twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిల్లర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5

    ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌, టి.శ్రీధర్‌ 'కిల్లర్‌' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌గా నటిస్తుంది. సైమన్ కె కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగ విజయ్ ఆంటోనీ, అర్జున్ ల కలయికగా వస్తున్న ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనికి ఈ సినిమా ఏ రేంజ్ ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కిల్లర్ మూవీ కథ

    కిల్లర్ మూవీ కథ

    ప్రభాకరన్ (విజయ్ ఆంటోని) నికార్సైన పోలీస్ అధికారి. కొన్ని కారణాల వల్ల ఉద్యోగాన్ని వదిలేసి తన ఇంటి ఎదురుగా ఉన్న జయంత (ఆషియా నర్వాల్)ను వెంటాడుతుంటాడు. మంత్రి బంధువు వంశీ అనే రౌడీని జయంత హత్య చేస్తుంది? అయితే వంశీ అనే రౌడీ ఓ మర్డర్ కేసును ఛేదించడానికి కార్తీకేయ (అర్జున్)ను ఆఫీసర్‌గా నియమిస్తారు. ఆ కేసులో ప్రభాకరన్‌ను కార్తీకేయ అనుమానిస్తాడు. ఈ క్రమంలో హత్య చేసింది నేనే అంటూ నేరాన్ని ఒప్పుకొంటాడు.

    కిల్లర్ మూవీలో ట్విస్టులు

    కిల్లర్ మూవీలో ట్విస్టులు

    జయంత చేసిన హత్యను తన మీద ఎందుకు వేసుకొన్నాడు? విచారణ సందర్భంలో నేను ఎన్ని హత్యలకైనా సిద్ధమే ఎందుకు అంటాడు? విధి నిర్వహణలో ప్రభాకరన్ తన జీవితంలో ఏం కోల్పోయాడు? రౌడీ మూకల అంతం చూసే ప్రభాకరన్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కార్తీకేయ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు అనే ప్రశ్నలకు సమాధానమే కిల్లర్ సినిమా కథ.

    ఫస్టాఫ్

    ఫస్టాఫ్

    ఓ అమ్మాయిని రౌడీ వెంటాడి గొంతు కోసి చంపడమనే అంశంతో ఓ సస్సెన్స్ క్రియేట్ చేస్తు కథ ప్రారంభమవుతుంది. మర్డర్ మిస్టరీతో కథ అనేక మలుపులు తిరుగుతుంది. అలాగే దర్శకుడు అండ్రూ లూయిస్ చేయి తిరిగిన స్క్రిన్ ప్లే ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుడిని ఆసక్తి ప్రతీ సీన్‌కు రెట్టింపు అవుతుంది. ఓ ఆసక్తికరమైన ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    కార్తీకేయ, ప్రభాకరన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ మాదిరి స్క్రిన్ ప్లేతో సినిమా పరుగులు పెడుతుంది. సెకండాఫ్‌లో ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్‌తో కథ మరింత ఎక్సైంటింగ్‌గా మారుతుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రభాకరన్ జరిగిన అన్యాయం ప్రేక్షకుడిని భావోగ్యానికి గురిచేసేలా ఉంటుంది. జయంత చేసిన హత్యను ఎందుకు తనపై వేసుకొని పోలీసులను తప్పు దారి పట్టించారనే అంశం కన్విన్స్‌గా ఉంటుంది.

    డైరెక్టర్ అండ్రూ లూయిస్ గురించి

    డైరెక్టర్ అండ్రూ లూయిస్ గురించి

    అర్జున్, విజయ్ ఆంటోని పాత్ర మధ్య సంఘర్షణ, హంతకుడి వేట అంశాలతో అండ్రూ లూయిస్ రాసుకొన్న కథకు సన్నివేశాలు బలంగా తోడయ్యాయి. ఇంట్రస్టింగ్ కలిగించే విధంగా స్క్రిన్ ప్లే ఈ సినిమాకు ప్లస్. కథలో కొత్తదనం లేకపోయిన కథనంతో సినిమాపై పట్టు సాధించాడు దర్శకుడు. అర్జున్, విజయ్ ఆంటోని యాక్టింగ్ స్ట్రెంత్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న అద్భుతంగా తెరపైన ఆవిషృతం అయ్యాయి. కథలో దర్శకుడు రాసుకొన్ని గ్రిప్పింగ్ పాయింట్ సినిమాపై సానుకూలమైన అభిప్రాయం ఏర్పడటానికి కారణమైందని చెప్పవచ్చు.

