twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకొంచె 'టచ్‌' కావాలి!

    By Staff
    |

    Konchamtouch
    - జోశ్యుల సూర్యప్రకాష్‌
    చిత్రం: కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను
    నటీనటులు: శివాజీ, వేద, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం,
    జీవ,ఎంఎస్‌ నారాయణ, కృష్ణ భగవాన్‌, మేల్కోటే, జోగిరాజు,
    సుమన్‌ శెట్టి, చిత్రం సీను, కాంచి, ఎవిఎస్‌, కొండవలస లక్ష్మణరావు
    కథ,మాటలు: శంకరమంచి పార్ధ సారధి
    పాటలు: వెన్నెలకంటి
    సంగీత: చక్రి
    ఛాయాగ్రహణం: ఎంవి రఘు
    దర్శకత్వం: వంశీ
    నిర్మాత: వి.దొరస్వామి రాజు

    సృజనాత్మకత, వినోదం కలగలిపి చక్కని సినిమాలు తీసే వంశీ, ఇప్పుడిప్పుడే మంచి దర్శకుల చేతిలో కెరియర్‌ను మలుచుకుంటున్న 'శివాజీ'ల కాంబినేషన్‌లో 'సింహాద్రి' వంటి సెన్సేషనల్‌ హిట్‌ అందించిన విఎంసి బ్యానర్‌ కింద వచ్చిన సినిమా ఈ 'కొంచెం టచ్‌ ఉంటే చెబుతాను'.

    క«థ: కాళిదాసు (శివాజీ) అనే ఒక మధ్యతరగతి ఉద్యోగి ఒక రోజు టీవీలో అలకనంద (వేద) అనే అందగత్తెను చూసి మనసు పారేసుకుని, పాటల్లో వెదుక్కుంటూ ఉంటాడు. అలకనంద ఫ్లవర్‌ బొకేల షాపు నడుపుతున్నా సామాన్యురాలు కాదు. కోటీశ్వరుడు జెకె (ప్రకాష్‌రాజ్‌) ఏకైక గారాల బిడ్డ. తనకంటూ వ్యక్తిత్వం, సంపాదన వగైరా ఉండాలనుకుని షాపు నడుపుతుంటుంది.

    కాళిదాసు దేవదాసులా మారేలా ఉన్నాడని మిత్రులు సాయం పడితే అలకనంద బొకేలో ప్రేమలేఖ పెట్టుకుని ఒక సాయంకాలం రూముకి వస్తుంది. కాళిదాసు ప్రియురాలు అమెరికా అలిగివెళ్ళిందని, అందుకే ఇలా అయ్యాడని అతని స్నేహితులు చెప్పి మిస్‌ని మిస్‌లీడ్‌ చేసి ఇద్దరికి కలిపి వెళ్ళిపోతారు.

    చివరికి నిజం తెలుసుకుని అలకనంద అలక వహించకుండా డేటింగ్‌ తరహాలో ఒక డేట్‌ ( వలైంటీన్స్‌ డే) ఇచ్చి 'టచ్‌లో ఉండి, పరిశీలించి' చెబుతాను అంటుంది. అదే డేట్‌కి వేరే గొడవలో ప్రకాష్‌రాజ్‌ హీరోకి చావు ముహుర్తం పెడతాడు. చావును తప్పించుకుని కాళిదాసు అలకనందను ఎలా సాధించుకున్నాడన్నదే కథ.

    కథ బాగున్న ఈ సినిమా స్క్రీన్‌ప్లే సరిగా లేక ఇంటర్వల్‌కే ముగింపునకు వచ్చేసింది. ఇంటర్వల్‌ బ్యాంగ్‌ ్రస్టాంగ్‌గా ఇవ్వాలన్న ఆతృతలో హీరోయిన్‌, విలన్‌ ఇద్దరి చేత ఒకేసారి టైం లాక్‌ పెట్టించడంతో సెకండాఫ్‌లో టెంపోలేక చప్పబడింది. టైంలాక్‌ పెట్టాక ఆ కాలాన్ని చూపెట్టకపోవడం (ఎప్పటికప్పుడు కౌంట్‌డౌన్‌ ఇవ్వకపోవడం) లోపమే. సినిమాలో రెండో మలుపు లేకపోవడంతో కథ ఫ్లాట్‌గా సాగి ప్రేక్షకుల ఎమోషన్స్‌ పట్టుకోలేకపోతుంది. దర్శకుడిగా వంశీకి మంచి మార్కులు పడ్డాయి.

    హీరోయిన్‌ ప్రేమను వెంటనే ఒప్పుకోకపోయినప్పుడు హీరో మొహంపై చూపిన పావురం సింబాలిక్‌ షాట్‌ వంశీ ప్రతిభకు మచ్చుతునక. పాతపాటలపై ఉన్న ప్రేమతో మంచి మెలోడీ 'చిలిపి కనుల చక్కని చెలికాడ' ని రీమిక్స్‌ రూపంలో తెచ్చారు. అభినందనీయమే కానీ అటువంటి పాటలను చక్రితో కలిసి సృష్టించ గల మ్యూజిక్‌ టాలెంట్‌గల వంశీ కొత్త పాటను సృష్టిస్తే బాగుండేది.

    కలియుగ రావణాసురుడు చిత్రంలోని రావు గోపాలరావు తరహా ఇన్సూరెన్స్‌ విలన్‌గా ప్రకాష్‌రాజ్‌ జీవించాడు. ఎవిఎస్‌, కొండవలస, బ్రహ్మానందం, వేణుమాధవ్‌ల ఎపిసోడ్స్‌ విడివిడిగా ఉన్నా బాగున్నాయి. శంకరమంచి మాటలు మంచి పంచ్‌తో సాగినా కొన్ని పాత చింతకాయ పచ్చడి జోకులు ప్రేక్షకుల నవ్వులకు బ్రేకులు వేస్తాయి. శివాజీ స్వరం సెకండాఫ్‌లో మారడం (డబ్బింగ్‌ ఆర్టిస్టును మార్చారు) స్పష్టంగా తెలుస్తుంది. ఛాయాగ్రహణం ఛాయలను చక్కగా పట్టుకుని ఆహ్లాదం కలిగించింది.

    ఎంఎస్‌ నారాయణ ఈజీ మనీ ఎపిసోడ్‌ చాలా బాగున్నా క్లోజింగ్‌ ఎడిట్‌ చేయడంతో ముగింపు లేకుండా పోయింది. దానితో ఫైట్‌ మాస్టర్‌ రాజు ఉన్న సీన్‌ ప్రేక్షకులకు అర్ధం కాదు. అంత తెలివైన అమ్మాయికి తండ్రి చేసే దొంగ వ్యాపారం తెలియకపోవడం, ఆ ఫైళ్ళు ఇంటికి తేవడం వంటి స్క్రిప్టు లోపాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోనవసరం లేదు. అసభ్యత లేని మంచి ఫామిలీ ఎంటర్‌టైనర్‌.

    దట్స్‌తెలుగుడాట్‌ కాం రిమార్క్స్‌ సినిమా విజయానికి కీలకమైన సెకండాఫ్‌ చప్పగా సాగడంతో సినిమాపై ఏవరేజి ముద్ర పడింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X