For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామెడీఈగ (కందిరీగ రివ్యూ)

  By Srikanya
  |

  నటీనటులు: రామ్, హన్సిక, అక్ష, సోను సూద్, కలర్స్ స్వాతి, చంద్ర మోహన్, జయప్రకాశ్ రెడ్డి, రఘు బాబు, బ్రహ్మాజీ తదితరులు
  మాటలు: కోన వెంకట్
  సంగీతం: ధమన్ ఎస్.ఎస్
  ఛాయాగ్రహణం: ఆండ్రూ
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  కథ,దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
  నిర్మాత: బెల్లంకొండ సురేష్
  విడుదల తేదీ: ఆగస్టు 12, 2011

  "జగడం సినిమా తరవాత పదిహేను నెలలు విశ్రాంతి తీసుకొని, బాగా ఆలోచించి 'రెడీ' సినిమా చేశాను. బాగా ఆడింది. ఇప్పుడు 'రామ రామ కృష్ణ కృష్ణ' తరవాత అంతే విరామం తీసుకొని మంచి కథ కోసం వెతికాను. ఈ 'కందిరీగ' చిత్రం చేస్తున్నాను" అంటూ హీరో రామ్ కందిరీగ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అయితే అది విన్న వారంతా 'రెడీ'లాంటి హిట్ చేస్తున్నాడనుకున్నారు కానీ మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి'రెడీ'నే అందిస్తున్నాడనుకోలేదు. అయితే కంటిన్యూ గా కామిడీ సీక్వెన్స్ లు పేర్చుకోవటంతో దర్శకుడు సక్సెస్ కావటంతో ఆ లోటేమీ సినిమాలో కనపడదు. మంచి టైమ్ పాస్ ఎంటర్టైనర్ గా టిక్కెట్టుకు గిట్టుబాటనిపిస్తుంది.

  డిగ్రీ కూడా పూర్తి చేయని అల్లరి చిల్లరి అవారా కుర్రాడు శీను గాడు (రామ్)కి మరదలు పెళ్ళికి ఒప్పుకోకపోవటంతో అవమానమనిపిస్తుంది. వెంటనే తను ఉంటున్న అనకాపల్లిని వదిలేసి హైదరాబాద్ చేరుకుని అక్కడ ఓ కాలేజీలో చేరిపోతాడు. అక్కడ శృతి(హన్సిక)పరిచయమై ప్రేమకి దారితీస్తుంది. అయితే శృతికి ఓ సమస్య ఉంటుంది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ లోకల్ రౌడీ భవాని(సోను సూద్)వేధిస్తూంటాడు. అంతేగాక ఆమె వంక ఎవరు కన్నెత్తి చూసినా వారి సంగతి చూస్తూంటాడు. అయితే శ్రీను, శృతి ల విషయం తెలుసుకున్న భవాని ఆమెను కిడ్నాప్ చేసి వరంగల్ రాజన్న(జయప్రకాశ్ రెడ్డి)ఇంట్లో దాస్తాడు. అక్కడికి చేరుకున్న శ్రీనుకి రాజన్న కూతురు సంధ్య (అక్ష)తననే ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. ఆమె నుంచి తప్పించుకుంటూ తన ప్రేయసిని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ.

  నిజానికి తెలుగు తెరకు చాలా పాత కథ ఇది. అయితే కోన వెంకట్ రచనతో ఈ సినిమాకు కామిడీని అద్ది సీన్స్ లో పంచ్ తెచ్చి నవ్విస్తూ కథను పట్టించుకోకుండా చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.దర్శకత్వపరంగానూ శ్రీను వైట్ల, వివి వినాయిక్ ల మార్కుతో సినిమా నడుస్తుంది. దర్శకుడు గతంలో కెమెరామెన్ కావంటంతో కొత్త దర్శకుడు అన్న తడబాటు అస్సలు కనపడదు. నటుల్లో హన్సిక క్యూట్ గానూ,రామ్ ఎప్పటిలాగే ఎనర్జి మేళవించిన ఎంటర్టైన్మెంట్ తో నూ అలరిస్తాడు. సోనూ సోద్ తన రెగ్యులర్ విలనిజాన్ని వదిలి కొంచెం కొత్తగా ట్రై చేసాడు. కథ పరంగా ఫస్టాఫ్ ప్రెష్ గా ఉన్నా జయప్రకాష్ రెడ్డి ఇంట్లోకి వచ్చినప్పటినుంచీ కథ రెడీని బాగా గుర్తుకు తెస్తుంది.

  డాన్స్ లు పరంగానూ రామ్ ఇరగతీసాడనే చెప్పాలి. ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయం అతని ప్రతీ స్టెప్ లోనూ కనపడుతుంది. బ్రహ్మానందం సీన్స్ పెద్దగా లేకపోయినా ఉన్న కాస్సేపూ బాగానే నవ్విస్తాడు. ఇంటిలెజెన్స్ ఆఫీసర్ గా రఘుబాబు కూడా సెకెండాఫ్ లో బాగా చేసాడు. అయితే క్లైమాక్స్ కొద్దిగా వీక్ గా ఉండటం, మొదటినుంచీ పేర్చుకుంటూ వచ్చిన విలన్ సమస్య కొద్దిపాటి సీన్స్ కే తేలిపోవటం ఇబ్దంది అనిపిస్తుంది.ధమన్ అందించిన సంగీతంలో రెండు పాటలు ధియోటర్ నుంచి వచ్చాక కూడా హంట్ చేస్తాయి. ముఖ్యంగా చంపకమాల.. నన్ను చంపకబాలా పాట ఇప్పటికే యూత్ కి బాగా పట్టేసింది.

  ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ లో కామిడీ శాతం ఎక్కువగా ఉండటంతో అన్ని వర్గాలకూ పట్టే అవకాశం ఉంది. కథ కొత్తగా ఉండాలి, పాయింట్ బాగుండాలి వంటి ఛాదస్తాలు పెట్టుకోకుండా ప్రెష్ మైండ్ తో వెళితే బాగుందనిపిస్తుంది. అయితే ఈ హిట్ మళ్లీ రామ్ చేత మరో రెడీ మూడో వెర్షన్ కి రెడీ చేయిస్తుందో అన్న భయమే చివరలో కలుగుతుంది.

  English summary
  Ram’s latest movie 'Kandireega'. Hansika is paired up with Ram for the second time. Santosh Srinivas is making his debut as a director with Kandireega. Bellamkonda Suresh is the producer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X