    విజయ్ ఆంటోని గురించి

    విజయ్ ఆంటోని గురించి

    విజయ్ ఆంటోని రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను చాలా బాగా పోషించాడు. రెండు రకాల వేరియన్స్‌ను విభిన్నంగా పలికించడంలో సక్సెస్ అయ్యాడు. ఆషిమా నర్వాల్‌తో కెమిస్ట్రీ పండించాడు. గత చిత్రాలతో పోల్చుకొంటే ప్రభాకరన్ ఈ సినిమాలో మంచి నటన, యాక్షన్, ఎమోషనల్ పాయింట్స్‌ను పలికించాడని చెప్పవచ్చు.

    అర్జున్ మర్డర్ మిస్టరీ

    అర్జున్ మర్డర్ మిస్టరీ

    మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ కార్తీకేయగా మరోసారి ది బెస్ట్ నటనను ప్రదర్శించాడు. కీలక సన్నివేశాల్లో అర్జున్ పాత్ర తెరపైన రియాక్ట్ అయిన తీరు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సహజమైన నటనను ప్రదర్శించాడు. ఈ సినిమాకు అర్జున్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఓ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నారు.

    హీరోయిన్ పాత్ర గురించి

    హీరోయిన్ పాత్ర గురించి

    ఆషిమా నర్వాల్ పాత్ర కొంత మేరకే గ్లామర్‌కు పరిమితమైంది. నటనకు కూడా పెద్దగా స్కోప్ లేకపోయింది. సినిమా కథంతా అర్జున్, విజయ్ ఆంటోని పాత్రలపై ఉండటంతో దాదాపు అతిథి పాత్రనే అనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్నిసీన్లలో ఆకట్టుకొన్నది.

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌గా

    టెక్నికల్ విభాగంలో పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. లైటింగ్, కలర్ ప్యాటర్న్ ప్రభావం తెరమీద సన్నివేశాలు మరింత అందంగా కనిపించాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కిల్లర్ మూవీ రెండు బలమైన పాత్రలతో పక్కా మర్డర్ మిస్టరీగా రూపొందింది. హంతకుడి వేటలో విజయ్ అంటోని, అర్జున్ మధ్య క్యాట్ అండ్ మౌజ్ ఫర్‌ఫెక్ట్ సెట్ అయింది. డిటెక్టివ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లకు కనెక్ట్ అయితే కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుంది.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్
    విజయ్ ఆంటోని, అర్జున్ ఫెర్ఫార్మెన్సెస్
    స్టోరీ
    స్క్రీన్ ప్లే
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    మైనస్ పాయింట్స్
    కొన్ని పాటలు
    ఎక్కువగా ట్విస్టులు

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: అర్జున్ సర్జా, విజయ్ అంటోని, అషిమా నర్వాల్, నాజర్ తదితరులు
    దర్శకత్వం: అండ్రూ లూయిస్
    నిర్మాత: ప్రదీప్
    మ్యూజిక్: సైమన్ కే కింగ్
    సినిమాటోగ్రఫి: ముఖేష్
    ప్రొడక్షన్: దివ్య మూవీస్
    రిలీజ్ డేట్: 20019-06-06

    English summary
    Arjun Sarja, Vijay Anthoni's latest movie Killer. Ashima Narwal is the heroine. This movie sneak peak and audio released in hyderabad. Arjun Sarja, Vijay Anthoni, Ashima Narwal attended for event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X