»   »  కిక్-ఫస్టాఫే క్లిక్(రివ్యూ)

కిక్-ఫస్టాఫే క్లిక్(రివ్యూ)

By Staff
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Kick

  Kick

  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  చిత్రం: కిక్
  సంస్థ: ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌
  నటీనటులు: రవితేజ, ఇలియానా, శ్యామ్‌, ఆషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్‌,
  అలీ, సాయాజీ షిండే, చలపతిరావు, నళిని, ప్రభ తదితరులు
  కెమెరా: రసూల్
  కథ: వక్కంతం వంశి
  సంగీతం: ఎస్.ఎస్.తమన్
  ఎడిటింగ్: గౌతంరాజు
  మాటలు: అబ్బూరి రవి
  సమర్పణ: కె.అచ్చిరెడ్డి
  నిర్మాత: వెంకట్‌
  దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
  రిలీజ్ డేట్: 8 మే 2009

  వరస చెత్త చూస్తున్నాం..ఇదైనా కిక్కు ఇస్తుందంటావా..రవితేజ,సురేంద్రరెడ్డి తొలి కాంబినేషన్ కదా...కసిగా చేసుంటారు..అంటూ కిక్ ధియోటర్స్ లో దూరిన వాళ్ళకి కిక్ సగమే దొరికింది.ప్రారంభంలో అదిరిపోయే హీరో క్యారెక్టరైజేషన్ తో హీటెక్కిన సినిమా కథ దగ్గరకు వచ్చేసరికి చల్లపడింది. ఇక అర్జున్ జెంటిల్ మెన్ చిత్రాన్ని లేటెస్ట్ వెర్షన్ లో చూస్తున్నట్లు ఉన్న ఈ చిత్రంలో రవితేజ మ్యానరిజమ్స్, ఇలియానా ఒంపుసొంపులు, రసూల్ కెమెరా సినిమాను ఎనర్జీ లెవిల్స్ లో ఉంచటానికి ట్రై చేసాయి.బి,సి సెంటర్స్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రానికి ఏ సినిమాలు పోటీ లేకపోవటం కొంతలో కొంత కలిసివచ్చే అంశం.

  మలేషియాలో నైనా(ఇలియానా)కి పోలీస్ ఆఫీసర్ కళ్యాణ కృష్ణ(తమిళ హీరో శ్యామ్)కి పెళ్ళి చూపులు. ఆమె మాటల్లో మాటగా తను ఒకరికి బుద్ది చెప్పాలని తన ప్రేమ కథని శ్యామ్ కి చెప్తుంది. ఆ కథలో కళ్యాణ్ (రవితేజ) గురించి ఉంటుంది. రవితేజ చిన్నప్పటి నుంచీ కిక్..కిక్ అంటూ కలవరిస్తూంటాడు. అందుకుతగ్గట్లుగానే కిక్ ఇవ్వని ఏ పనీ చెయ్యడు...కిక్కు ఇస్తుందంటే ఎటువంటి పని చెయ్యటానికైనా వెనకాడడు..అంతేగాక కిక్ తగ్గిపోతే ఆ పనిలో కొనసాగటానికి ఇష్టపడడు. దాంతో ఏ ఉద్యోగంలోనూ వారం మించి పనిచేయడు. అలాంటి అతని విచిత్ర జీవితంలోకి ప్రతీది పెపఫెక్ట్ గా ఉండాలనుకునే ఇలియానా ప్రవేశిస్తుంది. అతని ఏటిట్యూడ్ చూసి మొదట ఆమె కసురుకున్నా తర్వాత ప్రేమలో పడుతుంది. పడిందే తడువుగా అతన్ని ఏదన్నా ఉద్యోగంలో చేరి సెటిల్ అవ్వమంటుంది.

  దానికి ఒప్పుకోలేదని ఆమె బై చెబుతుంది. ఇదంతా విన్న పెళ్లికొడుకుతనను ఒకడు ముప్పు తిప్పలు పెడుతున్నాడని, అతన్ని పట్టుకోవటానికే మలేషియా వచ్చానని ప్లాష్ బ్యాక్ విప్పుతాడు. అతని ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ ఓ గజ దొంగ. అతన్ని పట్టుకోవటానికి స్ట్రిక్టు పోలీస్ ఆఫీసర్ శ్యామ్ ప్రత్యేకంగా నియమింపబడతాడు. అయితే రవితేజ తన ముఖం కనపడకుండా మాస్క్ వేసుకుని దొంగతనాలు చేస్తూంటాడు. దాంతో శ్యామ్ కి దొరకక ట్విస్ట్ లు ఇస్తూంటాడు. అతని పట్టుకోవటమే శ్యామ్ తన జీవితాశయంగా చెపుతాడు. ఇక ఇద్దరికి ఎదుటి వారు చెప్పేది తనకి తెలిసిన రవితేజ గురించేనన్న విషయం తెలియదు. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ లోనే రవితేజ వారికెదురుకుండా ప్రత్యక్ష్యమవుతాడు. ఇంతకీ రవితేజను..ఆ పోలీస్ ఆఫీసర్ గుర్తించి పట్టుకుంటాడా..ఇలియానా మళ్ళీ ఎలా దగ్గరైంది...అసలు రవితేజ ఎందుకు దొంగగా మారాడు అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

