలాగే బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ ‘అరె ఓ సాంబ..' రీమిరీమిక్స్ ని వాడుకోవటం, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అన్నీ ఈ సినిమాకు కలిసి వచ్చాయి.

  ఇక ఎమ్.ఎస్ నారాయణగారు పాత్ర ఈ సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేసారు. సినిమాలో కామెడీ పార్ట్ ని ఆయన పూర్తిగా మోసారు. సునామీ స్టార్ గా డైలాగులు చెప్తూ...చివరి షాట్ లో సైతం ఆయన తనదైన టైమింగ్ లో డైలాగులు చెప్తూ నవ్విస్తూ మనస్సు కలుక్కుమనేలా చేసారు.

  స్లైడ్ షోలో మీగతా రివ్యూ...

  హైలెట్స్

  సినిమా ఫస్టాఫ్ లో శ్రీనివాసరెడ్డి పంచ్ లతో జెట్ స్పీడులో లాక్కెళ్లిపోయాడు. సెకండాఫ్ లో స్టూడెంట్స్ స్టైక్ చేస్తూంటే వాళ్ల తల్లులు చేత కొట్టించే ఎపిసోడ్ కు ఓ రేంజిలో థియోటర్ లో అప్లాజ్ వచ్చింది. అలాగే పాటల్లో రీమిక్స్ థియోటర్ ని పుల్ జోష్ లో ముంచింది.

  మైనస్

  పాటలపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుంటే బాగుండేది. ఎక్కడో విన్నట్లు ప్రతీ పాట అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ సైతం సూట్ కాలేదు. టాలెంట్ ఉన్న కొత్త దర్శకుడు రొటీన్ కథ తీసుకోకుండా ఉంటే మరింత బాగుండేది. క్లైమాక్స్ లో ఎమోషన్స్ లేకుండా పరమ రొటీన్ గా సాగింది.

  సినిమాటోగ్రఫి, ఎడిటింగ్

  ఈ రెండు విభాగాలు ఈ సినిమాకు చాలా సమర్ధవంతంగా పనిచేసాయనే చెప్పాలి. ఎడిటర్ ఎక్కడా కొద్దిగా కూడా బోర్ కొట్టకుండా స్పీడుగా లాక్కెళ్లిపోయాడు. అయితే బి,సి సెంటర్లు బాగా అలరిస్తాయనుకున్నాడేమో కాని ఫైట్స్ నే బాగా లెంగ్త్ ఉంచేసారు.

  దర్శకుడిగా...

  తొలి చిత్రంతో అనిల్ రావిపూడి తను టాలెంటెడ్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా హీరో ని మాస్ గా ప్రెజెంట్ చేయటం, విలన్ ఎస్టాబ్లిష్ మెంట్ సీన్స్ , కామెడీని పండించిన తీరు అతన్ని పెద్ద దర్శకుడు స్దాయికి తీసుకు వెళ్తాయి.

  కళ్యాణ్ రామ్ దే క్రెడిట్

  ఓ దర్శకుడుని,అదీ రొటీన్ కథతో వచ్చిన దర్శకుడు స్క్రిప్టుని నమ్మి బాగా ఖర్చు పెట్టి మంచి అవుట్ పుట్ తెచ్చుకుని తనకు హిట్ తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ దే పూర్తి క్రెడిట్

  వీళ్లంతా

  సినిమాకు సాయికుమార్, అశుతోష్ రానా, పోసాని, ఫృధ్వీ, ప్రవీణ్, జోష్ రవి వంటి వాళ్లంతా తమ పరిధిలో సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. పోసాని క్యారెక్టర్ కు మంచి అప్లాజ్ వచ్చింది.

  కామెడీనే

  ఈ సినిమాకు పూర్తి ప్రాణం కామెడీనే అని చెప్పాలి. ఫస్టాఫ్ లోనూ,సెకండాఫ్ లోనూ కామెడీకు తదినంత ప్రాధాన్యత దర్శకుడు ఇచ్చి ఈ కథను తీర్చిదిద్దటం కలిసి వచ్చింది. ముఖ్యంగా అబులెన్స్ 108 తరహాలో 801 వంటివి పెట్టి నిలబెట్టారు.

  బ్యానర్: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌

  నటీనటులు: కళ్యాణ్ రామ్, శృతి సోది, సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని ఇతర పాత్రధారులు.
  కెమెరా: సర్వేష్‌ మురారి,
  సంగీతం: సాయి కార్తీక్‌,
  ఎడిటింగ్‌: తమ్మిరాజు,
  ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌,
  ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌,
  రచనా సహకారం: ఎస్‌.కృష్ణ.
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
  నిర్మాత: కళ్యాణ్ రామ్
  విడుదల తేదీ: 23,జనవరి 2015.

  చాలా కాలంగా హిట్ లేని కళ్యాణ్ రామ్ కి, ఓపిగ్గా అతని సినిమాలు అన్నీ చూస్తున్నవారికి ఇది పూర్తి రిలీఫ్ ఇచ్చే చిత్రం. అలాగే నవ్వుకోవటానికి మల్టిప్లెక్స్, ఎ,బి,సి సెంటర్లు అంటూ తేడా లేదు కాబట్టి అన్ని చోట్లా బాగానే ఆడే అవకాసం ఉంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Pataas directed by debutant Anil Ravipudi and produced by Kalyan Ram himself under N.T.R. Arts released today (January 23, 2015) with hit talk. Starring Nandamuri Kalyan Ram and Shruti Sodhi playing the lead roles Sai Karthik is composing the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more