twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదును లేని ఖడ్గం

    By Staff
    |

    Khadgam
    - జలపతి
    చిత్రం: ఖడ్గం
    నటీనటులు: శ్రీకాంత్‌, రవితేజ, ప్రకాష్‌ రాజ్‌,
    సంగీత, సోనాలి, బ్రహ్మాజీ, పూజాభారతి, ఉత్తేజ్‌
    సంగీతం: దేవీశ్రీప్రసాద్‌
    నిర్మాత: మధుమురళి
    కథ, దర్శకత్వం: కృష్ణవంశీ

    ప్రధాన ఎన్నికల కమీషనర్‌ జె.ఎం.లింగ్డో కరుకు చేష్టలతో డీలాపడిపోయిన ఆరెస్సెస్‌, విఎచ్‌ పి సంస్థలు ఆనందపడే సమయం వచ్చింది. వారి తరఫున గట్టిగా వాదించే ఒక ఫిల్మ్‌ మేకర్‌ ఆంధ్రప్రదేశ్‌ లో వారికి దొరికాడు. ఆయనే కృష్ణవంశీ. వారికి ఆయన ఖడ్గం అందించాడు. ఇటీవల అమెరికాపై బాంబు దాడుల నుంచి, ఇటీవల జరిగిన గుజరాత్‌ అల్లర్ల వరకు అన్నింటిని స్పృశిస్తూ..తీసిన ఈ చిత్రం మౌళికంగానే ఎన్నో లోపాలతో కూడుకున్నది. గతంలో కోడి రామకృష్ణ తీసిన దేశభక్తి చిత్రాలకు ఖడ్గం సోఫెస్టికేటర్‌ వర్సన్‌.

    దేశంలో మత కల్లోహాలు జరగకూడదని దర్శకుడి అభిప్రాయమైతే కావొచ్చు గానీ, చిత్రం చివరికి ముస్లింలను శత్రువులుగా చూపించింది. ముషారఫ్‌, ఒసామా బిన్‌ లాడెన్‌ ల ఫోటోలను తగలబెట్టడం, మాదర్‌ ఛో... లాంటి అసభ్యపదాలను చేర్చడం అభ్యంతరకరం. ఒక దేశాధినేత ఫోటోను తగలబెట్టినా సెన్సార్‌ వారు కట్‌ చేయకపోవడేమిమిటో అర్థం కాదు. బహుశా, సెన్సార్‌ వారు చేతిలో ఖడ్డం లేదేమో!

    ఈ చిత్రం రెండు అంశాలతో ప్యారలల్‌ గా నడుస్తుంది. ఒకటి సినిమా రంగంపై సెటైర్లు, రెండోది దేశభక్తి అంశం. ఈ రెండింటిని కలగలపి కృష్ణవంశీ ఈ చిత్రం తీయాలనుకున్నాడు. మొదటి అంశమే కాస్తా రియలిస్టిక్‌ గా ఉంది. ఇక దేశభక్తి కన్నా జింగోయిజమే ఎక్కువ చిత్రంలో. ముస్లిం పాత్రధారి అంజాద్‌ భాయి వందేమాతరం అనడం, పాకిస్థాన్‌ కుక్కలు అని అరవడం లాంటి ఛీఫ్‌ ఎమోషనల్‌ గిమ్మిక్కులతో సినిమా ఆసాంతం నడుస్తుంది.

    రవితేజ హీరో కావాలని అనుకుంటాడు. ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తుంటాడు. పక్కనే ఉంటే ఆటోడ్రైవర్‌ అవ్జుద్‌ భాయి(ప్రకాష్‌ రాజ్‌) ఆటో నడపడం కన్నా దేశభక్తి మీద, ముస్లిం మతం మీద లెక్చర్లు ఇవ్వడం పైనే ఎక్కువగా దృష్టిపెడుతుంటాడు. వీరికి ఓ మిలిటరీ ఆఫీసర్‌ దోస్త్‌. ఈ మిలిటరీ దోస్త్‌ కు డిసిపి రాధాకృష్ణ(శ్రీకాంత్‌) మరో దోస్త్‌. వీరి అంతా కలిసే ఉంటారు. రాధాకృష్ణ తన ప్రియురాలు(సోనాలి) టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ లో కోల్పోతాడు.

    సోనాలిని చంపిన వ్యక్తి ఎవరో కాదు ప్రకాష్‌ రాజ్‌ తమ్ముడు. అతను కరుడుగట్టిన తీవ్రవాది. కానీ ఆ విషయం ప్రకాష్‌ కు తెలియదు. క్లైమాక్స్‌ లో తమ తీవ్రవాద నాయకుడుని విడిపించేందుకు అతను వ్యూహం పన్నుతాడు. అయితే, తమ్ముడిపై ప్రేమ కన్నా దేశం ముఖ్యం అనుకున్న ప్రకాష్‌ అతన్ని కాల్చేమని రాధాకృష్ణకు చెప్పుతాడు. అలా ఖడ్గం ముగుస్తుంది.

    తెలుగు సినిమా హీరోలపై సెటైర్లు, హీరోయిన్ల వేషాల కోసం అమ్మాయిలు వలలో పడుతోన్న వైనం వంటి అంశాలు బాగున్నాయి. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ కూర్చిన రీరికార్డింగ్‌, భూపతి సమకూర్చిన ఫోటోగ్రఫీ బాగున్నాయి. మరీ జింగోయిజం అధికం అవడం, కథలోగానీ, స్క్రీన్‌ ప్లేలో గానీ కొత్తదనం లేకపోవడం చిత్రంలో పెద్ద లోపాలు. కృష్ణవంశీని ఆరెస్సెస్‌ వారు తప్పకుండా సత్కరిస్తారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X