  ఇక అర్జున్ జెంటిల్ మెన్ ని పూర్తి స్ధాయిలో గుర్తు చేసే ఈ సినిమాలో రవితేజ పాత్రను కొత్తగా చిత్రీకరించినందుకు రచయితను మెచ్చుకోవాలి. అయితే తనకు కిక్ వస్తుందంటే ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టే యువకుడు నిజమైన కిక్ మానవత్వంలోనే దొరుకుతుంది అనే పాయింట్ ని మరింత బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది అనిపిస్తుంది. అలాగే కిక్ అంటూ ముందుకెళ్లే హీరోకి తనకు తెలియకుండానే తన ద్వారానే జరిగిన ఓ సాయిం వల్ల ఎదుటి వాళ్ళ జీవితంలో ఆనందం కనపడితే దాంట్లోనే అతనికి నిజమైన కిక్ దొరికితే దాన్ని అనుసరించి కొనసాగిస్తే ఇంకా బాగుండేది. అలాచేస్తే హీరోలో మార్పు కోసం క్యాన్సర్ పాప(అల్టిమేట్ గిఫ్ట్ సినిమాలో) ఎపిసోడ్ ని బలవంతంగా చొప్పించినట్లు అన్పించదు.

  ఇక సినిమాలో విలన్ పాత్ర లేకపోవటం,హీరో కంటిన్యూగా ఎక్కడా ఇరుకున పడకుండా సమస్యలు లేకుండా దూసుకుపోవటంతో టెన్షన్ పుట్టక స్క్రీన్ ప్లే లోపాలై నిలుస్తాయి. అలాగే హీరోయిన్ తో విడిపోయిన తర్వాత రవితేజ ఆమె లేకపోవటాన్ని ఎక్కడ ఫీలవడు. అంతెందుకు స్క్రీన్ ప్లే రచయితలు అతని మనస్సులో ఏముందో ప్రేక్షకులకు తెలియనివ్వరు.అతని మనస్సులో ఏముందో తెలిస్తే..అతనితో ప్రేక్షకుడు లీనమై గేమ్ మరింత రక్తి కట్టేది. ఎంతసేపు విలన్,ఇలియానా,మిగతా పాత్రల మనస్సులో ఏముందో తెలిస్తూంటుంది కానీ హీరో ఏం చేయబోతున్నాడో అర్ధం కాదు. అంటే అతని వైపు నుంచి కథ ప్రారంభించకపోవటంలోనే సమస్య వచ్చిది.అలాగే ఆ తర్వాత చిన్న పిల్లల ఆరోగ్యం కోసం దొంగతనాలు చెయ్యటం, పోలీసు ఇన్విస్టిగేషన్ అనేది జరగటం క్యారెక్టర్ డ్రైవన్ డ్రామాలో లోపంగా అనిపిస్తుంది.ఇక హల్వా రాజ్ గా బ్రహ్మానందం,మొమరీ లాస్ పేషెంట్ గా అలీ, ఎస్సైగా జయప్రకాష్ రెడ్డి కథకు పెద్ద ఉపయోగపడకపోయినా నవ్వులు బాగానే పూయించారు. మై హూనా సినిమాలోంచి తీసుకున్న బ్రహ్మానందం పాత్ర వెనుక వచ్చే పియోనో వాయించే వాళ్ళు బావున్నారు.అబ్బూరి రవి సంభాషణలు అక్కడక్కడా త్రివిక్రమ్ ని గుర్తు చేస్తాయి. అలాగే పాటలు మరింత బాగుంటే వర్కవుట్ అయ్యేది.కెమెరా రసూల్..తన పనితనం మరోసారి చూపాడు. ఎడిటింగ్, సురేంద్రరెడ్డి దర్శకత్వం ఎక్సపెక్ట్ చేసిన రీతిలో లేవు గానీ నిరాశపరచవు.

  ఏదైమైనా కాస్సేపు నవ్వుకోవటానికి కిక్ వైపు అడుగులు వెయ్యవచ్చు. అయితే గతంలో రవితేజ సినిమాలు ఇచ్చినంత కిక్ ఈ సినిమా ఇవ్వదు. అలాగే సురేంద్రరెడ్డి అతిధి కన్నా బాగుంది. అంతేగాక రవితేజ, ఇలియానా గతం కాంబినేషన్ ఖతర్నాఖ్ కన్నా చాలా బాగుంది. సెకెండాఫ్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి పస్టాఫ్ చూసి ఆ కిక్ తో బయిటకు రావటం బెటర్ అనిపిస్తుంది(అలా చేయలేం అనుకోండి). లేకపోతే మొత్తం కిక్ దిగిపోతుంది.

   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more