»   » ఉత్తమ కథకు..స్క్రీన్ ప్లేనే విలన్ ( 'ఉత్తమ విలన్‌' రివ్యూ)

ఉత్తమ కథకు..స్క్రీన్ ప్లేనే విలన్ ( 'ఉత్తమ విలన్‌' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

దాదాపు కెరీర్ ప్రారంభం నుంచి చిత్రాల ఎంపికలో, నటనలో ఏదో ఒక విభిన్నత చూపుతూ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. దాంతో ఆయన ప్రతీ సినిమాపై లెక్కలు మించి అంచనాలు,ఎదురుచూపులు పెరిగిపోతూ వస్తున్నాయి. అదే ఉత్తమ విలన్ కు ఎదురైంది.
విడుదలకు ఒక రోజు లేటు అయ్యి...ఆర్దిక అడ్డంకులును విజయవంతంగా దాటిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించటంలో మాత్రం ఘోరంగా విఫలమైందనే చెప్పాలి. కథగానూ, కమల్ నటనలోనూ ఎక్కడా వంకపెట్టలేని ఈ చిత్రం కేవలం ఆ కథను నడిపించే కథనంలోనే తడబడి...చూసే వారిని ఓ రేంజిలో విసిగించింది. అప్పటికీ చివరి వరకూ ఈ చిత్రాన్ని భరించగలిగాం అంటే అది కమల్ మీద ఉన్న అభిమానం. ఈ సినిమాలో ఆయన చేసిన నట విన్యాసాలు. అయితే బంగారు కంచానికైనా గోడ చేరువ కావాలన్నట్లు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కలిసిరాక మిగతావేమీ ఎలివేట్ కాలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Kamal Haasan 'Uttama Villain' review

మనోరంజన్(కమల్ హాసన్) ఓ పెద్ద స్టార్. అతని కెరీర్ వెనక...మార్గదర్శి (కె.బాలచందర్), తనని స్టార్ ని చేసిన నిర్మాత పూర్ణ చంద్రరావు(కె విశ్వనాధ్) ఉంటారు. మనోరంజన్...ఓ దశలో తను ప్రేమించిన యామినని కాదని, పూర్ణ చంద్రరావు కుమార్తె వరలక్ష్మి(ఊర్వశి)ని వివాహం చేసుకుంటాడు. జీవతం పూలవానలా సాగిపోతున్న సమయంలో ఊహించని విధంగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ అనే విషయం బయిటపడుతుంది. ఎంతో కాలం బ్రతకలేనని తెలుసుకున్న మనోరంజన్..చివరగా తన మార్గదర్శి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని కోరుకుంటాడు. ఆ ఆఖరి చిత్రం చూసినవారు సంతోషంగా బయిటకువెళ్లాలని అడుగుతాడు. అలా తెయ్యమ్ కళ నేపధ్యంలో మృత్యుంజయుడిగా మారిన ఉత్తముడు కథ తెరకెక్కించాలని నిర్ణయించుకుంటారు. సినిమాలో సినిమా మొదలవుతుంది. మరణానికి దగ్గరవుతున్న మనోరంజన్...మృత్యుంజయుడి కథని ఎలా పూర్తి చేసాడు. ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ..అనుభవాలు ఏమిటి..ఇంతకీ ఆ ఉత్తముడు కథేంటి...అనేది తెలుసుకోవాలంటి ఈ చిత్రం చూడాల్సిందే.


ప్రతి ఒక్కరిలోనూ విలన్‌ ఉంటారు. ఆయా పరిస్థితులే వాళ్లని విలన్‌లుగా మారుస్తాయి. ఎవరి దృష్టిలో ఎప్పుడెవరు ఎలా కనిపిస్తారన్నదే జీవితం. ముఖ్యంగా కళాకారుడు మృత్యుంజయుడు అని కమల్ చెప్పాలన్న తాపత్రయం ఇందులో కనపడుతుంది. ఈ సినిమాలో ఉత్తమన్‌ అనే 8వ శతాబ్ధం నాటి కళాకారుడి పాత్రలో, మనోరంజన్‌ అనే 21వ శతాబ్ధపు సినిమా స్టార్‌ పాత్రలో కమలహాసన్‌ ఒదిగిపోయి నటించారు. అందుకు కమల్ కి ఎవరూ సాటి రారు అని మరోసారి విజిల్ వేసి మరీ చెప్పాలనిపిస్తుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఆయన గెటప్ ల మీద, స్టోరీ ఐడియా మీద పెట్టి శ్రద్ద కథనం పై పెట్టలేకపోతున్నారు. తను అనుకున్న లేదా తన దగ్గర ఉన్న లేదా తను పోగుచేసిన అనేకానేక అంశాలను తన దగ్గర ఉన్న కథలో కలిపేసి, ఒకదానికొకటి ముడిపెట్టాలని చూడటం, వాటిని ఓ ఐడియా ద్వారా కలిపి ఉంచాలని ప్రయత్నం ప్రతీసారి చేస్తున్నారు. అయితే అది విజయవంతంగా జరగటం లేదు.


Kamal Haasan 'Uttama Villain' review

ముఖ్యంగా కమల్ ...తన దైన కామెడీని ఉత్తముడు పాత్రద్వారా పండించాలని చూసారు కానీ అది ఫెయిలైంది. ప్రేక్షకుడుకి తన దగ్గర విషయం అర్దం కాదేమో అనే భయంతోనో మరేమో కానీ ...డిటేలింగ్ ఎక్కవ ఇవ్వటం జరిగింది. దాంత్ లెంగ్త్ ఎక్కువ అవటం కాక...చెప్పిందే చెప్పినట్లై విసుగు వచ్చేసింది. ముఖ్యంగా ఉత్తముడు కథ మొత్త దాదాపు పద్యరూపంలో సాగటం ఓ పెద్ద మైనస్.దానికి తోడు కాస్సేపు మనోరంజన్,మరికాస్సేపు ఉత్తముడు కథ..ఈ రెండింటి మధ్యా కథనం అటు, ఇటూ ఊగుతూంటుంది. దాంతో హఠాత్తుగా ఈ రెండింటికి మధ్య జరిగేది కన్ఫూజన్ కు గురి చేస్తూంటుంది.


అయితే సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. తన యుక్త వయస్సులో పుట్టిన కూతురుతో మాట్లాడే సన్నివేశాలు, తన భాధ్యతారాహిత్యాన్ని ఇష్టపడిని కొడుకులకు తను చనిపోతున్నానని చెప్పే సన్నివేశంలోనూ కమల్... అద్బుతంగా చేసారు. అలాగే తన నిజ జీవిత గురువులు బాలచందర్, కె.విశ్వనాధ్ లకు అవే పాత్రలు ఇచ్చి గౌరవించుకున్నాడు. మిగతా పాత్రల్లో ఊర్వశి,నాజర్, ఆండ్రియాలు కూడా చాలా బాగా చేసారు. ఓ విధంగా కమల్ తో పోటి అనలేం కానీ ఆ స్ధాయిలో ఎదురుగా నిలబడగలగారు. టెక్నికల్ గా కూడా అన్ని విభాగాలు బాగా చేసాయి. అయితే ఎడిటింగ్ విబాగమే కమల్ మరింత పట్టుపట్టి ఉంటే ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యేది.


Kamal Haasan 'Uttama Villain' review

ఫైనల్ గా ఇది కమల్ వీరాభిమానులకు నచ్చే చిత్రం. అలాగే వైవిధ్యమైన చిత్రాలు రావటం లేదే అనుకునే వారికి మంచి ఆప్షన్. అలా కాకుండా కమల్ నుంచి కాస్సేపు కామెడి కోరుకునేవారికి ఇది పూర్తి స్ధాయిలో నిరాసపరుస్తుంది.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


బ్యానర్:సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌
నటీనటులు: కమల్ హాసన్, ఆండ్రియా, పూజా కుమార్‌, కె.బాలచందర్‌, విశ్వనాథ్‌, జయరాం, నాజర్‌, వూర్వశి, ఎం.ఎస్‌.భాస్కర్‌, పార్వతి, చిత్ర, లక్ష్మణన్‌ తదితురులు
సంగీతం :ఎం. ఝిబ్రాన్
ఛాయాగ్రహణం: శ్యాం దత్
ఎడిటింగ్ :విజయ్ శంకర్
స్టూడియో: తిరుపతు బ్రదర్స్,రాజ్‌కమల్ ఇంటర్నేషనల్
సమర్పణ :ఈరోస్ ఇంటర్నేషనల్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కమలహాసన్‌
దర్శకత్వం :రమేష్‌ అరవింద్‌
నిర్మాత: సి కళ్యాణ్


విడుదల తేదీ: మే 1, 2015.

English summary
"Uttama Villain", starring Kamal Haasan and directed by Ramesh Aravind, released with divide talk . "Uttama Villain", which is a comedy drama, is being touted as the most iconic flick of Kamal Haasan. Ulaganayagan will portray characters of an eighth century drama artist (Uthaman) and a 21st century film star (Manoranjan).
Please Wait while comments are loading...