Kantara Chapter 1 First Review: కాంతార చాప్టర్ 1 మూవీ ఫస్ట్ రివ్యూ
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు.
ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కంతార చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను, కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమా గురించి సెన్సార్ రివ్యూ ఎలా ఉంటుందనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. ఇటీవల జరిగిన సెన్సార్ రివ్యూలో అధికారులు ఏం చెప్పారనే విషయంలోకి వెళితే..

కాంతర చాప్టర్ 1 సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చెందిన కన్నడ తొలి రాజవంశం కదంబ వంశీకులకు సంబంధించి 4 శతాబ్దంలో జరిగే కథ. విజయేంద్ర అనే రాజు పాలనలో ఎవరికీ అంతు చిక్కని ప్రదేశంలో దైవానికి, ఓ రాణికి మధ్య జరిగే ఎమోషనల్ సంఘర్షణ. ఆ కాలంలో సంస్కృతులు, ఆచారాలు, దేవుడిపై అక్కడి ప్రజలకు ఉండే మూడ నమ్మకాలు, భక్తి ఇలాంటి అంశాలన్నీ కలబోసిన కథ అనే బయటకు వచ్చింది. ఓ యువరాణి (రుక్మిణి వసంత్)కు గ్రామ యువకుడికి మధ్య ప్రేమ.. వారి ప్రేమపై రాజ్యాధికారం ఎలా స్పందించింది అనే చూఛాయగా చెప్పుకొనే కథ. అయితే ఇలాంటి కథకు రూపొందించిన బ్యాక్ డ్రాప్, సన్నివేశాలు ప్లస్ పాయింట్ అని చెప్పుకొంటున్నారు. అంతేకాకుండా సన్నివేశాలను ఎలివేట్ చేసే నటీనటులు పెర్ఫార్మెన్స్, అజనీష్ మ్యూజిక్ మరో హైలెట్ అని వెల్లడించారు.
కాంతార చాప్టర్ 1 సినిమాను తమ సెన్సార్ ఫార్మాలిటీస్‌లో భాగంగా అధికారులు చూడటం జరిగింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి రూపొందించిన విధానం.. కథను తెరపైన చూపించిన విధానం.. అలాగే రుక్మిణి వసంత్ పాత్రను కథలో జొప్పించిన విధానంపై అధికారులు ఇంప్రెస అయ్యారు. స్టోరిని ఓ కొత్త ప్రపంచంగా మార్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంది. ప్రేక్షకులు రిసీవ్, ఓన్ చేసుకొనే తీరుపైనే ఈ సినిమా విజయవకాశాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారని చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వెల్లడించారు.
ఇక ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్రిల్లింగ్ అంశాలు, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. దాంతో ఈ సినిమా ఒక కట్‌ను సెన్సార్ బోర్డు అధికారులు సూచించారు. అలాంటి కట్‌తో ఈ సినిమాకు యూఏ (UA) సర్టిఫికెట్‌ను అందించారు అని చిత్ర యూనిట్ అధికారంగా వెల్లడించింది.
కాంతార చాప్టర్ 1 సినిమా ఇటీవల కాలంలో కన్నడ సినిమా పరిశ్రమలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) ఆమోదించిన ప్రకారం.. ఈ మూవీ నిడివి 169 నిమిషాలు అంటే.. 2 గంటల 49 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. కన్నడలో తొలి రాజవంశం చరిత్ర, అందులో పాత్రలను క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నిడివిని పెంచాల్సిన అవసరం వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











