twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కోటికొక్కడు’ రివ్యూ: రోటీన్‌ కమర్షియల్ ఎంటర్టెనర్

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    Star Cast: సుదీప్‌, నిత్యమీనన్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌
    Director: కె.ఎస్‌. రవికుమార్‌

    Recommended Video

    Kotikokkadu Movie Review

    కన్నడ నటుడు సుదీప్‌ 'ఈగ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బాహుబలి సినిమాలోనూ ఓ చిన్న రోల్ చేయడం ద్వారా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సుదీప్ నటించిన 'కోటిగొబ్బ-2' చిత్రం తమిళం, కన్నడలో విడుదలైన అక్కడ మంచి విజయం సాధించింది. రెండు భాషల్లో మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో 'కోటికొక్కడు' పేరుతో అనువాదం చేసి విడుదల చేశారు. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విశేషాలు ఏమిటో రివ్యూలో చూద్దాం....

     కథ ఏమిటంటే...

    కథ ఏమిటంటే...

    సత్యం (సుదీప్) రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. మంచి పనులు చేస్తూ మంచి వాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. సత్యంలో ఎవరికీ తెలియని మరోకోణం దొంగతనాలు, దోపీడీలు. శివం పేరుతో బడాబాబుల వద్ద మూలుగుతున్న వందలకోట్ల నల్లధాన్ని దోచేస్తూ ఉంటాడు. అయితే బయటి ప్రపంచాన్ని తాము ఇద్దరం అని..... తన అన్నయ్య శివం దొంగతనాలు, దోపిడీలు చేస్తూ తనకు తలవంపులు తెస్తున్నాడని నమ్మిస్తూ ఉంటాడు. సత్యం, శివం ఇద్దరు కాదు... ఒకడే అని నిరూపించేందుకు అసిస్టెంట్ కమీషనర్(రవిశంకర్) ప్రయత్నిస్తుంటాడు. మరి సత్యం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు? అనేది మిగతా కథ.

     హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్

    హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్

    యాక్టింగ్ పరంగా సుదీప్‌కు వంక పెట్టాల్సింది ఏమీ లేదు. అటు సత్యం, ఇటు శివం పాత్రల్లో అదరగొట్టాడు. సుదీప్ ప్రియురాలి పాత్రలో హీరోయిన్ నిత్య మీనన్ లిమిటెడ్ రోల్‌లో కనిపించింది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేక పోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది.

    ముఖ్యపాత్రలో ప్రకాష్ రాజ్

    ముఖ్యపాత్రలో ప్రకాష్ రాజ్

    ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. హీరో తండ్రిగా కథలో అత్యంత కీలకంగా అతడి పాత్ర ఉంది. ప్రకాష్ రాజ్ స్క్రీన్ మీద కనిపించంత సేపు సినిమా ఎమోషనల్‌గా సాగింది. తనదైన నటనతో ప్రకాష్ మరోసారి అదరగొట్టాడు. ముఖేష్ తివారి, హరత్ లోహితశ్వా, అవినాష్ తదితరులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

     టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే రాజారత్నం సినిమాటోగ్రఫీ ఓకే. తెలుగు వెర్షన్‌కు శంశాంక్‌ వెన్నెల కంటి అందించిన డైలాగులు ఫర్వాలేదనే విధంగా ఉంది. డి. ఇమ్మాన్‌ సంగీతం యావరేజ్ గా ఉంది. ప్రవీణ్‌ ఆంటోని ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. సినిమా చాలా లెంతీగా ఉంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో చాలా సాగదీశారు. ఇందులో అనవసరమైన సీన్లు ఎత్తేస్తే బావుండేది. కనల్‌కణ్ణన్‌ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు రోటీన్‌గా ఉన్నాయి.

    ఆకట్టుకోని కథ, కథనం

    ఆకట్టుకోని కథ, కథనం

    సినిమా కథ అంత గొప్పగా ఏమీ లేదు. కొత్తదనం కూడా లోపించింది. స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉంది. ఫస్టాఫ్‌లో సినిమాను నడిపించడానికి దర్శకుడు రోటీన్ సీన్లతో నింపేశారు. సెకండాఫ్‌లో ప్రకాష్ రాజ్ పోర్షన్ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది.

     డైరక్టర్ కెఎస్ రవికుమార్ రొటీన్ ఫార్ములా

    డైరక్టర్ కెఎస్ రవికుమార్ రొటీన్ ఫార్ములా

    దర్శకుడు కెఎస్ రవి కుమార్ ఇప్పటి వరకు చాలా హిట్ సినిమాలు అందించారు. ఆయన తన రోటీన్ కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతూ సినిమాను తెరకెక్కించారు. అయితే కథ, కథనంలో కొత్తదనం అయితే కనిపించలేదు. కామెడీ కూడా పెద్దగా పండలేదు. యాక్షన్ పార్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు.

     ఫస్టాఫ్, సెకండాఫ్

    ఫస్టాఫ్, సెకండాఫ్

    సినిమా తొలి భాగం సత్యం, శివం పాత్రల గురించి జనాలకు వివరించడానికే సరిపోయింది. దీనికి ఓ లవ్ స్టోరీ జోడించి మరింత సాగదీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. రెండో భాగంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కాస్త ఫర్వాలేదు. క్లైమాక్స్ అంత గొప్పగా లేక పోయినా జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.

     ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్: హీరో సుదీప్, ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్, ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే స్టోరీ.

    మైనస్ పాయింట్స్ : రోటీన్‌గా సాగే కథ- కథనం, సాగదీసినట్లు ఉండే ఫస్ట్ హాఫ్.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    'కోటిగొబ్బ-2' చిత్రం 2016లో వస్తే........ 2018లో అనువాద వెర్షన్ ‘కోటికొక్కడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ప్రజంట్ టాలీవుడ్లో నడుస్తున్న ట్రెండుకు సెట్టయ్యే సినిమా అయితే కాదు. ఎ క్లాస్ సెంటర్లలో ఇలాంటి ఫార్ములా వర్కౌట్ అయ్యే రోజులు ప్రస్తుతం అయితే లేవు. బి,సి సెంటర్ల ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అనేదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది.

    కోటికొక్కడు

    కోటికొక్కడు

    తారాగణం: సుదీప్‌, నిత్యమీనన్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌ తదితరులు

    ఫొటోగ్రఫీ: రాజారత్నం
    డైలాగ్స్‌: శశాంక్‌ వెన్నెల కంటి
    సాహిత్యం: భువనచంద్ర, వెన్నెలకంటి, రాకేందు మౌళి
    సంగీతం: డి. ఇమ్మాన్‌
    ఎడిటింగ్‌: ప్రవీణ్‌ ఆంటోని
    స్టంట్స్‌: కనల్‌కణ్ణన్‌
    కథ: టి. శివకుమార్‌
    నిర్మాత: కళ్యాణ్‌ ధూళిపాళ్ల
    దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌

    English summary
    Kotikokkadu is a Telugu movie released on 9 Mar, 2018. The movie is directed by K.S. Ravikumar and featured Kicchaa Sudeep, Nithya Menen, prakash raj and Nasser as lead characters. Other popular actors who were roped in for Kotikokkadu are Nasser, Mukesh Tiwari, Delhi Ganesh, Sadhu Kokila and Sharath Lohitashwa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X