»   »  పాత కాన్సెప్టే, యూత్‌ను టార్గెట్ చేసారు (కేరింత రివ్యూ)

పాత కాన్సెప్టే, యూత్‌ను టార్గెట్ చేసారు (కేరింత రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
హైదరాబాద్: నిర్మాత దిల్‌రాజు ఏదైనా సినిమాతో వస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఓ ఆస్తి ఉంటుంది. కారణం ఆయన సినిమాలు కుటుంబ ప్రేక్షకులను, యూత్ ను ఆకట్టుకునే విధంగా మంచి విలువలతో కూడి ఉంటాయి. తాజాగా ఆయన ‘కేరింత' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

ఈ తరం యువత కాలేజీ జీవితం, ఆ సమయంలో ప్రేమ వ్యవహారాలు, ఆ తర్వాత వారి కెరీర్, బాధ్యతలను ప్రతిభించిస్తూ సినిమా తెరకెక్కించారు. సినిమా సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి తప్ప అంతా కొత్తవారినే తీసుకున్నారు. వినాయకుడు ఫేం సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించిన ఈచిత్రం మొదటి నుండి కేవలం దిల్ రాజు బ్రాండ్ ఇమేజ్ తోనే ప్రచారంలో ఉంది.

Kerintha Movie Review

కథ విషయానికొస్తే...
మూడు జంటల ప్రేమకథ ఇది. కాలేజీ ఫ్రెండ్స్ జై(సుమంత్ అశ్విన్), నూకరాజు (పార్వతీశం), సిద్దార్థ్ (విశ్వనాథ్), ప్రియా(తేజస్వి), భావన(సుకీర్తి) మంచి స్నేహితులు. జై , మనస్విని(శ్రీ దివ్య) ని బస్సులోచూని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కోసం చాలా వెతుకుతాడు. ఆమె దొరికిన తర్వాత ప్రేమ విషయం తెలియజేయడానికి ఇబ్బంది పడతాడు. తండ్రి కూలి చేసి చదువుకోసం డబ్బు పంపిస్తే చదువుకోకుండా ఫేస్ బుక్ లో ప్రేమ కోసం ప్రాకులాడుతుంటాడు నూకరాజు. భావన తనను ప్రేమిస్తున్నా ఆ విషయం గ్రహించలేడు. తీరా గ్రహించాక ఆమె అతన్ని దూరం పెడుతుంది. సిద్ధార్థ్ కి మ్యూజిక్ అంటే ప్రాణం. ప్రియా ప్రేమిస్తాడు. అయితే ఈ విషయాలు ఇంట్లో చెప్పడానికి భయపడతాడు. ఈ ముగ్గురి కాలేజీ జీవితం, ప్రేమ కథల, తర్వాత ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే కేరింత సినిమా.


పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే..
సుమంత్ అశ్విన్ పెర్ఫార్మెన్స్ లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. పాత్రలు మారుతున్న అతని నటనలో మార్పు కనిపించడం లేదు. పాత్రలకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఇలా చాలా విషయాల్లో సుమంత్ అశ్విన్ పరిణితి చెందాల్సి ఉంది. ఈ సినిమాలో శ్రీదివ్య పాత్రకు నిడివి, ప్రాధాన్యత తక్కువే. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. తేజస్వి పెర్ఫార్మెన్స్ పాత్రకు తగిన విధంగా ఆకట్టుకునే విధంగా ఉంది. కొత్త అమ్మాయి సుకీర్తి తన పాత్రలో బాగా నటించింది. శ్రీకాకుళం యాసతో పార్వతీశం మెప్పించాడు. విశ్వనాథ్ పెర్ఫార్మెన్స్ జస్ట్ యావరేజ్. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.


దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్టులో కొత్తదనం లేక పోయినా... ఇప్పటి యువతరం అభిరుచులను మేళవించి సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ వారిని ఎంటర్టెన్ చేసే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాస్త వైవిధ్యం చూపించినా సినిమా నడుస్తున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో విఫలం అయ్యాడు. ఎంటర్టెన్మెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. హ్యాపీ డేస్ సినిమా జాడలు సినిమాలో కనిపిస్తూ ఉంటాయి.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. మిక్కీజే మేయర్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆట్టుకునే విధంగా ఉంది. విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సెకండాప్ లో ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి. డైలాగులు ఫర్వాలేదు.


పూర్తి స్థాయిలో యువతను టార్గెట్ చేస్తూ సాగిన ఈ సినిమా ఓవరల్ గా ఫర్వలేదు. తొలి సగం కాలేజీ సీన్లు, కామెడీ సీన్లతో సాగిపోతుంది. అయితే సెకండాఫ్ సెంటిమెంటుతో కాస్త సాగదీసినట్లు ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఫర్వాలేదు.

English summary
Dil Raju, who earlier produced path-breaking youthful entertainers like Aarya and Kotha Bangaru Lokam, is again coming with a promising youthful flick, Kerintha. Let us see if his midas touch has anything to do with the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu