twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలిసి నడవక్కర్లేదు!

    By Staff
    |

    Kalisinaduddam
    -జలపతి
    చిత్రం: కలిసి నడుద్దాం
    నటీనటులు: శ్రీకాంత్‌, సౌందర్య, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, ఎల్బీ శ్రీరాం...
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
    నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
    సింగిల్‌ పాయింట్‌ తో కథను సాగదీయడం ప్రస్తుతం రివాజుగా మారింది. అలాంటి మరో చిత్రమే- కలిసి నడుద్దాం. సినిమాకు ముందు స్త్రీల గురించి ఓ ఉపోద్ఘాతం. ఆ తర్వాత ప్రేక్షకులకు విద్యుదాఘాతం. తరాతరాలుగా స్త్రీలు భర్త వెనుకే ఉంటున్నారని, వారు కూడా మగవారితో సమానంగా కలిసి నడవాలని శివరామకృష్ణ, కోడి రామకృష్ణ తెగ ఫీలైపోయి ఈ చిత్రాన్ని తీశారు. కానీ సినిమా చివర వరకు చూస్తే భార్య భర్త వెనకాలే ఉండాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఈ చిత్రంలో కోడి రామకృష్ణ చూపించారు. ఒక ఆదర్శమైన పాయింట్‌ ను పట్టుకొని కథను, కథనాన్ని సాదదీసి ప్రేక్షకులకు మీదికి రుద్దారు. కొత్తదనం లేదు. కొత్తగా చూడాల్సిందేమీ లేదు. 'అతి' సాధారణ చిత్రం. బ్రహ్మనందం, శ్రీలక్ష్మిల కామెడీ కాస్తా రిలీఫ్‌.

    శ్రీకాంత్‌, సౌందర్య భార్యభర్తలు. శ్రీకాంత్‌ కు త్వరగా పైకి ఎదగాలని కోరిక. అందుకని కట్నం ద్వారా వచ్చిన డబ్బును, భార్య నగల్ని తీసుకొని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పెడుతాడు. సౌందర్యకు ఇలాంటివి ఇష్టం ఉండదు. భర్తకు తరుచు అడ్డు చెప్పుతుంటుంది. శ్రీకాంత్‌ కు ఇది నచ్చదు. ఒక రోజు ఆ ఫైనాన్స్‌ కంపెనీ బోర్డ్‌ తిప్పేస్తుంది. దాంతో ఇద్దరికి మాటా, మాటా పెరుగుతుంది. 6 నెలలు ఇంటి భారాన్నంతా సౌందర్యను చూసుకోమని శ్రీకాంత్‌ ఛాలెంజ్‌ వేస్తాడు. ఒక వేళ భార్య తన సొంత సంపాదనతో ఇళ్ళు గడపగలిగితే ఆమె చెప్పినట్లు చేస్తానని చెప్పుతాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌ వేరే బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తాడు. చివరికి శ్రీకాంత్‌ అంతా నష్టపోతాడు. సౌందర్యతో సమానంగా కలిసి నడుస్తాడు. ఆ తర్వాత ప్రేక్షకులు అందరూ థియేటర్ల నుంచి బయటికి కలిసి నడుస్తారు.

    శ్రీకాంత్‌, సౌందర్యలు ఇలాంటివెన్నో పాత్రలు పోషించారు. సో వారి నటన గురించి కొత్తగా చెప్పుకోదగ్గదేమీ లేదు. బ్రహ్మనందం, శ్రీలక్ష్మిల కామెడీ బాగుంది. కానీ బ్రహ్మనందం ఎక్స్ప్రెషన్స్‌ కొంచెం అతిగా ఉన్నాయి. చిత్రంలో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అంటే పెద్ద పెద్ద శబ్దాలతో ప్రేక్షకులకు హార్ట్‌ ఎటాక్‌ తెప్పించడం కాదని ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌ గ్రహిస్తే బాగుంటుంది. నవ్వుతూ బతకాలిరా తర్వాత ఈ సినిమా చూస్తే కోడి రామకృష్ణ దర్శకత్వం మీద డౌట్‌ వస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X